25న తెరపైకి ఊపిరి
ఇటీవల కాలంలో చాలా ఇంటెన్షన్‌కు గురి చేస్తున్న చిత్రం తోళా. తెలుగులో ఊపిరి పేరుతో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రం టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, మిల్కీ బ్యూటీ తమన్నా వంటి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం కావడమే తోళా చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. జయసుధ, ప్రకాశ్‌రాజ్, వివేక్, కల్పన ముఖ్యపాత్రలు పోషించిన ఈ భారీ చిత్రాన్ని పీవీపీ సినిమా సంస్థ నిర్మించింది. టాలీవుడ్ యువ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించిన ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతాన్ని అందించారు.
రెండు వారాల క్రితం విడుదలైన చిత్ర గీతాలు, ఇటీవలే విడుదలైన ప్రచార చిత్రం ప్రేక్షకుల మధ్య విశేష స్పందనను పొందాయి.అలాగే చిత్ర టీజర్ అత్యధిక లైక్‌లను సొంతం చేసుకోవడంతో తోళా చిత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. నాగార్జున చాలా ఏళ్ల క్రితం ఇదయతై తిరుడాదే నేరు చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులను అలరించారు. ఆ తరువాత ఆయన నటించిన తమిళ చిత్రం ఇదే. ఇక పోతే మెడ్రాస్, కొంబన్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాల తరువాత కార్తీ నటించిన చిత్రం ఇది.
దీంతో ఆ చిత్రం సాధించే విజయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో నాగార్జున రెండు కాళ్లు చచ్చుపడ్డ అపర కుభేరుడి పాత్రలో నటించారు. ఆయన సహాయకుడిగా కార్తీ ఈయన ప్రేయసిగా తమన్నా అంటూ చాలా ఉత్సుకత రేకెత్తించే పాత్రల్లో నటించారు. 60 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మించిన చిత్రం ఇదని నిర్మాత పేర్కొన్నారు. తోళా చిత్రాన్ని రెండు భాషల్లోనూ ఈ నెల 25న పెద్ద ఎత్తున్న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించారు.