the Supreme Court judge
-
శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ చలమేశ్వర్
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె. చలమేశ్వర్ తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్రావు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం వారు వేర్వేరుగా ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత శ్రీవారిని, ఆ తర్వాత వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
తిరుమలలో తగ్గని రద్దీ
తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయానికి 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఉచిత దర్శనానికి 10 గంటలు, కాలినడక భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు జడ్జి తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి గోపాల్గౌడ్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయమర్యాదల ప్రకారం అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. -
కల్యాణ వెంకటేశ్వరస్వామి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వెంకటేశ్వరస్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజన్ గగోయ్ కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయఅధికారులు స్వాగతం పలికారు.