అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
గుంతకల్లు టౌన్: తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడే కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన అంతర్రాష్ట్ర దొంగ సురేష్ గౌడ్‌ను ఎట్టకేలకు ఒన్‌టౌన్ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.2.70 లక్షలు విలువచేసే 13.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రూరల్ సీఐ గురునాథ బాబు, ఒన్‌టౌన్ ఎస్సై నగేష్‌బాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉదయం రైల్వే క్యాంటీన్ సమీపంలో నిందితుడు అనుమానాస్సదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని విచారించామన్నారు.
ఎనిమిది నెలల కిందట హంపయ్య కాలనీ, రెండు నెలల కిందట హనుమేష్‌నగర్‌లో తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు వారు తెలిపారు. దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై నగేష్, కానిస్టేబుల్ రామాంజనేయులు, నారాయణమూర్తిలను సీఐ అభినందించారు.