‘పది’లో 10/10
సాధించిన కవలలు
సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ లోటస్‌లాప్ పాఠశాలలో చదివే కవల బాలికలు బుధవారం విడుదల చేసిన ఎస్ఎస్సీ ఫలితాల్లో 10/10 గ్రేడ్ మార్కులు సాధించారు. శాంతినగర్‌లో నివసించే సామాజిక కార్యకర్త పూజారి శ్రీనివాస్, కిరణ్‌జ్యోతి దంపతులకు కవల పిల్లలైన సాత్విక, సంహితలు పది పరీక్ష ఫలితాల్లో ఇద్దరు 10/10 మార్కులు సాధించి ఎవరూ తక్కువ కాదు అని నిరూపించుకున్నారు.
ఈ మేరకు స్కూల్ కరస్పాండెంట్ కె.గోపాల్‌రెడ్డి, ప్రిన్సిపల్ వారికి అభినందనలు తెలిపారు. ఇద్దరు కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసి రీసెర్చ్ చేయాలని అనుకుంటున్నట్లు తండ్రి శ్రీనివాసులు ‘సాక్షి’కి తెలిపారు.