tribal darbhar
-
ఉద్యోగాలు కోరుతూ వినతిపత్రాలివ్వొద్దు..
భద్రాచలంటౌన్: సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లో నిర్వహించే గిరిజన దర్భార్‌లో ఉద్యోగాలు కావాలని అర్జీలు పెట్టుకోవద్దని ఐటీడీఏ పీఓ వీపీ.గౌతమ్ సూచించారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన గిరిజన దర్భార్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, తన పరిధిలో ఉన్న వాటిని పరిష్కరిస్తూ, మిగిలిన వాటిని సంబంధిత యూనిట్ అధికారులకు అందజేశారు. ఎక్కువశాతంమంది పోడు భూముల పట్టాలివ్వాలని, స్వయం ఉపాధి పథకాల రుణాలు మంజూరు చేయాలని, పోడు సాగు చేసుకుంటున్నామని అటవీ, పోలీసు అధికారులు దాడులు చేసి అక్రమంగా కేసులు పెడుతున్నారని విన్నవించారు. బయ్యారానికి చెందిన గిరిజన రైతుల అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వడం కుదరదని తహసీల్దార్ ఇబ్బంది పెడుతున్నారని తెలపగా..ఐటీడీఏ పీఓ స్పందించి సంబంధిత అధికారికి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించి నివేదిక ఇవ్వాలన్నారు. ఇంకా పలు సమస్యలపై అర్జీలు పరిశీలనకు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ కోటిరెడ్డి, ఎస్వో సురేష్‌బాబు, ఏఓ భీం, మేనేజర్ సురేందర్, ఏపీఓ పవర్ అనురాధ, ఏడీ అగ్రికల్చర్ సుజాత, ఎల్టీఆర్ డీటీ సులోచన, ఇంజనీరింగ్ విభాగం నాగభూషణం, ఎంప్లాయ్మెంట్ విభాగం మెరుగు సంధ్య, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఓపికగా విన్నారు..ఆశలు కలిగించారు...
శృంగవరపుకోట: ఐటీడీఏ చరిత్రలో కొత్త చరిత్రకు తెర తీశారు పీఓ లక్ష్మీశ. శుక్రవారం స్థానిక ఎమ్పీడివో కార్యాలయంలో గిరిజన దర్బార్ నిర్వహించిన పీఓ సుమారు మూడు గంటలపాటు చాలా ఓపికగా అందరి సమస్యలు విన్నారు. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో చర్చించారు. ప్రధానంగా ఎక్కువ మంది గిరిజనులు తమ గ్రామాలకు రోడ్లు, మంచినీటి వసతి లేదని, పోడు పట్టాలు ఇవ్వటం లేదని, మరుగుదొడ్లు మంజూరు చేయలేదని, ట్రైకార్ రుణాలు ఇప్పించాలని, ఉద్యోగావకాశాలు కల్పించాలని, ఇళ్లు కేటాయించాలని, వ్యవసాయ, ఉద్యాన శాఖల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని అర్జీలు ఇచ్చారు. కొంతమంది వికలాంగులు, వితంతువులు తమకు అర్హత ఉన్నా పింఛన్లు మంజూరు చేయలేదని ఫిర్యాదు చేశారు. మండల గిరిజన సంఘ నాయకులు జె.గౌరీష్, డి.ధోనీ, కె.అరుణ్‌కుమార్ మండలంలోని గిరిశిఖర గ్రామాల్లో వైద్యం, విద్య, రహదారుల వంటి సమస్యలపై వినతిపత్రాలు అందించారు. సమస్యలపై సానుకూల స్పందన సమస్యలపై స్పందించిన పీఓ గ్రామాల్లో సీసీ రోడ్లు, సోలార్ తాగునీటి పధకాలు కేటాయిస్తామనీ, యువత, లేదా డ్వాక్రాసంఘాలు, విలేజ్ కమిటీలతో పనులు చేయించాలనీ సూచించారు. దీనిపై పక్కనే ఉన్న ఆర్డబ్ల్యూఎస్ ఈఈ గాయత్రికి చెప్పి పనులు జరిగేలా చూడాలన్నారు. సీపీఎం నేత చల్లా జగన్ గిరిశిఖర గ్రామాలకు రోడ్లువేయాలని, మంచినీరు అందించాలని. మినీ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజన సమాఖ్య నేతలు టి.అప్పలరాజు, జి.లక్ష్మణ, పి.ఎర్రయ్య, జి.పోతయ్య తదితరులు గిరిజన విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూముల పరిహార విషయంలో గిరిజనులకు అన్యాయం జరుగుతోందని, నేటి వరకూ పనులు ప్రారంభం కాలేదని, గిరిజనులు సాగుచేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, రుణాలు, ఉపాధి అవకాశాలు పెంచాలని కోరారు. వైఎస్సార్సీపీ నేత కేత వీరన్న మండలంలో గిరిజనుల ఇబ్బందుల్ని ఏకరువు పెట్టారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతితోనే సమాజాభివృద్ధి ప్రజాదర్బార్‌లో పీఓ లక్ష్మీశ వివిధ శాఖల అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎస్టీ, ఎస్సీలు అభివృద్ధి చెందితేనే సమాజాభివృద్ధి సాధ్యమౌతుందని చెప్పారు. రాజ్యాంగమే వారి అభివృద్ధి కాంక్షిస్తూ రిజర్వేషన్లు కల్పించినపుడు మనమెందుకు వెనకడుగు వేయాలని ప్రశ్నించారు. ప్రభుత్వం నిధులిస్తున్నా కిందిస్థాయిలో అనుమతులే అడ్డంకులుగా మారాయని చెప్పారు. ప్రతి గిరిజన కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరాలని చెప్పారు. గిరిజన సమస్యలు ఏం గుర్తించినా తనకు ఫోన్‌చేస్తే స్పందిస్తానని తెలిపారు.,ఎస్.కోట సీహెచ్‌సీలో ట్రైబల్ కోఆర్డినేటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశంలో డీడీ వి.నారాయణుడు, ఐటీడీఏ అధికారులు ఎన్.శ్రీనివాసరావు, ఆర్.వి.ఎస్.ప్రసాదరావు, ఎస్.వి.రమణ, ఎం.నారాయణరావు, ఎస్.కోట ఎంపీడీవో మన్మథరావు తదితరులు పాల్గొన్నారు. -
అర్హులకు న్యాయం జరిగేలా చూడాలి
► అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు ►సమయపాలన పాటించాలి ►స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక ఉట్నూర్ : గిరిజన దర్భార్‌కు వచ్చె అర్జీలను పరిష్కరించడంలో అలసత్వం ప్రదర్శించకుండా తక్షణమే వచ్చిన అర్జీలను క్షేత్ర స్థారుులో పరిశీలించి అర్హులైన గిరిజనులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు చెపట్టాలని స్పెషల్ డీప్యూటి కలెక్టర్ ప్రియాంక అన్నారు. సోమవారం ఐటీడీఏ కార్యలయంలో నిర్వహించిన గిరిజన దర్భార్‌లో అమె గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ గిరిజనుల నుంచి వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో అధికారులు అలసత్వం చెయ్యవద్దాన్నారు. ప్రతి అర్జీని సంబందింత అధికారులు క్షేత్ర స్థారుులో పరిశీలించి అర్హులైన గిరిజనులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకొవాలన్నారు. ప్రతి వారం నిర్వహించు దర్భార్‌కు కొన్ని విభాగాల అధికారులు సమయపాలనా పాటించడం లేదని వారిపై చర్యలు తప్పావన్నారు. దర్భారుకు వచ్చిన అర్జీలు తనకు ఐటీడీఏ ద్వారా స్వయం ఉపాధి రుణం మంజూరు అరుు్యందని అందుకు సంబందించిన సబ్సిడీ మంజూరు చెయ్యాలని భోథ్ మండలం ఖర్దుకు చెందిన పెందోర్ దెవ్‌రావ్ అర్జీ పెట్టుకున్నాడు. తన కుటుంబ పోషణ కోసం కిరాణ దుకాణం పెట్టుకోవడానికి రుణం అందించాలని సిర్పూర్(యు) మండలం నెట్నూర్కు చెందిన గోడం నేతబారుు విన్నవించింది. తన వ్యవసాయ భూమికి నీటి సౌకర్యం లేక సాగు చెయ్యలేక పోతున్నానని బావి నిర్మించాలని గాదిగూడ మండలం అర్జునికి చెందిన కొడప కట్టు విన్నవించాడు. జీవనోఫాది కోసం మిని డైరి ఫాం పెట్టుకొడానికి రుణం మంజూరు చెయ్యాలని గుడిహత్నుర్ మండలం తోషంకు చెందిన ప్రెమ్సింగ్ వేడుకున్నాడు. తన వ్యవసాయభూమి సాగు కోసం స్పింక్లర్లు మంజూరు చెయ్యాలని ఉట్నూర్ మండలం చింతకర్రకు చెందిన సిడాం తుకారం అర్జీ పెట్టుకున్నాడు. తన పంట పోలాల సాగు కోసం ఎండ్ల జత మంజూరు చెయ్యాలని ఆసిఫాబాద్ మండలం కతోడకు చెందిన ఆత్రం భీంబారుు విన్నవించింది. తన సాగు భూమి అక్రమణ కేసులో ఉండటంతో సాగు చెసుకోలేక పోతున్నానని కేసును వెంటనే విచారణ చేపట్టాలని మందమర్రి మండల కేంద్రానికి చెందిన రమేశ్ వేడుకున్నాడు. తన వ్యవసాయ భూమికి త్రీపేస్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఇచ్చోడ మండలం బాబ్జిపెట్కు చెందిన టెకం దెవ్‌రావ్ విన్నవించాడు. తమ గ్రామంలో మంచినీటి పథకం లేక పోవడంతో తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని తమ గ్రామంలో మంచినీటి పథకం నిర్మించాలని గాదిగూడ మండలం ఆద్మీయాన్కు చెందిన జుగ్నాక జుగాదిరావ్ వేడుకున్నాడు. తన కుటుంబ పోషణ కోసం 108 లేదా 104 వాహన డ్రైవర్‌గా ఉద్యోగం కల్పించాలని జైనూర్ మండలం ఉషేగాంకు చెందిన నాగోరావ్ అర్జీ పెట్టుకున్నాడు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో జనరల్ నాగోరావ్, తహసీల్దార్ రమేశ్, ఏంపీడీవో లక్ష్మణ్ వివిధ విభాగాల అధికారులు పాల్గోన్నారు.