నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం!
జడ్చర్ల, న్యూస్‌లైన్ : సబ్ స్టేషన్ నిర్మాణ పనుల్లో భాగంగా లై న్ బిగిస్తుండగా తీగలు తగిలి విద్యుదాఘాతాని కి గురై ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మ రొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వె ళితే... ఇటీవల జడ్చర్ల మండలం గంగాపూర్ శి వారులో కొత్తగా 33/11 కేవీ సబ్ స్టేషన్ ని ర్మాణ చేపట్టారు. ఇందులో భాగంగా స్తంభాల కు కొన్నిరోజుల క్రితం తీగలు బిగించారు. అ యితే అవి కిందకు వేలాడుతుండడంతో సరిచేసేందుకుగాను సంబంధిత కాంట్రాక్టర్ ఆది వారం సాయంత్రం కూలీలను పనుల్లోకి దిం చారు. వీరిలో మహబూబ్‌నగర్ మండలం రాం చంద్రాపురానికి చెందిన మహేశ్ (22), దేవరక ద్ర మండలం గూరకొండ వాసి బాలు ఉన్నారు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న 11 కేవీ పాత లైన్‌కు సబ్‌స్టేషన్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మహేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, బాలుకు తీవ్ర గాయాలయ్యాయి.
ఇది గమనించిన అక్కడివారు వెంటనే బాధితుడిని వెంటనే ఆటోలో ఎనుగొండలోని ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. మహేశ్ అవివాహితుడు కాగా బాలుకు భార్య శివలీల ఉంది. ఇదిలాఉండగా సబ్‌స్టేషన్ నిర్మాణ సమయంలో ఉన్నపుడు మరో 11 కేవీకి సంబంధించి లైన్ క్లియర్ తీసుకుని పనులు చేయాల్సి ఉన్నా కాంట్రాక్టర్, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగు చర్య తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.