క్రీడల బడ్జెట్ స్వల్పంగా పెంపు
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి పి.చిదంబరం లోక్‌సభలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో క్రీడలకు నిధుల కేటాయింపు పెరిగింది. మొత్తం రూ. 1,219 కోట్ల బడ్జెట్‌ను క్రీడలకు కేటాయించగా ఇది గతేడాది కన్నా రూ.12 కోట్లు ఎక్కువ. ఈ పెరిగిన మొత్తం ప్రణాళికేతర వ్యయం కింద ఖర్చు చేయనున్నారు. ఓవరాల్‌గా ఈ బడ్జెట్ నుంచి రూ.631.9 కోట్లు క్రీడలు, గేమ్స్‌కు, రూ.239.74 కోట్లు యువజన సంక్షేమ పథకాలకు ఖర్చు చేయనున్నారు. సాయ్కు గత బడ్జెట్‌కన్నా రూ.5 కోట్లు ఎక్కువగా రూ.325.10 కోట్లు కేటాయించారు. జాతీయ క్రీడా సమాఖ్యలకు రూ.165 కోట్లు, టాలెంట్ పరిశోధన, శిక్షణకు రూ.10 కోట్లు ఇవ్వనున్నారు. యాంటీ డోపింగ్ కార్యకలాపాలకు రూ.11.60 కోట్లు, జాతీయ డోప్ టెస్ట్ లాబొరేటరీకి రూ.9 కోట్లు లభించనున్నాయి.