tarimela nagi reddy
-
పీడిత ప్రజల విముక్తి కోసం...
కమ్యూనిస్టు విప్లవోద్యమ అగ్రనాయకుల్లో ఒకరైన కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి రహస్యజీవితం గడుపుతూ 1976 జూలై 28న అనారోగ్యంతో అమరులయ్యారు. భారత విప్లవ రాజకీయ రంగంలో 35 ఏళ్లకు పైగా వెలుగొంది ‘టీఎన్’గా సుపరిచితులై పీడిత ప్రజల హృదయాలలో ఆయన శాశ్వత స్థానం సంపాదించారు.కా‘‘ తరిమెల నాగిరెడ్డి 1917 ఫిబ్రవరి 11న అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో పుట్టారు. తాను భూస్వామ్య కుటుంబంలో జన్మించినా దేశంలో కొనసాగుతున్న ఫ్యూడల్ దోపిడీ వ్యవస్థను భూస్థాపితం చేయటానికి, దోపిడీ పీడనలులేని సమ సమాజస్థాపనకు తన సర్వస్వాన్ని అర్పించి దేశవ్యాప్తంగా విశేష ప్రజాదరణ పొందారు.విద్యార్థి దశలోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. బెనారసు విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘానికి అధ్యక్షునిగా 1939లో ఎన్నికైన తొలి ఆంధ్రుడు ఈయనే. బెనారసు విశ్వవిద్యాలయంలోనే కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. లా చదువుకు స్వస్తిచెప్పి ఎం.ఏ. పట్టాతో విశ్వవిద్యాలయాన్ని వదలగానే యువకులను ఉద్యమాల్లోకి సమీకరించే కృషిని ప్రారంభించారు. కార్మికులు, రైతాంగం కొరకు ఉద్యమించారు. 1940లో ‘యుద్ధం దాని ఆర్థిక ప్రభావం’ అన్న చిన్న పుస్తకాన్ని ప్రచురించి నందుకు 23 ఏండ్ల యువకునిగా ఉన్నప్పుడే బ్రిటిష్ ప్రభుత్వం విధించిన ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్షను అనుభవించారు.తన కంచుకంఠంతో పండిత పామరులను ఉర్రూతలూగించి కమ్యూనిస్టు విప్లవ రాజకీయాలను దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేశారు. అసెంబ్లీ, పార్లమెంటులో ఆయన ఉపన్యాసాలను అధికార, ప్రతిపక్ష సభ్యులు ఆసక్తితో, శ్రద్ధతో వినేవారు. భారత విప్లవోద్యమ రంగంలో కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు (డీవీ)తో కలిసి మనదేశ పీడిత ప్రజల విముక్తికి అవసరమైన సరైన విప్లవపంథాను రూపకల్పన చేయడంలో, ఈ విప్లవ పంథాను దేశమంతటా ప్రచారంచేసి వ్యాపింపచేయటంలో టీఎన్ చారిత్రాత్మకమైన పాత్ర నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయన పాలకుల తీవ్రనిర్బంధానికి గురయ్యారు. అరెస్టులు, జైలుశిక్షలు, అజ్ఞాతవాసాలకు వెరువలేదు. ఆయనపైనా, మరో 60మందిపైనా పెట్టిన కుట్రకేసు విచారణ సందర్భంగా జైలులో ఉన్నపుడు (1970–72) ఆయన భారత ఆర్థిక వ్యవస్థపై ‘తాకట్టులో భారతదేశం’ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించారు. దానిని కోర్టులో ఒక ప్రకటన రూపంలో చదివారు. సరైన మార్క్సిస్టు లెనినిస్టు విశ్లేషణతో ఆ పుస్తకంలో ఆయన చేసిన నిర్ధారణలు నేటికీ అక్షరసత్యాలే. అవి కమ్యూనిస్టు విప్లవకారులకు, ప్రజాతంత్రశక్తులకూ భావి కార్యాచరణకు మార్గదర్శక సూత్రాలుగా పనిచేస్తాయి.1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తన బావ సంజీవరెడ్డిని ఓడించి అనంతపురం శాసనసభ్యునిగా తొలిసారిగా ఎన్నికయ్యారు. 35 ఏళ్ళ వయస్సులోనే మద్రాసు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా తన రాజకీయ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించారు. 1969 మార్చిలో తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామాచేసి అసెంబ్లీలో సంచలనాత్మకమైన ఉపన్యాసాన్ని ఇచ్చారు. పాలకవర్గాలు దేశాన్ని విదేశీ పెట్టుబడిదారులకు తాకట్టు పెడ్తూ వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే విధానాలను, భూస్వాముల ప్రయోజనాలను పరిరక్షించే విధానాలను అనుసరిస్తున్నారని అన్నారు. దేశాభివృద్ధికంటే రక్షణ చర్యలకే ప్రాధాన్యతనిస్తూ పెరుగుతున్న ఆర్థిక సంక్షోభాన్ని నివారించే చర్యలను అసెంబ్లీ, పార్లమెంటు చేపట్టకుండా ఈ సంక్షోభ తీవ్రతను మరింతగా పెంచే ప్రజావ్యతిరేక విధానాలను అవి అవలంబిస్తున్నాయని చెప్తూ ‘‘జనాల్ని కదిలిస్తే తప్ప పాలకుల దోపిడీ, దౌర్జన్యాలు అంతం’’ కావని వ్యాఖ్యానించారు. 1975లో డీవీతో కలిసి యూసీసీఆర్ఐ (ఎమ్ఎల్) ను స్థాపించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తన జీవితకాలమంతటా అత్యున్నత విప్లవ ప్రమాణాలను పాటించారు. ఆయన స్మృతి నిరంతరం ప్రజలను విప్లవ కర్తవ్యోన్ముఖులను చేస్తూనే వుంటుంది. సి. భాస్కర్ ‘ యూసీసీఆర్ఐ (ఎమ్ఎల్) -
కమ్యూనిస్టు విప్లవయోధుడు
కమ్యూనిస్టు విప్లవోద్యమ అగ్రనాయకుల్లో ఒకరైన కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి (టీఎన్) జన్మించి ఈ ఫిబ్రవరి 11 నాటికి 107 సంవత్సరాలు. భారత విప్లవ రాజకీయరంగంలో 35 ఏళ్లకు పైగా వెలుగొంది పీడిత ప్రజల హృదయాలలో ఆయన శాశ్వత స్థానం సంపాదించారు. తరిమెల నాగిరెడ్డి 1917లో అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో పుట్టారు. తాను భూస్వామ్య కుటుంబంలో జన్మించినా దేశంలో కొనసాగుతున్న ఫ్యూడల్ దోపిడీ వ్యవస్థను భూస్థాపితం చేయటానికి, సమ సమాజ స్థాపనకు తన సర్వస్వాన్నీ అర్పించి దేశవ్యాప్తంగా విశేష ప్రజాదరణ పొందారు. టీఎన్ ఎమర్జన్సీ కాలంలో వెంకట్రామయ్య అనే మారు పేరుతో ఉస్మానియా ఆసుపత్రిలో చేరి 1976 జూలై 28న అమరులైనారు. తన విద్యార్థి దశలోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. బెనారస్ విశ్వవిద్యాలయంలో చదువుతూ కమ్యూ నిస్టు పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. చదువు అయిన వెంటనే కార్మిక, కర్షకుల కొరకు ఉద్యమించారు. 1940లో ‘యుద్ధం– దాని ఆర్థిక ప్రభావం’ అనే పుస్తకాన్ని ప్రచురించి ఏడాది కఠిన కారా గారశిక్షను అనుభవించారు. కా‘‘ టీఎన్ చక్కని వక్త. అసెంబ్లీ, పార్లమెంట్లో ఆయన ఉపన్యాసాలను అధికార, ప్రతిపక్ష సభ్యులు శ్రద్ధతో వినేవారు. కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు (డీవీ)తో కలిసి మనదేశ పీడిత ప్రజల విముక్తికి అవసరమైన సరైన విప్లవపంథాను రూపకల్పన చేయడంలో, ఈ పంథాను దేశమంతటా వ్యాపింప చేయటంలో చరిత్రాత్మకమైన పాత్రను నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన పైనా, మరో 60 మందిపైనా పెట్టిన కుట్రకేసు విచా రణ సందర్భంగా జైలులో ఉన్నపుడు (1970–72) ఆయన ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థపై ‘తాకట్టులో భారతదేశం’ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించారు. దానిని కోర్టులో ఒక ప్రకటన రూపంలో చదివారు. ఆ పుస్తకంలో ఆయన చేసిన నిర్ధారణలు నేటికీ అక్షర సత్యాలే. 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తన బావ నీలం సంజీవరెడ్డిని ఓడించి అనంతపురం శాసనసభ్యునిగా తొలిసారిగా ఎన్నికయ్యారు. 35 ఏళ్ళ వయస్సులోనే మద్రాసు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా తన రాజకీయ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించారు. 1969 మార్చిలో తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి అసెంబ్లీలో సంచల నాత్మకమైన ఉపన్యాసాన్ని ఇచ్చారు. పాలకవర్గాలు దేశాన్ని విదేశీ పెట్టుబడిదారులకు తాకట్టు పెడ్తూ వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే విధానాలనూ, భూస్వాముల ప్రయోజనాలనూ పరిరక్షించే విధా నాలను అనుసరిస్తున్నాయనీ అన్నారు. దేశాభివృద్ధి కంటే రక్షణ చర్యలకే ప్రాధాన్యతనిస్తూ పెరుగు తున్న ఆర్థిక సంక్షోభాన్ని నివారించే చర్యలను అసెంబ్లీ, పార్లమెంటులు చేపట్టకుండా ఈ సంక్షోభ తీవ్రతను మరింతగా పెంచే విధానాలను అవలంబి స్తున్నాయనీ అన్నారు. ఆయన భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రవేశించిన మితవాద, అతివాద, అవకాశవాదా లకూ, తప్పుడు ధోరణులకూ వ్యతిరేకంగా డీవీతో కలిసి రాజీలేని పోరాటం నిర్వహించి సరైన విప్లవ పంథాను పరిరక్షించారు. ఈ క్రమంలోనే 1975లో కా‘‘ డీవీతో కలిసి యూసీసీఆర్ (ఎమ్ఎల్)ను స్థాపించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కా‘‘ టీఎన్ తన జీవితకాలమంతటా అత్యున్నత విప్లవ ప్రమా ణాలను పాటించారు. – సి. భాస్కర్, యూసీసీఆర్ (ఎమ్ఎల్) (నేడు కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి జయంతి) -
వీరులార మీకు పరి పరి దండాలు!
‘అనంత’ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగిన ఆదర్శవంతమైన జీవితం ఆయన సొంతం. సీమాంధ్ర చరిత్రనే కాదు జాతీయ రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన ఆయన పోరాటం విలక్షణం. అనితర సాధ్యం. ‘వీరులార మీకు పరి పరి దండాలు’ అంటూ ప్రజలు ఆర్తిగా పాడుకునే పాటలకు స్ఫూర్తిగా నిలచిన ఆయనే తరిమెల నాగిరెడ్డి. ఆ మహనీయుడి వర్ధంతిని నేడు (ఆదివారం) అభిమానులు ఘనంగా జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలు మీకోసం.. – అనంతపురం కల్చరల్ విద్యార్థి దశలోనే రచయితగా.. 1917 ఫిబ్రవరి 11న శింగనమల మండలం తరిమెలగ్రామానికి చెందిన సుబ్బారెడ్డి, ఆది లక్ష్మమ్మలకు జన్మించారు నాగిరెడ్డి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రిషివ్యాలి విద్యాలయంలో నీలం సంజీవరెడ్డితో కలసి విద్యాభ్యాసం చేశారు. ఆ కాలంలోనే దేశకాల పరిస్థితులు తెలిసిన రచయితగా, మానవత్వం పరిమళించిన మనిషిగా అనేక పుస్తకాలను రచించారు. ముఖ్యంగా 1940లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులలో ‘యుద్ధము– ఆర్థిక ప్రభావం’ అన్న రచనతో అందరిని ఆలోచింపజేశారు. 1941లో కమ్యూనిస్టు సిద్ధాంతాలను వ్యతిరేకించిన బ్రిటీష్ ప్రభుత్వం తరిమెల నాగిరెడ్డిని తిరుచిరాపల్లి కారా గారంలో బంధించింది. ప్రజాప్రతినిధిగానూ.. మద్రాసు లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబరుగా, లోకసభ సభ్యునిగా, కమ్యూనిస్టు పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నాగిరెడ్డి ఎన్నికయ్యారు. ప్రజలకు నిరుపమాన సేవలందించారు. మార్క్సిజం జీవన గమ్యంగా తన జీవితాన్ని అణగారిన బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికే ఆయన అంకితం చేశారు. వారి ఆప్తబంధువుగా నిలిచారు. నీలం సంజీవరెడ్డినీ ఓడించారు.. ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి ఎరుగని నేతగా తరిమెల పేరుగాంచారు. జీవితాంతం విలువలు పాటించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. దీంతోనే మేరునగ ధీరుడైన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిని సైతం 1952 ఎన్నికల సంగ్రామంలో ఓడించగలిగారు. ‘వీరులారా మీకు పరి పరి దండాలు’ అంటూ ప్రజానీకం ఆర్తిగా పాడుకునే పాటలకు స్పూర్తిగా నిలచిన తరిమెల నాగిరెడ్డి జీవితమే పఠనీయ గ్రంథమని ఎంతో మంది జాతీయ నాయకులే కొనియాడడం ఆయన నిబద్ధతకు అద్దం పడుతుంది. పేదల కోసం తన జీవితాన్నే అంకితం చేసిన తరిమెల 1976లో రహస్య జీవితం గడుపుతూ మరణించారు. దేవులపల్లితో కలిసి అడుగులు కమ్యూనిస్టు దిక్సూచిగా నిలిచిన నేతగా తరిమెల నాగిరెడ్డిది విలక్షణ జీవన విధానం. 1964లో కమ్యూనిస్టులు రెండుగా చీలిన తర్వాత దేవులపల్లి వెంకటేశ్వరరావుతో విప్లవకారుల సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని పోరాటాలు చేశారు. దీంతోనే నాగిరెడ్డితో పాటు దేవులపల్లి వర్ధంతిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నేడు విప్లవవీరుల సంస్మరణ: రైతు కూలీల తరఫున పోరాటాలెన్నో చేసి చిరస్మరణీయుడిగా మారిన తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వేంకటేశ్వరరావు వర్ధంతిని ఆదివారం సాయంత్రం స్థానిక ఉపాధ్యాయభవన్‌లో ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నాయకులు సుబ్బారెడ్డి, బాలు, భాస్కర్, అజయ్‌రెడ్డి తదితరులు ఆత్మీయ అతిథులుగా విచ్చేసి ప్రసంగించనున్నారు. కమ్యూనిస్టు శ్రేయోభిలాషులు, ప్రజాతంత్ర వాదులు సంస్మరణ సభకు హాజరై నివాళులర్పించాలని యూసీసీఆర్ఐ (ఎం.ఎల్.) జిల్లా కార్యదర్శి భాస్కర్ ఓ ప్రకటనలో కోరారు. -
జన జ్వాలాదీప్తి
మన తరిమెల నాగిరెడ్డి – మానవతా మూర్తి మనందరి స్ఫూర్తి జగమెరిగిన నాగిరెడ్డి – జగజగీయమూర్తి/ కీర్తి జన జ్వాలాదీప్తి అరుణారుణ వజ్రఖచిత ఖడ్గధితర నాగిరెడ్డి అణువణువున కరిగె దయా కరుణధార నాగిరెడ్డి క్షణం – క్షణం అనుక్షణం – రణరంగంలాగా కదిలినాడు దినం – దినం జీవితాన్ని – పణం పెట్టి నిలిచినాడు జననం – మరణం – మధ్యన జనం కొరకు బతికినాడు ‘‘మన‘‘ తెల్లవాడు – నల్లవాడు ఇద్దరి పరిపాలనలో రాజద్రోహి ముద్రపడిన మాతృభూమి ప్రేమికుడు జీవితమే భారతీయ కమ్యూనిస్టు చరిత్రగా విప్లవజెండా పట్టిన అనంతమహాత్ముడతడు కటకటాల జైలులోన మల్లెలు పూయించినాడు స్నేహం – స్వేచ్ఛా– విప్లవ కపోతమై బతికినాడు బావమరిది – ముఖ్యమంత్రి పీఠంపై ఉంటేనేం కడదాకా తనది ప్రజా హృదయ పీఠమన్నాడు వర్గ శత్రువుల వైపున – కన్న తండ్రి ఉన్నా సరే ‘ఖబడ్దార్’ అని చెప్పిన కమ్యూనిస్టు నిబద్ధుడు బాతాఖాని షాపని – అసెంబ్లీని వదిలిపెట్టి ఆఖరి ఊపిరిదాకా ఆగని రణ యాత్రికుడు స్పష్టత – సమకాలీనత– నిజాయితీ – దూరదృష్టి సమరూపుడే నాయకుడని ఆచరణలో చూపినాడు ‘‘మన‘‘ విదేశీ అప్పులను తెచ్చి – స్వదేశీ పత్రికలలోన సదా పోజుకొట్టే ముఖ్యమంత్రి – ప్రధానమంత్రులను ఎన్నాళ్లీ – భారతాన్ని తాకట్టులో పెడతారని ఏనాడో ప్రశ్నించిన ఎరుపెక్కిన కాలజ్ఞాని మార్క్స్ చెప్పే సమసమాజ భావనకై పోరాడే కమ్యూనిస్టులెప్పుడు జాతి వ్యతిరేకులు కాదంటూ విదేశీయ కంపెనీల – ప్రపంచబ్యాంకు దళారుల ఆజ్ఞలకు తలవంచిన – నాటి – నేటి పాలకులే భారత జాతీయతకు విఘాతకులు అన్నాడు మిత – అతి – అవకాశవాదాలకు ఎదురునిల్చి పూలను – రాలను ప్రేమగా అందుకున్న స్థితప్రజ్ఞుడు ప్రజానేత ‘‘మన‘‘ చీలినారు కమ్యూనిస్టు వీరులని స్వార్థపరులు తమ చంకలు గుద్దుకొని గద్దెలపై వుండనిండి ఏదో ఒక రోజు – మన కమ్యూనిస్టు పార్టీలు ఏకమై ఎర్రజెండ ఎగరేస్తాయన్నాడు మార్క్సిజాన్ని మన దేశపు ప్రజల సంస్కృతులతోని కలగలిసిన నాడె ప్రజలు కలిసొస్తారన్నాడు నిజం – కమ్యూనిజం – భువిని పాలించుట తథ్యమన్నాడు కమ్యూనిస్టు విశ్వరూప కదన గీత పలికినాడు ‘‘మన‘‘ (నేడు తరిమెల నాగిరెడ్డి 42వ వర్ధంతి సందర్భంగా) – సుద్దాల అశోక్‌తేజ ప్రముఖ కవి, గీత రచయిత -
'చంద్రబాబులాంటి నాయకుడు మనకు అవసరమా?'
-
'తరిమెల నాగిరెడ్డి ఉంటే చంద్రబాబును ఏం చేసేవారో'
సాక్షి, తరిమెల : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనను తరిమెల నాగిరెడ్డి చూసి ఉంటే ఏం చేసేవారో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబులాంటి నాయకుడు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. తరిమెల నాగిరెడ్డిని ప్రజలు నేటికి మర్చిపోలేరని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెన్నా నది మీదుగా తరిమెల గ్రామానికి వంతెన కావాలని అడుగుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 28వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని తరిమెల గ్రామంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ నాలుగేళ్లుగా చంద్రబాబు చేస్తున్న మోసాలను ఎండగట్టారు. 'తరిమెల గ్రామం రాజకీయంగా చైతన్యవంతమైనది.. ఈ గ్రామం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మట్టి నుంచి పెద్దపెద్ద నాయకులు వచ్చారు. తరిమెల నాగిరెడ్డిని నేటికి మర్చిపోలేరు. నాలుగేళ్లలో చంద్రబాబు పాలన చూశాక మనం ఇక్కడ ఏకమయ్యాం. నాలుగేళ్లుగా చంద్రబాబుది అబద్ధాల, మోసాల పాలన, న్యాయం ధర్మం లేని పరిపాలన. రాజధాని దగ్గర నుంచి గుడి భూముల వరకు, ఇసుక నుంచి మట్టి వరకు, చంద్రబాబు దగ్గర నుంచి గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీల స్థాయి వరకు అంతటా అవినీతి కూరుకుపోయింది. గ్రామాల్లో పెన్షన్‌కు, బియ్యానికి, మరుగుదొడ్లకు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు చంద్రబాబు ఏం మాటలు చెప్పారో ఓసారి నాలుగేళ్లు వెనక్కు వెళ్లి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇలాంటి వ్యక్తిని(చంద్రబాబును) చూశాక మనకు ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచించుకోవాలి. అధికారంలోకి రాకమునుపు కరెంట్ బిల్లులు తగ్గిస్తానని చెప్పిన చంద్రబాబు ఏంచేశారు? నాలుగేళ్ల కిందట కరెంట్ బిల్లు రూ.50 లేదా అసలు వచ్చేదే కాదు.. కానీ, బాబు పాలనలో కరెంటు బిల్లు రూ.500, రూ.1000 వరకు వస్తోంది. నాడు రేషన్ షాపుల్లో బియ్యంతోపాటు నిత్యవసర సరుకులు అన్ని దొరికేవి. కానీ, ఇప్పుడు మాత్రం రేషన్ షాపులో బియ్యం తప్ప ఏమీ దొరకని పరిస్థితి ఉంది. ఆ బియ్యం కూడా ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటే ఇద్దరికైనా కటింగ్ పెడుతున్నారు. జాబు రావాలంటే బాబు రావాలని అన్నారు.. జాబు లేని యువతకు నెలకు రూ.2000 ఇస్తానని చెప్పారు. ఆ చొప్పున ప్రతి ఇంటికి చంద్రబాబు రూ.90 వేలు బాకీ పడ్డారు. అధికారంలోకి రావడం కోసం బ్యాంకుల్లో పెట్టిన మహిళల బంగారం ఇప్పిస్తానని మోసం చేశారు' -
యాభై ఏళ్ల కిందటే దేశ భవితవ్యాన్ని తరిమెల చెప్పారు
‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి హైదరాబాద్ : రానున్న కాలంలో భారతదేశం పెట్టుబడిదారీ వ్యవస్థలో మునిగితేలుతుందనే విషయాన్ని తరిమెల నాగిరెడ్డి 50ఏళ్ల క్రితమే చెప్పి దేశస్థితిని అంచనా వేశారని ‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియుల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. ఆయన చెప్పినది నూటికి నూరు శాతం ఇప్పుడున్న ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయన్నారు. తరిమెల నాగిరెడ్డి శతజయంతి’ వేడుకలు గురువారం సుందరయ్య భవన్లో ‘తరిమెల నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్టు’ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న రామచంద్రమూర్తి మాట్లాడుతూ పలువురు నాగిరెడ్డి గురించి వ్యాసం రాయమని తనను సంప్రదించినా రాయలేదన్నారు. ఆయన గురించి రాసేటంత పరిజ్ఞానం, సాన్నిహిత్యం తనకు లేకపోవడమే అందుకు కారణమన్నారు. కానీ కమ్యూనిస్టు ఉద్యమంలో నాగిరెడ్డి పాత్ర, ఆర్థిక శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తీరు, ప్రపంచ విషయాల పట్ల ఆయనకున్న అపార అవగాహన వంటి విషయాలను తెలుసుకొన్నానని తరిమెల గొప్పతనం గురించి కొనియాడారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ నాగిరెడ్డి రాసిన ‘తాకట్లో భారతదేశం’ పుస్తకం తనను ఎంతగానో ప్రభావితం చేసి ఉద్యమం వైపు నడిపించిందన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి కె.ఆర్.వేణుగోపాల్ మాట్లాడుతూ 1957 సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన నాగిరెడ్డి శాసనసభలో సభ్యుల తీరు చూసి ఆవేదన చెందారన్నారు. విప్లవోద్యమ నిర్మాణానికి పూనుకోవాల్సిన సమయాన్ని ఇక్కడ నిరర్థక చర్చలతో దుర్వినియోగం చేయకూడదని భావించి 1969 మార్చి 16న శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి పోరాటాన్ని కొనసాగించారన్నారు. ట్రస్ట్ నిర్వాహకుడు ఘంటా వెంకటరావు అధ్యక్షతన జరిగిన సభలో తొలుత నాగిరెడ్డి చిత్రపటానికి అతిథులంతా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ‘ప్రజాసేవలో తరిమెల నాగిరెడ్డి’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. జనశక్తి ఎడిటర్ పి.జశ్వంత్, సీనియర్ సంపాదకుడు రాఘవాచారి తదితరులు పాల్గొన్నారు. -
పాలకుల ‘తాకట్టు’ గుట్టు విప్పిన తరిమెల
భారతదేశం తన జాతీయతను సమున్న తంగా నిలుపుకోవాలని ఆకాంక్షిస్తూ తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన సమరయోధుల్లో తరిమెల నాగిరెడ్డి ఒకరు. వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, గాంధీ ప్రభావం నుంచి మార్క్సిజం వైపు ఆకర్షితులై పీడిత ప్రజల కోసం నిరంతరం తపించిన వ్యక్తి తరిమెల నాగిరెడ్డి. ‘యుద్ధం దాని ఆర్థిక ప్రభా వాలు’ అన్న పుస్తక ప్రచురణకు గాను 1940లో ఆయనపై బ్రిటిష్ ప్రభు త్వం రాజద్రోహం నేరం మోపి రెండేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. 1969లో అదే రాజద్రోహ నేరంతో ఆయనకు భారత పాలకులు కూడా నాలుగేళ్ల శిక్ష విధించారు. నాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు ఉద్యమంలో అత్యంత కాలం జైళ్లల్లో లేదా రహస్య జీవితంలో గడిపారు. మద్రాసు ప్రెసిడెన్సీలో కర్నూలు రాజధానిగా గల ఆంధ్ర ప్రదేశ్‌లో లేదా హైదరాబాద్ రాజధానిగా గల అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగారు. పార్లమెంట్ సభ్యుడిగా, అకౌంట్స్ కమిటీ అధ్యక్షుడిగా కూడా ఆయన కొనసాగారు. నాగిరెడ్డి గొప్ప ఆర్థికవేత్త. మార్క్సిస్టు దృక్పథంతో భారత ఆర్థిక వ్యవస్థను అనితరసాధ్యంగా విశ్లేషించారు. 1969-70 మధ్యనే ఆయన తన కోర్టు ప్రకటనలో ‘భారతదేశం తాకట్టు’కు గురైందని ప్రకటిం చారు. అంతకుముందు ఆయన అసెంబ్లీకి రాజీనామా చేసినప్పుడు.. భారత పాలకులు కార్పొరేట్ రంగం కోసం, ప్రపంచ బ్యాంక్ ప్రయోజ నాల కోసం ఎలా పని చేస్తున్నారో వివరించారు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించలేదని, నేడు దేశాన్ని పాలించే వారంతా విదేశీ పెట్టుబడిదారులకు, భారతదేశంలోని పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నా రని వీరికి ఏమాత్రం జాతీయత లేదని ఆనాడు ఆయన సంచలనమైన ప్రకటన చేశారు. భారత పాలకులకు దళారీ స్వభావం కలదని నాగిరెడ్డి పదే పదే చెప్పారు. నేడు కార్పొరేట్ రంగం భారత ప్రభుత్వాలను, రాష్ట్ర ప్రభుత్వాలను వారి వారి దశాదిశలను నిర్దేశించడం నిత్యం చూస్తున్నాం. కనీస జాతీయతా భావం కలవారు ఎవరైనా విదేశీ దోపిడీని, స్వదేశంలోని కార్పొరేట్ రంగ కబంధహస్తాల నుండి భారత ప్రజలను వేరుపర్చ డానికి పోరాటం చేస్తారు. ఆ పనినే తరిమెల నాగిరెడ్డి చేశారు. నేడు నాగిరెడ్డి శతజయంతి కార్యక్రమాలు ప్రారంభమవుతు న్నాయి. ఈ సందర్భంగా ఆయన రచించిన ‘తాకట్టులో భారతదేశం’ పుస్తకం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. నాగిరెడ్డి గారి వ్యక్తిత్వం చాలా విలక్షణమైనది. ఆంధ్రప్రదేశ్లోసంపన్న కుటుంబం నుంచి ఎదిగి వచ్చిన నాగిరెడ్డి అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర నిర్బంధం ఎదుర్కొంటూ ఆధునిక వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల ఉస్మా నియా జనరల్ ఆస్పత్రిలో వెంకటరామయ్య అనే మారు పేరుతో జనరల్ వార్డులో పేషెంట్‌గా చేరి 28 జూలై 1976లో మరణించారు. ఒక స్వాతంత్య్ర సమరయోధుడిగా తామ్ర పత్రాలు, పింఛన్లు, భూమి కేటాయింపులు లేదా ఎంపీగా, ఎమ్మెల్యేగా వచ్చే అలవెన్స్‌లను తాను తిరస్కరించారు. ‘ప్రజాసేవలో తరిమెల నాగిరెడ్డి’ పుస్తకంలో అనేక మంది రచయితలు, సామాజికవేత్తలు తమ అనుభవాలను ఎంతో ప్రతిభావంతంగా రచించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో నేడు జరుగనున్న ‘ప్రజాసేవలో తరిమెల నాగిరెడ్డి’ పుస్తకావిష్కరణలో కేఆర్. వేణుగోపాల్ (మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రధాని కార్యాలయం), కె.రామచంద్రమూర్తి (సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్) తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొం టున్నారు. తరిమెల నాగిరెడ్డి స్మారకసంఘం, తరిమెల నాగిరెడ్డి మెమో రియల్ ట్రస్టుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతోంది. తరిమెల నాగిరెడ్డి మరణం మనకందరికీ ఒక పెద్ద సవాల్‌ను, బాధ్య తను విసిరింది. ప్రజల కొరకు సామాజిక న్యాయం కొరకు దీక్షతో పని చేయడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి. (తరిమెల నాగిరెడ్డి శతజయంతి సందర్భంగా నేడు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం గం.10 లకు ‘ప్రజాసేవలో తరిమెల నాగిరెడ్డి’ పుస్తకావిష్కరణ సందర్భంగా) వ్యాసకర్త కదలిక సంపాదకులు మొబైల్ : 99899 04389 - ఇమామ్ -
అవిశ్రాంత విప్లవయోధుడు తరిమెల
విప్లవోద్యమంలో మెరిసిన వజ్రకరూరు వైఢూర్యం తరిమెల నాగిరెడ్డి. ఆయన విప్లవం కోసం జీవించాడు, విప్లవం కోసం శ్రమించాడు, విప్లవం కోసం కృషి చేస్తూ మరణించాడు. 1917 ఫిబ్రవరి 11న అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం తరిమెల గ్రామంలో సంపన్న కుటుంబంలో జన్మించిన తరిమెల నాగిరెడ్డి జీవితం యావత్తూ స్వాతంత్య్ర పోరాటంతో, కమ్యూనిస్టు, విప్లవోద్యమాలతో పెనవేసుకుపోయింది. చిన్నతనం నుంచే జాతీయో ద్యమ ప్రభావానికి ఆయన గురయ్యారు. 1932-33 లో బనారస్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తూ తరిమెల తొలిసారిగా మార్క్సి జాన్ని అధ్యయనం చేశారు. 1939లో కమ్యూనిస్టు పార్టీ సభ్యులైనారు. 1940లో ‘యుద్ధం- దాని ఆర్థిక ప్రభావం’ పుస్తకాన్ని ప్రచురించినందుకు ఒకటిన్న రేళ్లు కఠిన కారాగార శిక్షను అనుభవించారు. 1946-49 మధ్య రహస్య జీవితం గడిపారు. 1952 లో జైల్లోంచే, బావ నీలం సంజీవరెడ్డిపై పోటీ చేసి అనంతపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1969 మార్చిలో శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఏపీ శాసనసభలో సంచలనాత్మక ప్రసం గం చేశారు. 1970-72లో జైలులోనే ‘తాకట్టులో భారతదేశం’రచించారు. 1975లో దేవులపల్లి వెంకటేశ్వర రావుతో కలసి యూసీసీఆర్ఐ (ఎం-ఎల్)ను స్థాపించి విప్లవోద్యమంలోని అతి వాద, మితవాద ధోరణులను వ్యతిరేకించారు. అవిశ్రాంత విప్లవ యోధుడు 1976, జూలై 28న హైదరాబాద్‌లో కన్ను మూశారు. ప్రజల కోసం పనిచేయడం, వారికోసం మరణించడం హిమాల యాలకంటే ఎతై్తనది అనే సూక్తిని అక్షరాలా నిజం చేసిన విప్లవమూర్తి తరిమెల నాగిరెడ్డి. (నేడు తరిమెల నాగిరెడ్డి 102వ జన్మదినం) -సి. భాస్కర్ యూసీసీఆర్ఐ (ఎం-ఎల్)