ఆదిమానవుల ఆనవాళ్లు ఉన్నాయి | There is evidence a single person | Sakshi
Sakshi News home page

ఆదిమానవుల ఆనవాళ్లు ఉన్నాయి

Published Fri, Aug 19 2016 12:57 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

There is evidence a single person

  • జయ్యారంలో తవ్వితే మరింత సమాచారం 
  • ఆర్కియాలజీ, మ్యూజియాలజీ రాష్ట్ర మాజీ డైరెక్టర్‌ కేపీరావు
  •  
    మరిపెడ :   మండలంలోని జయ్యారం పరిసర ప్రాంతాల్లో ఆ దిమానవుల ఆనవాళ్లు ఉన్నాయని ఆర్కియాలజీ, మ్యూజి యాలజీ రాష్ట్ర మాజీ డైరెక్టర్, సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కేపీ రావు తెలిపారు. గురువారం ఆయన మరిపెడ మీదు గా ఖమ్మం వెళ్తుండగా ‘సాక్షి’ పలకరించింది. ఈ నెల 14న జయ్యారంలో బృహత్‌ శిలాయుగం నాటి సమాధులు వెలుగుచూసిన విషయం విదితమే. ఈ సందర్భంగా బృహత్‌ శిలాయుగంనాటి సమాధుల ఆనవాళ్ల గురించి కేపీరావు మాట్లాడుతూ.. ఈ సమాధులు దాదాపు 3000 సంవత్సరాల క్రితం నాటివని, ఇక్కడ తవ్వకాలు జరిపితే ఆదిమానవుల సమాధు లు, వారు వాడిన వస్తువులు, అవశేషాలు బయట  పడే అవకాశం ఉందని అన్నారు.
    వారి సంస్కృతి, శిలలు పరిశీలిస్తే జ య్యారంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ మరింత స మాచారం లభిస్తుందన్నా రు. పెద్ద రాళ్లతో వలయాకారంలో నిర్మించిన సమాధులను మెగాలిథిక్‌ సం స్కృతి గా పిలిచేవార ని చెప్పా రు. ఈ సమాధుల్లో గు ప్త నిధులు ఉంటాయనే అపోహ సరైంది కాదన్నారు.  ఇక్కడ తవ్వాలంటే సెంట్రల్‌ అడ్వయిజరీ బోర్డు ఆఫ్‌ ఆర్కియాలజీ(సీఏబీఏ) అనుమతి తీసుకోవాలని, రాష్ట్ర పురావస్తు శాఖ కేంద్రానికి నివేదిక సమర్పిస్తే అక్కడ అనుమతి లభిస్తుందని వివరించారు. ఈ ఏడా ది అనుమతి కోసం జూలై 31లోపే దరఖాస్తు చేయాల్సి ఉంద ని, వచ్చే ఏడాది చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.  

Advertisement
Advertisement