అద్దె చెల్లించాలంటూ కేజ్రీవాల్‌కు నోటీసులు | Delhi government issues notice to Arvind Kejriwal | Sakshi
Sakshi News home page

అద్దె చెల్లించాలంటూ కేజ్రీవాల్‌కు నోటీసులు

Published Thu, Mar 27 2014 8:04 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

అద్దె చెల్లించాలంటూ కేజ్రీవాల్‌కు నోటీసులు - Sakshi

అద్దె చెల్లించాలంటూ కేజ్రీవాల్‌కు నోటీసులు

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన నెల తరువాత కూడా ప్రభుత్వ నివాసంలో ఉంటున్నందున, అద్దె చెల్లించాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ అయ్యాయి. నెల రోజులకు రూ.85 వేలు చెల్లించాలని ప్రజాపనులశాఖ (పీడబ్ల్యూడీ) ప్రత్యేక కార్యదర్శి పేరుతో నోటీసులు జారీ అయ్యాయి. తన కూతురుకు మేలో పరీక్షలు ఉన్నందున తిలక్‌నగర్ లేన్‌లోని ఇంట్లో అప్పటి దాకా ఉండనివ్వాలని కేజ్రీవాల్ దరఖాస్తు చేసుకున్నారు.

దీనిపై ఆప్ ప్రతినిధి స్పందిస్తూ పీడబ్ల్యూడీ పేర్కొన్నట్టుగానే కేజ్రీవాల్ అద్దె చెల్లిస్తారని తెలిపారు. ఆయన ఫిబ్రవరి 14న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. నిబంధనల ప్రకారం రెండు వారాల్లోపు అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ నెల ఒకటి నుంచి ఆయన అద్దె చెల్లించాలని పీడబ్ల్యూడీ వర్గాలు తెలిపాయి. తాజాగా పంపిన నోటీసుకు వారం రోజుల్లోపు జవాబు ఇవ్వాల్సిందిగా కోరామని పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే ఇల్లు ఖాళీ చేయాలని కోరుతూ పీడబ్ల్యూడీ గత నెలలోనూ కేజ్రీవాల్‌కు లేఖ రాసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement