Tilaknagar lane
-
బెంగళూరులో అనుమానిత ఉగ్రవాది అరెస్ట్
సాక్షి, బెంగళూరు: అనుమానిత ఉగ్రవాది ఒకరిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి తిలక్‌నగరలో ఉంటున్న అస్సాంకు చెందిన అఖ్తర్ హుస్సేన్ లష్కర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. పదో తరగతి వరకు చదువుకున్న అఖ్తర్ యువతకు ఉగ్రవాద సంస్థలతో గల సంబంధాలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఇతడి నుంచి ల్యాప్‌ట్యాప్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, సోమవారం మరో అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. -
అద్దె చెల్లించాలంటూ కేజ్రీవాల్‌కు నోటీసులు
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన నెల తరువాత కూడా ప్రభుత్వ నివాసంలో ఉంటున్నందున, అద్దె చెల్లించాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ అయ్యాయి. నెల రోజులకు రూ.85 వేలు చెల్లించాలని ప్రజాపనులశాఖ (పీడబ్ల్యూడీ) ప్రత్యేక కార్యదర్శి పేరుతో నోటీసులు జారీ అయ్యాయి. తన కూతురుకు మేలో పరీక్షలు ఉన్నందున తిలక్‌నగర్ లేన్‌లోని ఇంట్లో అప్పటి దాకా ఉండనివ్వాలని కేజ్రీవాల్ దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ఆప్ ప్రతినిధి స్పందిస్తూ పీడబ్ల్యూడీ పేర్కొన్నట్టుగానే కేజ్రీవాల్ అద్దె చెల్లిస్తారని తెలిపారు. ఆయన ఫిబ్రవరి 14న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. నిబంధనల ప్రకారం రెండు వారాల్లోపు అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ నెల ఒకటి నుంచి ఆయన అద్దె చెల్లించాలని పీడబ్ల్యూడీ వర్గాలు తెలిపాయి. తాజాగా పంపిన నోటీసుకు వారం రోజుల్లోపు జవాబు ఇవ్వాల్సిందిగా కోరామని పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే ఇల్లు ఖాళీ చేయాలని కోరుతూ పీడబ్ల్యూడీ గత నెలలోనూ కేజ్రీవాల్‌కు లేఖ రాసింది.