TV personality Katie Price
-
‘మాది 100% లవ్.. విడిపోం’
లండన్: తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని హాలీవుడ్ ప్రముఖ నటి, టీవీ స్టార్ కాతీ ప్రైస్ చెప్పింది. తాను తన భర్త కైరన్ హేలర్ గాఢమైన ప్రేమలో ఉన్నామని తెలిపింది. తమ వివాహానికి సంబంధించి ఎలాంటి సమస్యలు రాలేదని స్పష్టం చేసింది. ’మేం 100శాతం ఒకరికొకరం. మాది గాఢమైన ప్రేమ. మేం విడిపోతున్నామంటూ వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలే’ అని స్పష్టం చేసింది. కాతీకి తెలియకుండా ఆమె స్నేహితురాళ్లతో కైరన్ సంబంధం నెరిపాడని ఈ విషయం తెలిసిన ఆమె విడిపోవాలనుకుంటుందని వార్తలు హల్ చల్ చేశాయి. అయితే, తాను ఒక టీవీ కార్యక్రమం ఉండటం వల్లే ఈ మధ్య కైరన్ కు కాస్త దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది తప్ప తాము విడిపోయినట్లు కాదని చెప్పింది. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కైరన్ ఆమెకు మూడో భర్త. 2013 జనవరిలో వివాహం చేసుకున్నారు. -
'నా ఫ్రెండ్‌తో మా ఆయన చేసిన రాసలీలలన్నీ చెప్తా'
లాస్ ఎంజెల్స్: ఎంతో ప్రేమను ఒలకబోస్తూనే దారుణంగా తనను మోసం చేసిన భర్త కీరన్ హేలర్పై ప్రముఖ టీవీ స్టార్ కాతీ ప్రైస్ త్వరలో పుస్తకాన్ని విడుదల చేయనుంది. తనకున్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్‌తో రాసలీలు ఎలా కొనసాగించారో అనే విషయాన్ని ఆమె ఆ పుస్తకంలో బట్టబయలు చేయనుంది. తన కళ్లు గప్పి భర్త, తన స్నేహితురాలు దారుణంగా మోసం చేశారని వాపోయిన ఆమె ఆ వివరాలన్నింటిని పూసగుచ్చినట్లుగా ఆ పుస్తకంలో చేరుస్తుంది. ఈ పుస్తకానికి గాను ఆమె పెట్టిన పేరు 'రివెంజ్'(ప్రతీకారం). మరో నాలుగు నెలల్లో ఈ పుస్తకాన్ని విడుదల చేసి తీరుతానని ఆమె ప్రకటించింది. 'నిజం బయటకు వస్తుంది. నాకు జేన్ తెలుసు. ఆమె కిరేన్తో జతకట్టిన విషయం తెలుసు. త్వరలోనే ఈ విషయంపై అన్ని నిజాలు చెప్తాను' అని ఆమె ఓ మేగజిన్తో చెప్పింది.