tender process
-
Fact Check: రేవులపై ఈనాడు గావుకేకలు
సాక్షి, అమరావతి : గతంలో టెండర్లు దక్కించుకున్న సంస్థ గడువు పూర్తయింది.. కొత్త టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా పూర్తయింది.. ఈలోపు ఇసుక కొరత రాకూడదన్న ఉద్దేశ్యంతో పాత సంస్థతో తవ్వకాలు జరిపిస్తున్నారు.. ఈ పద్ధతి ప్రతీ కాంట్రాక్టు విధానంలో ఉన్నదే.. అయినా, ఇదంతా ఈనాడు రామోజీరావుకు తెలియంది ఏమీకాదు.. కానీ, ఆయన ఎందుకు దీనిపై పదేపదే టన్నులకొద్దీ విషం కక్కుతున్నారు? ఇందుకు జవాబు ఒక్కటే.. సీఎం జగన్‌ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని గుడ్డిగా వ్యతిరేకించడమే ఆయన లక్ష్యం. ఈ క్రమంలో ఆయన జరగని తప్పుని జరిగిందని నమ్మించేందుకు పదేపదే విషం చిమ్ముతూ తన వికృత రూపాన్ని మళ్లీమళ్లీ ఆవిష్కరించుకుంటున్నారు. ఇసుక తవ్వకాల్లో ఎలాంటి లోపాల్లేవని, అంతా పారదర్శకంగా ఉందని తెలిసినా బురదజల్లడం ద్వారా ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ఆయన నానాగడ్డి కరుస్తున్నారు. ‘రేవుల్లో దొంగలు పడ్డారు’ అంటూ పచ్చి అబద్ధాల కథనాన్ని ఈనాడు మరోసారి వండి వార్చింది. చంద్రబాబు హయాంలో ఉచిత ఇసుక విధానం పేరుతో జరిగిన అడ్డగోలు దోపిడీ.. దాడులకు అడ్డుకట్ట వేస్తూ సీఎం వైఎస్ జగన్ అత్యంత పారదర్శక ఇసుక విధానాన్ని అమలుచేస్తుండడం రామోజీకి అస్సలు నిద్రపట్టనీయడంలేదు. అందుకే నిత్యం దానిపై చిలువలు పలువలుగా వక్రీకరించి తప్పుడు కథనాలు రాస్తున్నారు. ఇసుక కొరత రాకూడదనే.. కొత్త ఏజెన్సీలు ఇసుక ఆపరేషన్స్ ప్రారంభించే వరకు నిర్మాణ రంగానికి ఇసుక కొరత ఉండకూడదనే ఉద్దేశంతోనే గనుల శాఖ పాత ఏజెన్సీతో ఇసుక ఆపరేషన్స్ చేయిస్తోంది. ఏ కాంట్రాక్టులో అయినా ఇలాంటి నిబంధనలు సర్వసాధారణంగా ఉంటాయి. దీనికి సీఎంఓతో సంబంధం ఏమిటి? ఇసుక ఆపరేషన్స్ అనేది గనుల శాఖకు సంబంధించిన వ్యవహారం. రీచ్‌లకు లీజు అనుమతుల మంజూరు గనుల శాఖ ద్వారా జరుగుతుందే తప్ప సీఎంఓ నుంచి కాదు. ఈనాడుకు ఈ విషయం తెలిసినా కనీస అవగాహన లేనట్లు నటిస్తూ అబద్ధాల బురద జల్లుతోంది. మరోవైపు.. ఇసుక అక్రమాలపై నిఘా కోసం ఈ ప్రభుత్వం ఎస్ఈబీని ఏర్పాటుచేసింది. జిల్లా స్థాయిలో రెవెన్యూ, పోలీస్, గనుల శాఖ అధికారులు కూడా తమకు ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. గనుల శాఖలో ప్రతి జిల్లాకు ఒక విజిలెన్స్ స్క్వాడ్ కూడా పనిచేస్తోంది. అంతేకాక.. రాష్ట్ర సరిహద్దులతో పాటు కీలకమైన ప్రాంతాల్లో చెక్ పోస్ట్‌లతో అక్రమాలు నిరోధిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఒకే అబద్ధాన్ని పదేపదే చెప్పడం ద్వారా దానిని నిజంగా చిత్రీకరించడానికి ఈనాడు తెగ తాపత్రయపడుతోంది. ఈ ప్రభుత్వ చర్యలతో ఎన్జీటీ సంతృప్తి.. కానీ, ఎలాంటి విమర్శలకు అవకాశంలేకుండా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ, మినీరత్నగా గుర్తింపు పొందిన ఎంఎస్టీసీ ద్వారా ఈ ప్రభుత్వం ఇసుక టెండర్లు నిర్వహించింది. పారదర్శక విధానం, సులభతరంగా ఇసుక లభ్యత, అందుబాటు ధరల్లో వినియోగదారులకు చేరువ చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. అదే క్రమంలో పర్యావరణానికి ఎటువంటి విఘాతం ఏర్పడకుండా, పూర్తి అనుమతులతో ఇసుక ఆపరేషన్స్ జరిగేలా చర్యలు తీసుకుంది. దీంతో.. ఇసుక పాలసీ ద్వారా ప్రభుత్వం తీసుకున్న చర్యలను పరిశీలించిన ఎన్జీటి సంతృప్తి వ్యక్తంచేస్తూ, గత ప్రభుత్వ తప్పిదాలవల్ల విధించిన రూ.100 కోట్ల జరిమానాను కూడా రద్దుచేసింది. ఈ విషయం ’ఈనాడు’కు తెలియనిదేం కాదు. వాస్తవాలిలా ఉంటే.. జిల్లాల్లో అక్రమ ఇసుక దందా జరుగుతోందని ఈనాడు అబద్ధాలను పోగేసి అవాస్తవాలతో కూడిన కథనాన్ని ఇష్టానుసారం రాసిపారేసింది. గతంలోని అక్రమాలు ఈనాడుకు కనిపించలేదా? టీడీపీ హయాంలో ఉచిత ఇసుక విధానం పేరుతో పెద్దఎత్తున ఇసుక మాఫియా జేబులు నింపుకున్న రోజుల్లో ఈనాడుకు ఆ అక్రమాలు కనిపించలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని తీసుకొచ్చి, ప్రజలకు అందుబాటు ధరలో, కొరతలేకుండా ఇసుకను అందిస్తుంటే ఈనాడు తట్టుకోలేకపోతోంది. నిజానికి.. టీడీపీ హయాంలో ఇసుక దోపిడీకి బరితెగించిన చంద్రబాబు ఉచిత విధానం ముసుగులో నిర్లజ్జగా అన్ని విధి విధానాలను ఉల్లంఘించారు. ♦ కేంద్ర ప్రభుత్వ చట్టం, గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను తుంగలో తొక్కడంతోపాటు కేబినెట్‌ను చీకట్లో ఉంచి మరీ దోపిడీకి తెగబడ్డారు. ♦ కానీ, ఇప్పుడు పారదర్శకంగా ఇసుక తవ్వ కాలను నిర్వ హిస్తుండటంతో రాష్ట్ర ప్రభు త్వానికి ఏటా రూ.760 కోట్లకు పైగా ఆదాయం సమ కూరుతోంది. ♦ అంటే గత చంద్రబాబు సర్కారు ఐదేళ్ల పాలనలో ఖజానాకు రూ.3,825 కోట్ల మేర చంద్రబాబు గండి కొట్టినట్లు స్పష్టమవుతోంది. ♦ ప్రభుత్వానికి రావాల్సిన ఈ ఆదాయం అంతా చంద్రబాబు బినామీలు, సన్నిహితులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు చేరిపోయింది. ఎంఎస్టీసీ ద్వారా టెండర్ల ప్రక్రియ కనిపించడం లేదా? రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందిన మినీరత్న ఎంఎస్టీసీ ద్వారా టెండర్లు నిర్వహిస్తున్న విషయం పచ్చవిషం నింపుకున్న రామోజీ కళ్లకు కనిపించడంలేదు. గతంలో నిర్వహించిన టెండర్లలో జయప్రకాష్ వెంచర్స్ ఎంపిక కాగా.. దానికి ఇచ్చిన గడువు పూర్తవ్వడంతో మరోసారి ఎంఎస్టీసీ ద్వారా గనుల శాఖ టెండర్ల ప్రక్రియ నిర్వహించింది. ఇందులో రెండు ఏజెన్సీలు ఎంపికయ్యాయి. ఇదే విషయాన్ని ఈనాడు కూడా రాసింది. వాటితో ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇవి కూడా తుది దశలో ఉన్నాయి. అగ్రిమెంట్లపై సంతకాలు కాగానే ఆ సంస్థలు ఇసుక ఆపరేషన్స్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. అప్పటివరకు పాత ఏజెన్సీ ద్వారానే అనుమతి ఉన్న అన్ని రీచ్‌ల్లో ఇసుక ఆపరేషన్స్ జరగడం సహజం. ఇదే విషయాన్ని గనుల శాఖ గతంలోనూ స్పష్టంచేసింది. అయినా.. ‘పచ్చ’ కామెర్లు సోకిన ఈనాడుకు అదేమీ అర్థంకావడంలేదు. అప్పట్లో విచ్చలవిడిగా దాడులు.. అంతేకాక.. ఉచితం ముసుగులో టీడీపీ నేతలు విచ్చలవిడిగా దాడులకు తెగబడుతూ దోపిడీ పర్వం సాగించారు. వినియోగదారులు బ్లాక్ మార్కెట్ నుంచి అధిక ధరలకు ఇసుకను కొనుగో లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్దఎత్తున ఇసుక లారీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయేవి. వీటిని అడ్డుకున్నందుకు ఎమ్మార్వో వనజాక్షిపై నాటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విచక్షణారహితంగా దాడులకు బరితెగించారు. అసలు ఉచితంగా ఇసుక ఇస్తే ఈ దాడులకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చింది? అలాగే, స్వయంగా నాటి సీఎం చంద్రబాబు కరకట్ట నివాసం పక్కనే ఇష్టారాజ్యంగా ఎడాపెడా ఇసుక లూటీ జరుగుతున్నా కళ్లు మూసుకుని కూర్చోవ డాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీవ్రంగా తప్పుబడుతూ రూ.100 కోట్ల జరిమానా సైతం విధించింది. రాష్ట్ర సంపదను దోచేస్తున్నారని ఆక్షేపించినా చంద్రబాబు పట్టించుకోలేదు. ప్రభుత్వంపై గుడ్డి వ్యతిరేకతతోనే.. ఇసుక ఆపరేషన్స్ విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నాం. పలు దశల్లో పర్యవేక్షణ జరుగుతున్నా ఈనాడు పత్రిక అదే పనిగా వ్యతిరేక కథనాలు ప్రచురించడం విడ్డూరంగా ఉంది. కళ్ల ముందు కనిపిస్తున్న దానిని చూడకుండా, ప్రభుత్వంపై గుడ్డి వ్యతిరేకతతో, నిత్యం ఏదో ఒక రకంగా దుష్ప్రచారం చేయాలనే లక్ష్యంతోనే ఇసుకపై తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది. ఇలా ఇష్ట మొచ్చినట్లు వార్తలు ప్రచురిస్తున్న ఈనాడుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – వీజీ వెంకటరెడ్డి, డైరెక్టర్, గనుల శాఖ -
అధిక మాసంలోనూ ‘అదరగొట్టారు’
సాక్షి, హైదరాబాద్: అధిక మాసంలోనూ వైన్‌షాపు టెండర్ల ప్రక్రియ అదిరిపోయింది. ఈసారి ఎలాగైనా మద్యం షాపులు దక్కించుకోవాలన్న వ్యాపారుల ఆశతో భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయి. ఈనెల 14న ఒక్కరోజే రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఆ ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 14 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక, 15వ తేదీన సెలవుదినం కావడంతో 16వ తేదీ బుధవారం 8,500 పైగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం మీద 14, 16 తేదీల్లో కలిపి.. 23 వేల వరకు దరఖాస్తులు రాగా, ఈనెల 4 నుంచి 16 వరకు మొత్తం కలిపి 43,500 పైగా దరఖాస్తులు వచి్చనట్టు సమాచారం. కాగా, గత రెండేళ్ల కాలానికి గాను మొత్తం 10 రోజుల్లో 69 వేలకు పైగా దరఖాస్తులు రాగా, ఈసారి తొలి పది రోజుల్లో 43,500 మాత్రమే రావడం గమనార్హం. అయితే, ఈసారి గడువు రెండు రోజులు ఎక్కువగా ఇవ్వడం, అధిక శ్రావణం ముగిసి శ్రావణ మాసం రావడంతో చివరి రెండు రోజుల్లోనూ భారీగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే వేలాది మంది డీడీలు తీసి, శ్రావణ మాసం కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చివరి రెండురోజులైన గురు, శుక్రవారాల్లో భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తాయని, గతం కంటే ఇప్పుడు ఎక్కువే దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నామని ఎక్సైజ్ అధికారులు చెపుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకు మద్యం షాపుల దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.870 కోట్ల ఆదాయం సమకూరింది. చివరి రెండు రోజుల్లో కలిపి మరో రూ.500 కోట్ల వరకు వస్తుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. -
1,500 కొత్త బస్సులొస్తున్నాయి
సాక్షి, అమరావతి: ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. అందుకోసం కొత్తగా 650 బస్సుల కొనుగోలుకు నిర్ణయించింది. చాలా ఏళ్ల తరువాత ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేయనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. జీతాల వ్యయం, అందుకోసం అప్పులు, వాటిపై వడ్డీలు, ఇతర నిర్వహణ వ్యయాలతో ఆర్టీసీ దశాబ్దాలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ వస్తోంది. అప్పుల భారం పెరిగిపోవడంతో తొమ్మిదేళ్లుగా కొత్త బస్సులు కొనుగోలు చేయలేకపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత ఏటా రూ.350 కోట్ల జీతాల భారం లేకుండాపోయింది. ఈ మూడేళ్లలోనే దాదాపు రూ.2 వేలకోట్ల అప్పులను తీర్చగలిగింది. మరోవైపు ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుండటంతో ఆర్టీసీ రాబడి కూడా క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలుకు సిద్ధమైంది. అక్టోబర్ నుంచి ప్రతి నెల 200 బస్సులు మొత్తం ఏడు కేటగిరీల కింద రూ.650 కోట్లతో బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. సర్విసుల వారీగా అమరావతి–11, వెన్నెల–8, ఇంద్ర–32, స్టార్‌లైనర్–27, సూపర్‌లగ్జరీ–735, అ్రల్టాడీలక్స్–145, ఎక్స్‌ప్రెస్–542 బస్సులు కొనుగోలు చేయనుంది. అమరావతి సర్విసు కింద 11 బస్సులను నేరుగా ఓల్వో కంపెనీ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. మిగిలిన 1,489 బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ టెండర్లు పిలిచింది. బీఎస్–6 మోడల్‌తో అత్యాధునిక ప్రమాణాలతో బస్సులను సరఫరా చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. బిడ్లను ఈ నెల 20న తెరిచి, అనంతరం నెలరోజుల్లో టెండర్ల ప్రక్రియను పూర్తిచేయనుంది. అక్టోబర్ నుంచి ప్రతి నెల 200 కొత్త బస్సుల చొప్పున ప్రవేశపెట్టనుంది. 2024 ఏప్రిల్ నాటికి మొత్తం 1,500 బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తేనుంది. మరో 600 బస్సులను ఆధునికీకరించి పల్లెవెలుగు సర్విసులుగా ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం పల్లెవెలుగు బస్సులు అప్పుడప్పుడు బ్రేక్‌డౌన్ అవుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి పరిష్కారంగా ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ సర్విసులుగా ఉంటూ తక్కువ మైలేజీ ఇస్తున్న 600 బస్సుల బాడీలను రీఫర్బిíÙంగ్ ద్వారా ఆధునికీకరించి పల్లెవెలుగు సర్వీసులుగా నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. కొత్త బస్సుల కొనుగోలుతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు చెప్పారు. -
టెండర్ ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోలేవు
సాక్షి, అమరావతి : టెండర్ నిబంధనలను బిడ్డర్లు సంతృప్తిపరిచారా లేదా అన్న విషయాలు పూర్తిగా బిడ్ ఆహ్వానించిన అధికారుల పరిధిలోనివని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని చెప్పింది. టెండర్ ప్రక్రియలో కోర్టుల జోక్యం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని, ప్రభుత్వం, ప్రజలు రెండు విధాలుగా నష్టపోతారని తెలిపింది. ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని, పనుల్లో అసాధారణ జాప్యం వల్ల ప్రజలు మౌలిక సదుపాయాలకు దూరమవుతారని వెల్లడించింది. రూ. 148 కోట్లతో చేపట్టిన రాజుపాళెం – అమరావతి రోడ్డు టెండర్ ప్రక్రియలో ఎలాంటి దోషం లేదని, దానిని చట్ట విరుద్ధంగా ప్రకటించలేమని తేల్చి చెప్పింది. ఈ పనులను వీఎస్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, కేబీసీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (వీఎస్–కేబీసీ) జాయింట్ వెంచర్‌కు అప్పగించడాన్ని సమర్థించింది. ఈ టెంటర్లపై దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయన సుజాత ఇటీవల తీర్పు వెలువరించారు. టెండర్ల తిరస్కరణపై పిటిషన్లు గుంటూరు జిల్లా రాజుపాళెం – అమరావతి రోడ్డు విస్తరణ, బలోపేతానికి ఆర్ అండ్ బీ టెండర్లు ఆహా్వనించగా, నాలుగు కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. నిబంధనల ప్రకారం సర్టిఫికెట్లు, కొన్ని వివరాలు ఇవ్వకపోవడంతో పృథ్వీ కన్స్ట్రక్షన్స్ టెండర్‌ను, సాల్వెన్సీ సర్టిఫికెట్ సమర్పించకపోవడంతో శ్రీసాయినాథ్ కన్స్ట్రక్షన్స్ టెండర్‌ను అధికారులు తిరస్కరించారు. దీనిపై ఇరు కంపెనీలు వేర్వురుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ సుజాత విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. కంప్యూటర్ ఆపరేటర్ పొరపాటు వల్ల అనుభవ ధ్రువీకరణ పత్రం అప్లోడ్ చేయలేదన్నారు. దీనిపై వివరణ ఇచ్చినా అధికారులు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఆర్ అండ్ బీ తరఫున ప్రభుత్వ న్యాయవాది అశోక్ రామ్ వాదనలు వినిపిస్తూ.. అన్ని డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సిన బాధ్యత బిడ్డర్లదేనన్నారు. బిడ్డర్లను అధికారులు వివరణ కోరాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఆన్లైన్ ద్వారానే అన్ని పత్రాలు ఇవ్వాలని, ఆఫ్‌లైన్‌లో స్వీకరించే అధికారం అధికారులకు లేదని తెలిపారు. బిడ్ తెరిచిన ఐదు రోజుల తరువాత అనుభవ ధ్రువీకరణ పత్రాన్ని పిటిషనర్లు ఇచ్చారన్నారు. నిబంధనల ప్రకారమే తమ బిడ్‌ను ఆమోదించారని వీఎస్–కేబీసీ జేవీ తరఫు న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సుజాత ప్రభుత్వ న్యాయవాది అశోక్ రామ్ వాదనలతో ఏకీభవించారు. అప్లోడ్ చేయని డాక్యుమెంట్ విషయంలో బిడ్డర్‌ను అధికారులు వివరణ కోరాల్సిన అవసరం లేదన్నారు. పిటిషనర్లు చేసిన జాప్యానికి మొత్తం టెండర్ ప్రక్రియను రద్దు చేయడం సాధ్యం కాదన్నారు. -
క్రిస్ సిటీ టెండర్లకు రంగం సిద్ధం
సాక్షి, అమరావతి: చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ(క్రిస్ సిటీ) మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. మొత్తం 12,944 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న కృష్ణపట్నం నోడ్‌లో తొలిదశలో 2,134 ఎకరాలకు సంబంధించి ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం తెలపడంతో సుమారు రూ.1,200 కోట్లతో ఈపీసీ టెండర్లను ఏపీఐఐసీ పిలవనుంది. ఈ టెండర్లను న్యాయ పరిశీలన కోసం జ్యుడీషియల్ ప్రివ్యూకి పంపుతున్నట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ రవీన్‌కుమార్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వచ్చే నెలలోగా టెండర్ ప్రక్రియను పూర్తి చేసి జూన్‌లో పనులు మొదలు పెట్టేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రెండేళ్లలో అందుబాటులోకి... క్రిస్ సిటీ పనులు జూన్‌లో మొదలు పెట్టి రెండేళ్లలో అందుబాటులోకి తేవాలని ఏపీఐఐసీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొత్తం 12,944 ఎకరాలను అభివృద్ధి చేయడం ద్వారా రూ.37,500 కోట్ల పెట్టుబడులు, 5.15 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రాజెక్టు రిపోర్టు రూపొందించిన జాకబ్ సంస్థ అంచనా వేసింది. 99,400 మంది నివాసం ఉండేలా ఈ పారిశ్రామిక నగరాన్ని నిర్మిస్తున్నారు. మూడు క్లస్టర్లుగా అభివృద్ధి చేస్తున్న క్రిస్‌సిటీలో ప్రధానంగా ఆహార ఉత్పత్తులు, టెక్స్టైల్, ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఆప్టికల్ ఫైబర్ తయారీ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా అభివృద్ధి చేస్తున్నారు. పోర్టుల ఆధారంగా అభివృద్ధి చెందిన చెన్నై, కోల్‌కతా లాంటి నగరాల మాదిరిగా పరిశ్రమలతోపాటు నివాసయోగ్యంగా ఉండేలా ఫ్యూచర్ వర్క్‌లైఫ్ అనే ట్యాగ్‌లైన్‌తో క్రిస్ సిటీ బ్రాండింగ్ చేస్తున్నట్లు రవీన్‌కుమార్ తెలిపారు. అభివృద్ధి చేస్తున్న మొత్తం ప్రాంతంలో 46 శాతం మాత్రమే పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తారు. 13.9 శాతం ఉద్యోగులు అక్కడే నివసించేలా గృహ సముదాయాల నిర్మాణానికి వినియోగిస్తారు. లాజిస్టిక్ అవసరాలకు 5.6 శాతం కేటాయిస్తారు. 10.9 శాతం పర్యావరణ పరిరక్షణ కోసం ఖాళీగా ఉంచుతారు. క్రిస్ సిటీ తొలిదశ ద్వారా సుమారు రూ.18,548 కోట్ల విలువైన పెట్టుబడులతో పాటు 98,000 మందికి ఉపాధి లభిస్తుందని ఏపీఐఐసీ అంచనా వేసింది. ఎస్పీవీకి భూమి బదలాయింపు.. కృష్ణపట్నం నోడ్ తొలిదశ పనులకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపి రూ.2,139.44 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఏర్పాటైన ఎస్పీవీకి భూమి బదలాయింపులో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పనులు ప్రారంభించేందుకు ఆటంకాలన్నీ తొలగిపోయినట్లు ఏపీఐఐసీ అధికారులు పేర్కొన్నారు. -
ఇసుక టెండర్ల ప్రక్రియ అత్యంత పారదర్శకం
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థ.. ఎంఎస్టీసీ ద్వారా అత్యంత పారదర్శకంగా, పటిష్ట నిబంధనలతో టెండర్లు నిర్వహించి ఇసుక తవ్వకాలు, నిల్వ, విక్రయాలను ప్రైవేటు సంస్థకు అప్పగించామని రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. ఎటువంటి లొసుగులు లేకుండా ఉండాలనే టెండర్ల ప్రక్రియలో అపార అనుభవం ఉన్న ఎంఎస్‌టీసీకి ఆ బాధ్యత అప్పగించామని, ఆ సంస్థ కొన్ని వందల టెండర్ల ప్రక్రియ నిర్వహించిందని తెలిపారు. అయినా కొంతమంది ఆరోపణలు చేస్తుండటం బాధాకరమన్నారు. రూ.950 కోట్ల ఇసుక కాంట్రాక్టులో రూ.2 వేల కోట్ల ఆదాయం వస్తుందనడం సరికాదన్నారు. ఈ మేరకు సచివాలయంలో సోమవారం ద్వివేది మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. 7 కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సంప్రదింపులు జరిపాం.. ఇసుక తవ్వకాలు, నిల్వ, విక్రయాలు నిర్వహించే సంస్థలను ఎంపిక చేయడానికి ఏడు సంస్థలతో సంప్రదింపులు జరిపి ఎంఎస్టీసీతో భూగర్భ గనుల శాఖ ఎంవోయూ కుదుర్చుకుంది. దరఖాస్తు చేసుకున్న కంపెనీల సాంకేతిక సమర్థతలను పరిశీలించాక ఎంఎస్టీసీ ఆర్థిక బిడ్లను ఆహ్వానించింది. పోటీలో ఎక్కువమంది పాల్గొనేందుకు వీలుగా టెండర్ల స్వీకరణకు గడువు తేదీని పెంచింది. దీనిపై అన్ని ప్రముఖ దినపత్రికల్లో విస్తృతంగా ప్రకటనలు కూడా ఇచ్చింది. బిడ్ల దాఖలులో భయాలు, సందేహాలు లేకుండా ఉండేందుకు ఆన్లైన్ పద్ధతిలో టెండర్లు స్వీకరించింది. అత్యంత పారదర్శకంగా జయ్‌ప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్‌ను ఎంపిక చేసింది. ఎప్పుడూ లేని విధంగా కాంట్రాక్ట్ సంస్థ నుంచి రూ.120 కోట్ల బ్యాంకు గ్యారెంటీని కూడా స్వీకరించాం. ఈ సంస్థ ప్రతి 15 రోజులకు ఒకసారి, ముందుగానే తర్వాత 15 రోజులకు డబ్బును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది ఇసుక తవ్వకాలు సుమారు 1.6 కోట్ల మెట్రిక్ టన్నులు కాగా తాజాగా ఏడాదికి 2 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు, సరఫరాను కనీస లక్ష్యంగా నిర్దేశించాం. దీనివల్ల కొరత లేకుండా ఇసుక అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సర్వర్లు మొరాయించడం, నెట్వర్క్ సమస్యలు, కృత్రిమ కొరతను సృష్టించడం, మధ్యవర్తుల ప్రమేయం వంటి అక్రమాలకు చెక్ పడుతుంది. మెట్రిక్ టన్నుకు రూ.475 చెల్లిస్తే చాలు తాజా ఇసుక విధానం ప్రకారం.. మెట్రిక్ టన్నుకు రూ.475 చెల్లిస్తే చాలు.. ఎంత కావాలంటే అంత ఇసుకను తీసుకెళ్లొచ్చు. 175 నియోజకవర్గాలవారీగా రవాణా ఖర్చులతో కలిపి ప్రభుత్వం ధరలు ప్రకటిస్తుంది. ఈ ధరల కంటే అధిక ధరకు ఎవరైనా విక్రయిస్తే 14500కు ఫిర్యాదు చేయొచ్చు. ఇప్పటికే ఇసుక అక్రమాలను నివారించడానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉంది. ఇసుక రీచ్ వద్ద మెట్రిక్ టన్నుకు రూ.475 చెల్లించగానే అందులో రూ.375 నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. మిగిలిన రూ.100 నిర్వహణా ఖర్చులు కింద కాంట్రాక్టర్‌కు వెళతాయి. టన్నుకు రూ.475 చొప్పున మొత్తం 2 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక విలువ రూ.950 కోట్లు. ఇందులో కాంట్రాక్టు సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సింది రూ.765 కోట్లు కాగా, మిగిలిన సొమ్ము యంత్రాలు, పరికరాలు, పంపిణీ, నిర్వహణా ఖర్చుల కింద కాంట్రాక్టు సంస్థకు వెళ్తుంది. ప్రజలకు మేలు చేయడానికే కొత్త ఇసుక విధానం నదుల పక్కనే ఉన్న గ్రామాల్లోనివారు సొంత అవసరాల కోసం ఎడ్ల బళ్ల ద్వారా ఉచితంగా ఇసుకను తెచ్చుకోవచ్చు. బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణాలకు, ఆర్ అండ్ ఆర్ కాలనీలకు రాయితీపై సరఫరా ఉంటుంది. గతంలో మాదిరిగా ఉచితమని చెప్పి రూ.వందల కోట్లు దోపిడీ చేసే అవకాశం లేకుండా ప్రజలకు మేలు చేయడానికే కొత్త ఇసుక విధానానికి రూపకల్పన చేశాం. కాంట్రాక్టు పొందిన సంస్థ నిబంధనల విషయంలో విఫలమైతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. -
పెంచేసి.. పంచుకున్నారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నదులు, వాగులు, వంకలపై నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌ల నిర్మాణ పనుల టెండర్ల వ్యవహారమంతా అడ్డగోలుగా మారింది. పనులపై ప్రభుత్వ నజర్ లేకపోవడంతో జిల్లాల్లో కాంట్రాక్టర్లు ఇష్టారీతిన అధిక ధరలకు కోట్ చేసి పనులు దక్కించుకుంటున్నారు. చాలా జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో సిండికేట్‌గా మారుతున్నారు. ఎవ రికే పని దక్కాలో ముందుగానే నిర్ణయమైపోతోంది. అందుకనుగుణంగా 3 నుంచి 4% వరకు అధిక ధరలకు కోట్ చేసి పనులు చేజిక్కించుకుంటున్నారు. పలుచోట్ల కేవ లం 2 టెండర్లు మాత్రమే దాఖలు కావడం సిండికేట్ అయ్యారనడానికి నిదర్శనం. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతగా 632 చెక్‌డ్యామ్‌లను రూ. 2,890 కోట్లతో చేపట్టాలని నిర్ణయించి ఇప్పటికే సాంకేతిక అనుమతుల ప్రక్రియ పూర్తిచేశారు. ఇందులో గోదావరి బేసిన్లో 444, కృష్ణాబేసిన్‌లో 188 చెక్‌డ్యామ్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు 625 పనులకు టెండర్లు పిలవగా, 560 చెక్‌డ్యామ్‌ల టెండర్లు ఖరారు చేశారు. ఇందులో 450 చెక్‌డ్యామ్‌లకు సంబంధించిన ఒప్పందాలు పూర్తయ్యాయి. అయితే టెండర్ల దాఖలు విషయంలో సంబంధిత జిల్లాలోని ప్రధాన కాంట్రాక్టర్లంతా సిండికేట్‌గా మారి ఎక్సెస్ ధరలకు వాటిని దక్కించుకున్నారు. ముఖ్యంగా ఒకే నది లేక వాగుపై ఉండే మూడు, నాలుగు చెక్‌డ్యామ్‌లను కలిపి ఒక క్లస్టర్‌గా చేశారు. ఇవన్నీ భారీ వ్యయంతో కూడుకున్నవి కావడంతో వాటన్నింటినీ ఎక్సెస్ ధరలకే దక్కించుకునేలా కాంట్రాక్టర్లు పావులు కదిపారు. కరీంనగర్లో ‘రింగు’రింగా... ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలివిడతలో 114 చెక్‌డ్యామ్‌లను రూ.854 కోట్లతో పూర్తిచేయాలని నిర్ణయించారు. ఇందులో గోదావరి ఉపనది మానేరులో ఏడాదంతా నీరు నిలిచి ఉండేలా 29 చెక్‌డ్యామ్‌లు, మూలవాగుపై 12 ప్రతిపాదించారు. వీటికి విడివిడిగా టెండర్లు పిలవాలని తొలుత భావించినా, వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఒక నదిపై నిర్మించే చెక్డ్యామ్లన్నింటినీ ఒక క్లస్టర్‌గా చేసి వాటన్నింటికీ కలిపి ఒకే టెండర్ పిలిచారు. ఈ విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 57 పనులను 18 క్లస్టర్ల కింద చేర్చి రూ.380 కోట్లతో టెండర్లు పిలిచారు. ఇందులో అత్యధికంగా మానేరుపై కరీంనగర్ బ్రిడ్జికి సమీపంలో 5 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి రూ.75.48 కోట్లతో టెండర్లు పిలవగా దీనిని 2.34 శాతం ఎక్సెస్‌తో జిల్లా నేత దగ్గరి బంధువులు దక్కించుకున్నారు. కరీంనగర్ మండల పరిధిలోనే ఇరుకుల్లవాగుపై 3 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి 15.40 కోట్లతో టెండర్లు పిలవగా, ఇక్కడ సైతం 4.50 శాతం ఎక్సెస్‌తో టెండర్ దక్కించుకున్నారు. ఈ రెండు చోట్ల పనులు దక్కించుకున్న ఏజెన్సీతో పాటే మరో ఏజెన్సీ మాత్రమే టెండర్ వేయడం గమనార్హం. ఇక మంథని మండల పరిధిలో మానేరు వాగుపై మరో 3 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి రూ.42.38 కోట్లతో టెండర్లలోనూ స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల మేరకు ఇద్దరే టెండర్లలో పాల్గొనగా, 3.78 శాతం ఎక్సెస్‌తో స్థానిక నేత చెప్పిన ఏజెన్సీకే టెండర్ దక్కింది. ఇదే రీతిన మానుకొండూర్ నియోజకవర్గ పరిధిలో రూ.38.45 కోట్ల విలువైన రెండు చెక్‌డ్యామ్ పనులను 2.69శాతం, జమ్మికుంట మండల పరిధిలోని రూ.60.73 కోట్ల పనులకు (3 చెక్‌డ్యామ్‌లు) 2.88 శాతం అధికంగా టెండర్లు వేశారు. కస్లర్ల పరిధిలో లేకుండా ఒక్కొక్కటిగా ఉన్న చెక్‌డ్యామ్‌ల టెండర్లు మాత్రం కనిష్టంగా ఒక శాతం నుంచి 18 శాతం వరకు లెస్ టెండర్లు దాఖలయ్యాయి. వరంగల్ జిల్లాకు చెందిన ఓ కీలక నేతకు దగ్గరగా ఉండే కాంట్రాక్టర్‌కు రూ.60 కోట్లు, కరీంనగర్ జిల్లాకు చెందిన కీలక నేత బంధువు ఏజెన్సీకి రూ.70 కోట్లు, ఇదే జిల్లాలో ఓ ప్రధాన ప్రాజెక్టు పరిధిలో పనిచేసిన మరో ఏజెన్సీకి రూ.75 కోట్లు, మరో ముఖ్య నేతకు చెందిన ఏజెన్సీకి రూ.75 కోట్ల పనులు దక్కాయి. మొత్తంగా ఎక్సెస్ దాఖలు చేసిన పనుల టెండర్ల విలువ రూ.380 కోట్లుగా ఉండగా, అధిక ధరలతో కోట్ చేయడంతో ప్రభుత్వంపై కనీసంగా రూ.30 కోట్ల మేర భారం పడింది. నిజామాబాద్‌లో మూడు ఏజెన్సీలకే ... ఇక నిజామాబాద్ జిల్లాలో అయితే చెక్‌డ్యామ్‌ల టెండర్లలో మరీ విపరీతంగా ప్రవర్తించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 71 చెక్‌డ్యామ్ పనులకు ఇప్పటివరకు రూ.250 కోట్లతో టెండర్లు పిలవగా మూడు, నాలుగు ఏజెన్సీలకే మొత్తం పనులు పంచేశారు. జిల్లాలో కీలకంగా ఉన్న ప్రజాప్రతినిధులకు దగ్గరగా ఉన్న ఈ ఏజెన్సీలు ముందుగానే పర్సెంటేజీలు మాట్లాడుకొని అధిక ధరలకు టెండర్లు కోట్ చేసి పనులు దక్కించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం పనుల్లో రూ.100 కోట్లు, 60 కోట్లు, 50 కోట్లు విలువైన పనులను మూడు ఏజెన్సీలకే కట్టబెట్టారు. ఇవన్నీ ఎక్సెస్తోనే కావడం గమనార్హం. ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోనే 47.59 కోట్ల పనులకు టెండర్లు పిలవగా, రెండే ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేశాయి. అయితే విచిత్రంగా ఈ రెండు ఏజెన్సీలు తమకు దక్కిన పనులను 3.99 శాతం ఎక్సెస్తోనే పొందాయి. ఇదే నియోజకవర్గంలో మరో 16 పనులను ఒకే క్లస్టర్ కిందకి చేర్చి 35 కోట్లతో టెండర్లు పిలవగా, 4.59 శాతం ఎక్సెస్‌తో ఓ ఏజెన్సీ టెండర్లు దక్కించుకుంది. ఇదే ఏజెన్సీకి పక్కనే ఉన్న జుక్కల్ నియోజకవర్గంలోని 53.43 కోట్ల పనులు, బాన్సువాడ నియోజకవర్గంలోని రూ.24.34 కోట్ల పనులు అదే 4.59 శాతం అధిక ధరలతో దక్కేలా జిల్లా కీలక నేతలేæ చక్రం తిప్పారు. జిల్లాకు చెందిన ముఖ్యనేతకు దగ్గరగా ఉండే మరో ఏజెన్సీకి సైతం ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల్లోని మొత్తం రూ.50 కోట్ల విలువ చేసే చెక్‌డ్యామ్‌లను కట్టబెట్టారు. మరికొన్ని చోట్ల చిన్న కాంట్రాక్టర్లు పనులు దక్కించుకున్నా, వారిపై ఒత్తిళ్లు తెచ్చి తమకు అనుకూలమైన స్థానిక కాంట్రాక్టర్లకు సబ్ కాంట్రాక్టు ఇప్పించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇతర జిల్లాల్లోనూ ఇదే తంతు ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాల్లోనూ ఇదే రీతిన స్థానిక ప్రజాప్రతినిధులు ముందుగానే ఏజెన్సీలతో మాట్లాడుకొని ఎక్సెస్ ధరలకు టెండర్లు వేయించారు. వరంగల్ జిల్లాలో ఓ కీలక నేత తన సామాజికవర్గానికి చెందిన కాంట్రాక్టర్‌కు రూ.52 కోట్ల విలువైన చెక్‌డ్యామ్‌ల పనులు ఇప్పించారు. నల్లగొండ జిల్లాలోనూ వరంగల్, కరీంనగర్‌కు చెందిన కీలక నేతలు తమకు అనుకూలంగా ఉండే వ్యక్తికే రూ.100 కోట్ల విలువైన పనులను 4 శాతానికి మించి ఎక్సెస్‌కు ఇప్పించుకున్నారు. -
టెండర్ గోల్మాల్..!
సాక్షి, ఆదిలాబాద్ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18 అద్దె బస్సులు.. 11 ఎక్స్‌ప్రెస్, 7 ఆర్డినరీ బస్సుల కోసం టీఎస్ ఆర్టీసీ టెండర్లను ఆహ్వానించింది. ఉమ్మడి జిల్లాలోని పలువురు ఔత్సాహికులు ఇందులో భాగంగా దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం ఆర్ఎం కార్యాలయానికి చేరుకున్నారు. టెండర్ ప్రకటనలో పేర్కొన్న విధంగా దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమై వచ్చిన దరఖాస్తుదారులు దరఖాస్తు ఫారం పూరించి టెండర్ వేశారు. దరఖాస్తుదారులకు చుక్కెదురు.. టెండర్లో సామాన్యులు సైతం అర్హులేనని పేర్కొనడంతో సాధారణ వ్యక్తులు సైతం దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడే వారికి చుక్కెదురైంది. సాఫీగా సాగుతున్న టెండర్ల ప్రక్రియలో ఒక్కసారిగా ఉద్రిక్తత మొదలైంది. టెండర్లో పేర్కొనట్లు సాధారణ వ్యక్తులకు కాకుండా, బస్సులు కలిగిన వారికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు పేర్కొనడంతో అధికారులు, దరఖాస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టెండర్లో మార్పు చేసిన నిబంధనలను తెలపకుండా దరఖాస్తులు స్వీకరించడంపై అధికారులపై మండిపడ్డారు. అధికారులకు, దరఖాస్తుదారులకు మధ్య వాగ్వాదం.. టెండర్లలో భాగంగా సుమారు 1500 పై దరఖాస్తులను స్వీకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు రిజిస్టర్లో నమోదు చేయగా, దరఖాస్తు ముగిసే సమయానికి సైతం దరఖాస్తుదారులు అధికంగా ఉండడంతో వారి వివరాలు నమోదు చేయకుండా, ఎలాంటి టోకెన్ ఇవ్వకుండా 50 శాతం పై మంది నుంచి నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తులు స్వీకరించారని దరఖాస్తుదారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఒక్కో దరఖాస్తు నుంచి రూ. 2 వేలు నాన్ రిఫండబుల్, రూ. 50 వేల రిఫండబుల్ సొత్తు వసూలు చేశారన్నారు. కొలిక్కిరాని దరఖాస్తు ప్రక్రియ.. నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించాలి. అనంతరం 3 గంటల వరకు టెండర్లు ఓపెన్ చేసి అనంతరం వారి వివరాలు ప్రకటించాలి. కాని మార్పు చేసిన నియమాలు తెలియడంతో దరఖాస్తు చేసుకున్న సాధారణ వ్యక్తులు (బస్సులు లేని వారు) ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని నోటిస్ బోర్డుపై పేర్కొంటే తాము దరఖాస్తు చేసుకునేవారమే కాదని, దరఖాస్తులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రాత్రి 9 గంటలు దాటినా ప్రక్రియ పూర్తి కాలేదు. డీఎస్పీ, ఆర్డీవోలు జోక్యం చేసుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
దేశానికి దశా దిశా చూపించే బిల్లు
సాక్షి, అమరావతి: టెండర్ల ప్రక్రియలో అవినీతి నిర్మూలన, పారదర్శకతకు పెద్దపీట వేసేలా దేశంలో ఎక్కడా లేని విధంగా ముందస్తు న్యాయ పరిశీలనకు రాష్ట్రంలో బీజం వేసినట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఈ బీజం మున్ముందు మహావృక్షం అవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌పై అవినీతి ముద్రను చెరిపేసేందుకు నడుం బిగించినట్టు ప్రకటించారు. ‘ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల (ముందస్తు న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) బిల్లు–2019’ చరిత్రాత్మకమైన బిల్లు అని అభివర్ణించారు. ఇది దేశానికి దశా దిశా చూపించే బిల్లు అవుతుందని పేర్కొన్నారు. ఈ బిల్లుపై రాష్ట్ర శాసనసభలో శుక్రవారం సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ బిల్లులోని ముఖ్యాంశాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరించారు. సభలో ఆయన ఏం మాట్లాడారంటే.. ప్రజలకు అందుబాటులోకి టెండర్ పత్రాలు ‘‘ఏ టెండర్ తీసుకున్నా, ఏ పని తీసుకున్నా సర్వం కుంభకోణాల మయమే. చివరకు మనం కూర్చున్న ఇదే బిల్డింగ్‌ను తీసుకున్నా కుంభకోణమే కనిపిస్తుంది. ఒక్కో అడుగుకి రూ.10 వేలు ఖర్చు చేసి కట్టిన తాత్కాలిక బిల్డింగ్‌లో మనం కూర్చుని మాట్లాడుతున్నాం. ఏది తీసుకున్నా స్కామ్‌లమయమే కనిపిస్తోంది. ఏపీ మౌలిక సదుపాయాల (ముందస్తు న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) బిల్లు ప్రకారం.. ఏ పనైనా రూ.100 కోట్లు, ఆపై విలువ చేసే ఏ టెండరైనా, ఒకే పనిని విభజించినా సరే మొత్తం విలువ రూ.100 కోట్లు, ఆపైన విలువ ఉంటే దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. దీన్ని ఒక హైకోర్టు జడ్జి వద్దకు పంపిస్తాం. ఈ జడ్జిని కేటాయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఈ బిల్లు ద్వారా అడుగుతున్నాం. సిట్టింగ్ జడ్జా, రిటైర్డ్ జడ్జా అన్నది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల్లో ఉంటుంది. వాళ్లు నియమించిన ఆ జడ్జి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం చేపట్టిన ఏ టెండరైనా, పనైనా సరే దాని విలువ రూ.100 కోట్లు దాటితే ఆ టెండర్ పత్రాలను జడ్జికి పంపిస్తాం. జడ్జి వారం రోజుల పాటు దాన్ని పబ్లిక్ డొమైన్లో పెడతారు. ప్రజలందరికీ కనిపించేలా అన్ని మాధ్యమాల్లో– ఇంటర్నెట్, వెబ్సైట్లలో.. ఇలా అన్నిచోట్లా పెడతారు. వారం రోజుల పాటు ఇది ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఆ టెండర్‌కు సంబంధించి ఫలానా మార్పులు చేయాలని సలహాలు, సూచనలు నేరుగా జడ్జికి ఇవ్వొచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్లు కూడా సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. వీటిని జడ్జి స్వీకరిస్తారు. ఆ న్యాయమూర్తికి సాంకేతికంగా తోడ్పాటు అందించడానికి ప్రభుత్వం తరపు నుంచి ఒక టెక్నికల్ ప్యానెల్‌ను నియమిస్తాం. సాంకేతిక సాయం కోసం ఎవరినైనా జడ్జి పిలవవచ్చు. వీళ్లు కాకుండా వేరొకరు కావాలని జడ్జి కోరితే ఆ మేరకు వారిని ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. అందుకు అవసరమైన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. టెండర్‌కు సంబంధించి ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత వీటిపై తన దగ్గరున్న టెక్నికల్ సిబ్బందితో జడ్జి చర్చిస్తారు. అనంతరం ప్రభుత్వానికి సంబంధించిన సంబంధిత శాఖను పిలుస్తారు. తాను పరిగణనలోకి తీసుకున్న సలహాలు, సూచనల్లో తాను సరైనవనుకున్న వాటిపై జడ్జి ఆదేశాలు జారీ చేస్తారు. ఆ మార్పులన్నీ తూచా తప్పకుండా చేసిన తర్వాతే టెండర్ డాక్యుమెంట్లను రిలీజ్ చేస్తారు. మొత్తం టెండర్ ఖరారు కావడానికి దానికి ముందు జరిగే ప్రక్రియ 15 రోజుల పాటు ఉంటుంది. జడ్జి 7 రోజుల పాటు పబ్లిక్ డొమైన్లో పెడతారు, మరో 8 రోజులు తాను సమయం తీసుకుంటారు. ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలపై టెక్నికల్ టీంతో చర్చించి, ఆదేశాలు ఇవ్వడానికి జడ్జి ఈ సమయం తీసుకుంటారు. అనంతరం జడ్జి సూచించిన మార్పులు చేసిన తర్వాత టెండర్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. లోకాయుక్త బిల్లునూ తీసుకొచ్చాం... ఏపీ మౌలిక సదుపాయాల (ముందస్తు న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) బిల్లుతో పాటు లోకాయుక్త బిల్లును కూడా తీసుకొచ్చాం. గడచిన ఐదేళ్లుగా రాష్ట్రంలో లోకాయుక్త లేదు. ఇది ఎందుకు అమలు కాలేదన్నది ప్రశ్నార్థకమే. లోకాయుక్తను తీసుకురావాలనుకుంటే నిజంగా జరిగి ఉండేది. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో లోకాయుక్త లేదు. కారణం.. దానికి కావాల్సిన ప్రక్రియను తీసుకురాలేదు. ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి, అవినీతి లేకుండా ఉండాలని గత ప్రభుత్వం అనుకుని ఉంటే ఇది జరిగేది. కానీ, ఆ ఆలోచన వారికి(టీడీపీ సర్కారు) లేదు. చిన్నచిన్న మార్పులు చేస్తే ఇది జరిగి ఉండేది. ఒక సిట్టింగ్ జడ్జి గానీ, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఉంటే గానీ లోకాయుక్తను నియమించలేమన్న నిబంధనను కాస్త మార్పు చేసి హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఎవరైనా ఫర్వాలేదని నిర్ధారిస్తే ఐదేళ్ల క్రితమే లోకాయుక్త వచ్చి ఉండేది. కానీ, లోకాయుక్త అన్నది రానే రాకుండా ఐదేళ్లుగా పెండింగ్‌లో పెట్టారంటే ఈ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే పారదర్శకత కోసం మా ప్రభుత్వం వ్యవస్థలో ఈ మార్పులకు శ్రీకారం చుట్టిందని సగర్వంగా చెబుతున్నా’’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. అవినీతికి వ్యతిరేకంగా నాయకులు, పాలకులు మాట్లాడడం చాలాసార్లు విన్నాం గానీ, నిజంగానే ఆ దిశగా ఆలోచన చేసి, అడుగులు వేయడం ఇప్పుడు తప్ప ఇంతకు ముందెన్నడూ జరగలేదు. ఇంత పారదర్శకంగా, ఇంత నిజాయతీగా ఒక వ్యవస్థను సృష్టించి, ఆ వ్యవస్థ ద్వారా పారదర్శకతను ఒక స్థాయి నుంచి మరో స్థాయికి తీసుకువెళ్లడం బహుశా రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదు. దీనివల్ల పూర్తి నమ్మకం, విశ్వాసం పెరుగుతాయి. చరిత్రాత్మకమైన బిల్లును తీసుకొచ్చాం. దేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటిది జరగలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచే ఇది మొదలవుతోంది. పారదర్శకత అనే పదానికి అర్థం ఇక్కడి నుంచి మొదలైతే, దేశం యావత్తూ దీన్ని అనుసరిస్తుంది. అవినీతిని నిర్మూలించాలి, వ్యవస్థలోకి పారదర్శకతను తీసుకురావాలన్న దృఢ నిశ్చయంతో అడుగులు వేయడమన్నది దేశంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా జరుగుతోంది. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా పారదర్శకత ఆంధ్రప్రదేశ్‌లో ఉందని, అవినీతికి దూరంగా ఉండే రాష్ట్రమనే సందేశం మన దేశానికే కాదు, అంతర్జాతీయ సమాజానికి కూడా పోతుంది. ఇది ఇక్కడితో ఆగదు. మిగిలిన రాష్ట్రాలు కూడా దీన్ని అనుసరిస్తాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని పాటించే రోజు దగ్గర్లోనే ఉంది. ఇక్కడ మనం బీజం వేశాం. ఇది మహా వృక్షం అవుతుంది. దేశానికి దశా దిశా చూపించే గొప్ప బిల్లు అవుతుందని గర్వంగా చెబుతున్నా. రైతు బాగోగుల పర్యవేక్షణకే ఏపీ మార్కెట్ల చట్ట సవరణ: సీఎం అన్నదాతల బాగోగుల్లో ఎమ్మెల్యేలు పాలుపంచుకునేందుకే ఏపీ మార్కెట్ల చట్టం (వ్యవసాయ ఉత్పత్తులు, పశుసంపద)లో మార్పులు తెస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఏదైనా నియోజకవర్గంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకుంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తెచ్చి సమస్యను పరిష్కరించేందుకు వీలుగా వ్యవసాయ మార్కెట్ కమిటీలకు స్థానిక ఎమ్మెల్యేలను గౌరవ చైర్మన్లుగా నియమిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తుల, పశు సంపద మార్కెట్ల చట్టం–1966 సవరణ బిల్లుపై శుక్రవారం శాసనసభలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ’గిట్టుబాటు ధరలు దక్కడంలో జాప్యం జరిగితే రైతులు నష్టపోతారు. దీన్ని నివారించేందుకే ఎమ్మెల్యేలను మార్కెట్లకు గౌరవ చైర్మన్లుగా నియమిస్తున్నాం. వారు మార్కెట్ కమిటీ సమావేశాలకు నేరుగా హాజరు కావడం వల్ల ఎక్కడైనా గిట్టుబాటు ధరలు లభించకుంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తెస్తారు. రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నందున క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకుంటాం’ అని సీఎం చెప్పారు. -
అధికార పార్టీ..అడ్డ‘దారి’
జిల్లాలో ఎక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నా.. టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడి దక్కించుకుంటున్నారు. ఈ కోవలోనే కర్నూలు నగరంలో జరుగుతున్న పనులకు టెండర్ పెట్టారు. ఏకంగా రూ.1.25 కోట్ల పనులను సబ్లీజ్తో చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఇంజినీరింగ్ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తుండడంచర్చనీయాంశమైంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఎలాంటి పనులకు ప్రతిపాదనలు అడగకపోవడం వివక్షకు తావిస్తోంది. ఎన్నికల కోసమే... ప్రతి నియోజకవర్గం నుంచి రహదారులు, భవనాల శాఖకు వందలాది పనుల కోసం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రతిపాదించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన రహదారులు సైతం దెబ్బతిని ఉండడంతో మరమ్మతులు, నూతన రహదారులు, అవసరమైన కల్వర్టులు, బ్రిడ్జిల నిర్మాణాల కోసం ప్రతిపాదనలు వచ్చాయి. అయితే వీటిలో అనుమతి లభించిన పనులు మాత్రం స్వల్పంగా ఉన్నాయని చెప్పవచ్చు. కొందరు ఎమ్మెల్యేలు పనులకు అనుమతి కోసం ముఖ్యమంత్రి, మంత్రుల, ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినా ఆశించిన ఫలితం లభించకపోవడంతో ప్రజలకు ముఖం చాటేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయని కొందరు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉండడంతో కొన్ని పనులైనా చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఒక్కోదానిలో రూ.15 కోట్ల పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పనుల వివరాల ప్రతిపాదలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కర్నూలు జిల్లాలో కర్నూలు, ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు మొత్తం 8 నియోజకవర్గాలకు సంబంధించి రూ.120 కోట్ల పనుల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిపాదనలు తీసుకోవడం మంజూరయ్యే అవకాశం కూడా ఉందని పేర్కొంటున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై వివక్ష... కర్నూలు జిల్లాలో మొత్తం 11 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉండేవారు. అయితే ఐదుగురు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించడంతో అధికార పార్టీలో 8 మంది, ప్రతిపక్ష పార్టీలో ఆరుగురు ఉన్నారు. ఇందులో 8 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో రహదారులు, ఇతర పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకుంది. అయితే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల ఉన్న ఆరు నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం ఎలాంటి ప్రతిపాదనలు తీసుకోలేదని తెలుస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఇది తమపై వివక్ష చూపడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబునాయుడు తీరుపై తీవ్ర ఆక్షేపణలు గుప్పిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై వివక్ష టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై వివక్ష చూపుతోంది. ఇది మొదటి నుంచి జరుగుతోంది. మొదట్లో టీడీపీ ఎమ్మెల్యేలు లేని చోట ఇన్‌చార్జ్‌ల పేరుతో పనులు చేయించారు. ఇప్పుడు కేవలం టీడీపీ వారికే పనులు మంజూరు చేస్తున్నారు. మావి నియోజకవర్గాలు కాదా?..మా దగ్గర ఉన్నది ప్రజలు కాదా? వచ్చే ఎన్నికల్లో ప్రజలే టీడీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారు. -
మల్లన్నసాగర్ టెండర్లపై స్టేకు హైకోర్టు నో
కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న మల్లన్నసాగర్ రిజర్వా యర్ పనుల టెండర్ ప్రక్రియను నిలిపేసేం దుకు ఉమ్మడి హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిం ది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు గురువారం ఉత్తర్వులిచ్చారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు రాకుం డానే ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిందని, ఇది చట్ట విరుద్ధమంటూ వేముల ఘాట్‌కు చెందిన జి.లక్ష్మి, మరో ఐదుగురు హైకోర్టులో వేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భం గా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, కాళేశ్వరం భారీ ప్రాజెక్టని, దీని కోసం 17వేల ఎకరాల భూమిని సేకరిస్తున్నామన్నారు. పిటిషనర్లది చిన్న చిన్న పరిమాణంలో ఉన్న భూమి మాత్రమేనని, విస్తృత ప్రజా ప్రయోజ నాలను దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టును పిటిషనర్లు అడ్డుకోవాలని చూస్తున్నారని తెలిపారు. పిటిషనర్లకు కావా ల్సింది పరిహారమని, ఈ విషయంలో చట్ట నిబంధనలకు లోబడి వ్యవహరిస్తామని చెప్పారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది సీహెచ్ రవికుమార్ స్పందిస్తూ... పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేప ట్టడం చట్ట విరుద్ధమన్నారు. తాము కూడా విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టు కునే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశామన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, ఐదారుగురి కోసం ఇంత భారీ ప్రాజెక్టును ఆపడం సరికాదన్నారు. ప్రాజెక్టు పనులపై స్టే ఇవ్వడం సాధ్యం కాదంటూ, ఈ వ్యవహా రంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అయితే పిటిషనర్లను వారి భూముల నుంచి ఖాళీ చేయించవద్దని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. -
13 వేల కోట్లతో కాళేశ్వరం రిజర్వాయర్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రిజర్వాయర్ల టెండర్ల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. రూ.13 వేల కోట్లతో ఐదు రిజర్వాయర్ల నిర్మాణాలకు వచ్చే నెలలో టెండర్లు పిలిచేందుకు అధికారులు ముహూర్తం నిర్ణయించారు. ఇప్పటికే సిద్ధమైన రిజర్వాయర్ల అంచనాల తుది పరిశీలన శరవేగంగా సాగుతోంది. ఇది పూర్తయితే ప్రభుత్వం రిజర్వాయర్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇవ్వనుంది. ఈ ప్రక్రియంతా వారం, పది రోజుల్లో పూర్తి చేసి వచ్చే నెలలో టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. ఈ రిజర్వాయర్లలో మల్లన్నసాగర్(తడ్కపల్లి)కే గరిష్టంగా రూ.9,300 కోట్లు వ్యయం అవుతుందని తేల్చారు. -
‘అవుట్ సోర్సింగ్’కు రాజకీయ గ్రహణం?
- ఏజెన్సీ ఎంపిక టెండరు ప్రక్రియకు తాత్కాలిక బ్రేకు - పని ఒత్తిడే కారణ మంటున్న అధికారులు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల కార్యాలయాల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక ప్రక్రియ తాత్కాలికంగా నిలిచింది. ఈ ఏజెన్సీల నియామకం కోసం చేపట్టిన టెండరు ప్రక్రియకు ప్రస్తుతానికి బ్రేకు పడింది. ఇందుకు రాజకీయ ఒత్తిళ్లే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమకు అనుకూలమైన ఏజెన్సీలకు ఈ కాంట్రాక్టు దక్కేలా కొందరు నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 2014- 15 ఆర్థిక సంవత్సరంలో అవుట్సోర్సింగ్ పద్ధతిపై ఉద్యోగులను సరఫరా చేసే ఏజెన్సీ ఎంపిక నిమిత్తం జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆగస్టు 8న టెండరు నోటిఫికేషన్ జారీ చేసింది. టెండర్లు దాఖలు చేసేందుకు ఆగస్టు 20 వరకు గడువిచ్చారు. సుమారు 25 ఏజెన్సీలు ఈ టెండరు ప్రక్రియలో పాల్గొన్నాయి. ఈ టెండర్లను అదేరోజు తెరవాల్సి ఉండగా, అధికారులు ఈ ప్రక్రియను వాయిదా వేశారు. సమగ్ర కుటుంబ సర్వే తదితర ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో ఈ టెండర్లను తెరువలేకపోయాని అధికారులు చెబుతున్నారు. కానీ రాజకీయ ఒత్తిళ్లే ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూ.కోట్ల టర్నోవర్ జిల్లాలోని అన్ని కార్యాలయాలు, 104 వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో సుమారు వెయ్యికి పైగా ఉద్యోగులు, సిబ్బంది అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా పనిచేస్తున్నారు. కం ప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, జూనియర్ అసిసెం ట్లు వంటి పోస్టుల్లో ఉన్నారు. వీరికి ఎంపిక చేసిన అవు ట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ప్రభుత్వం జీతభత్యాలు చెల్లిస్తుంది. ఈ ఏజెన్సీ ఎంపిక కోసం కలెక్టర్ జగన్మోహన్ జిల్లా అవుట్ సోర్సింగ్ కమిటీని నియమించారు. అదనపు జాయింట్ కలెక్టర్ ఈ కమిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, జిల్లా ఉపాధి కల్పనాధికారి మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. కార్మిక శాఖ జిల్లా ఉన్నతాధికారి, డీటీవో వంటి అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ టెండర్లు వేసిన ఏజెన్సీల అర్హతలను పరిశీలించి ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే ప్రతినెలా ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అలవెన్సుల రూపంలో రూ.కోట్లలో టర్నోవర్ ఉండటంతో నేతల కన్ను ఈ ఏజెన్సీలపై పడుతోంది. ఏజెన్సీల ఆగడాలు ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు గతంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డాయి. ఆయా ఏజెన్సీల నిర్వాహకులు కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రతినెలా చెల్లించాల్సిన వేతనాల్లో కోత పెట్టేవారు. నిరుద్యోగ యువత నెలం తా పనిచేస్తే వచ్చే చాలీ చాలని వేతనంలో ఇలా కోత వి దించడంతో ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఎక్కడ తమ ఉద్యోగం పోతుందోననే భయంతో కాం ట్రాక్టు ఉద్యోగులు ఏజెన్సీ నిర్వాహకులను గట్టిగా ప్ర శ్నించలేక పోయారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఆయా ఏజెన్సీల నిర్వాహకులు ప్రతినెలా లక్షలు దండుకున్నా రు. అలాగే ఉద్యోగుల భవిష్య నిధి(ప్రావిడెంట్ ఫండ్) విషయంలోనూ చేతివాటం ప్రదర్శించారు. ఉద్యోగుల వేతనాల్లోంచి కోత విధించిన పీఎఫ్ మొత్తంలో కొంత మొత్తాన్ని జేబులో వేసుకున్నారు. దీంతో ఆయా ఉద్యోగులకు పీఎఫ్ ఖాతాలో జమ కావాల్సిన మొత్తం తగ్గిపోవడంతో చిరు ఉద్యోగులు ఆవేదనకు లోనయ్యారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రతినెలా చెల్లించే వేతనాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సి ఉండగా, కొన్ని ఏజెన్సీలు అలా చేయకుండా ఉద్యోగికి ఇచ్చి అందులో చేతివాటం ప్రదర్శించారు. ఇప్పుడు కొత్తగా నియామకమైన అవుట్సోర్సింగ్ కమిటీ అధికారులు ఆయా ఏజెన్సీల ట్రాక్ రికార్డును క్షుణ్ణంగా పరిశీలించి ఎంపిక చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ఈ చిరుద్యోగుల నుంచి వ్యక్తమవుతోంది. పని ఒత్తిడే కారణం - ఎం.ఏ.గఫార్, జిల్లా ఉపాధి కల్పనాధికారి పని ఒత్తిడి కారణంగానే టెండర్లు తెరువలేకపోయాము. నోటిఫికేషన్లో పేర్కొన్నట్లుగా ఆగస్టు 20నే ఈ టెండర్లు తెరవాల్సి ఉండగా, సమగ్ర కుటుంబసర్వే, ఇతర పని ఒత్తిడి కారణంగా ఈ టెండర్లను తెరువలేక పోయాము. అంతేకానీ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు. త్వరలోనే తేదిని ప్రకటించి ఈ టెండర్లను తెరిచేందుకు చర్యలు తీసుకుంటాము.