ఆదిమానవుల ఆనవాళ్లు ఉన్నాయి
జయ్యారంలో తవ్వితే మరింత సమాచారం
ఆర్కియాలజీ, మ్యూజియాలజీ రాష్ట్ర మాజీ డైరెక్టర్ కేపీరావు
మరిపెడ : మండలంలోని జయ్యారం పరిసర ప్రాంతాల్లో ఆ దిమానవుల ఆనవాళ్లు ఉన్నాయని ఆర్కియాలజీ, మ్యూజి యాలజీ రాష్ట్ర మాజీ డైరెక్టర్, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కేపీ రావు తెలిపారు. గురువారం ఆయన మరిపెడ మీదు గా ఖమ్మం వెళ్తుండగా ‘సాక్షి’ పలకరించింది. ఈ నెల 14న జయ్యారంలో బృహత్ శిలాయుగం నాటి సమాధులు వెలుగుచూసిన విషయం విదితమే. ఈ సందర్భంగా బృహత్ శిలాయుగంనాటి సమాధుల ఆనవాళ్ల గురించి కేపీరావు మాట్లాడుతూ.. ఈ సమాధులు దాదాపు 3000 సంవత్సరాల క్రితం నాటివని, ఇక్కడ తవ్వకాలు జరిపితే ఆదిమానవుల సమాధు లు, వారు వాడిన వస్తువులు, అవశేషాలు బయట పడే అవకాశం ఉందని అన్నారు.
వారి సంస్కృతి, శిలలు పరిశీలిస్తే జ య్యారంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ మరింత స మాచారం లభిస్తుందన్నా రు. పెద్ద రాళ్లతో వలయాకారంలో నిర్మించిన సమాధులను మెగాలిథిక్ సం స్కృతి గా పిలిచేవార ని చెప్పా రు. ఈ సమాధుల్లో గు ప్త నిధులు ఉంటాయనే అపోహ సరైంది కాదన్నారు. ఇక్కడ తవ్వాలంటే సెంట్రల్ అడ్వయిజరీ బోర్డు ఆఫ్ ఆర్కియాలజీ(సీఏబీఏ) అనుమతి తీసుకోవాలని, రాష్ట్ర పురావస్తు శాఖ కేంద్రానికి నివేదిక సమర్పిస్తే అక్కడ అనుమతి లభిస్తుందని వివరించారు. ఈ ఏడా ది అనుమతి కోసం జూలై 31లోపే దరఖాస్తు చేయాల్సి ఉంద ని, వచ్చే ఏడాది చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.