తుంగతుర్తి నియోజకవర్గంలో నెక్స్ట్ లీడర్ ఎవరు..?
తుంగతుర్తి నియోజకవర్గం
తుంగతుర్తి రిజర్వుడు నియోజకవర్గంలో విద్యార్ది నేత గాదరి కిషోర్ రెండోసారి విజయం సాదించారు. ఆయన కాంగ్రెస్ ఐ అభ్యర్ది అద్దంకి దయాకర్ ను ఓడిరచారు. దయాకర్ కూడా తెలంగాణ ఉద్యమంలో జెఎసిలో ప్రముఖ పాత్ర పోషించినవారిలో ఒకరుగా ఉన్నారు. కిషోర్ కు 1847 ఓట్ల ఆదిక్యత వచ్చింది.కిషోర్ కు 90857 ఓట్లు రాగా,అద్దంకి దయాకర్ కు 87010 ఓట్లు వచ్చాయి.ఇక్కడ ఎస్.ఎప్ బి తరపున పోటీచేసిన అనిల్ కు 3700 పైచిలుకు ఓట్లు వచ్చాయి.
2014లో కూడా కిషోర్, దయాకర్ ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది.కిషోర్ 2379 ఓట్ల ఆధిక్యతతో దయాకర్ పై గెలుపొందారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ నేత,2009లో తుంగతుర్తిలో గెలిచిన మోత్కుపల్లి నర్శింహులు 2014లో తుంగతుర్తిలో పోటీచేయకుండా ఖమ్మం జిల్లా మధిర నుంచి పోటీచేసి ఓటమి చెందారు. మోత్కుపల్లి ఆలేరులో ఐదుసార్లు, తుంగతుర్తిలో ఒకసారి గెలుపొందారు. నర్శింహులు నాలుగుసార్లు టిడిపి పక్షాన, ఒకసారి కాంగ్రెస్ ఐ తరుపున, మరోసారి ఇండిపెండెంటుగా గెలిచారు.
ఈయన గతంలో ఎన్.టి.ఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. తుంగతుర్తిలో సిపిఎం మూడుసార్లు, కాంగ్రెస్ఐ మూడుసార్లు, టిడిపి రెండుసార్లు టిఆర్ఎస్ రెండుసార్లు విజయం సాధించగా ఇండిపెండెంట్లు రెండుసార్లు గెలిచారు. భీమ్‌రెడ్డి నరసింహారెడ్డి తుంగతుర్తిలో ఒకసారి సూర్యాపేటలో మరోసారి గెలిచారు. మిర్యాలగూడ నుంచి ఈయన మూడుసార్లు లోక్‌సభకు గెలిచారు. తర్వాత కాలంలో సిపిఎం వదలి సొంతపార్టీని ఏర్పాటుచేసుకున్నారు. సిపిఎం నేత, భీమ్‌రెడ్డి సోదరి మల్లు స్వరాజ్యం రెండుసార్లు గెలిచారు.
ఇక్కడ నుంచి నాలుగుసార్లు గెలుపొందిన రామిరెడ్డి దామోదరరెడ్డి 2009లో సూర్యాపేటలో విజయం సాధించారు. కాని 2014, 2018లలో అక్కడే ఓటమి చెందారు. దామోదరరెడ్డి 1992లో నేదురుమల్లి క్యాబినెట్లో, 2009 వరకు డాక్టర్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్‌లోను ఉన్నారు ఈయన సోదరుడు రామిరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం జిల్లా నుంచి ఐదుసార్లు శాసనసభకు గెలుపొందారు. ఆయన కూడా 2009-2014 మద్య మూడు క్యాబినెట్లలో మంత్రిగా ఉన్నారు. తుంగతుర్తి రిజర్వుడ్ కాకముందు ఎనిమిదిసార్లు రెడ్లు, ఒకసారి వెలమ, ఒకసారి ఇతరులు గెలుపొందారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..