అంతా.. ప్రచార ఆర్భాటమే...
- 20 శాతం నిధులు ఏ మూలకు ?
- ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
అనంతపురం అర్బన్: ‘జన్మభూమి- మా ఊరు’ పేరుతో ప్రభుత్వ ఆర్భాటమే కానీ ప్రజలకు ఒరిగిందేమి లేదని ఉరవకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం మహాత్మాగాంధీ జయంత్యుత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గాంధీ జయంతి పురస్కరించుకొని ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందన్నారు. గ్రామ స్వరాజ్యంతోనే దేశ సమగ్రతను కాపాడగలుతామని నాడు మహాత్మగాంధీ సూ చించారన్నారు.
ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత అభివృద్ధిని విస్మరి స్తోందన్నారు. జిల్లాలో 6 లక్షల 8 వేల మంది రైతులకు రూ.6.43 వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉందన్నారు. అ యితే ప్రభుత్వం 20 శాతం నిధులు కేటాయించి, మిగిలిన రుణమాఫీకి బాండ్ల రూపంలో ఇస్తామంటే ఎలా అన్నారు. 20 శాతం నిధులు కేటాయిస్తే ఎంత మం ది రైతులకు లబ్ధి చేకురుతుందని ఆయన ప్రశ్నించారు. మరోవైపు రైతు సాధికారత కార్పొరేషన్ ఏర్పాటుతో రుణమాఫీ ఎలా మాఫీ చేస్తారో స్పష్టత ఇవ్వడం లేదన్నారు.
అ ర్హుల పింఛన్లకు, రేషన్ కార్డులకు, ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం మం గళం పాడుతోందని ఆందోళన వ్యక్తం చే శారు. గ్రామీణ ప్రజలకు చం ద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నేరవేర్చినప్పుడే గాంధీ కలలు కన్నా స్వరాజ్యనికి అర్థం ఉంటుందన్నారు. హా మీలు అమలుచేయకపోవడంతో రైతు లు, డ్వాక్రా మహిళలు, చేనేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ క్ర మంలో త్వరలోనే టీడీపీ ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీసే సమయం దగ్గరలోనే ఉందన్నారు.
బాపూజీ ఆశయూలను కొనసాగిద్దాం
ఉరవకొండ: జాతిపిత ఆశయు సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపు నిచ్చారు. స్థానిక ఎంపీడీఓ కా ర్యాలయుం వద్ద గురువారం మ హాత్మా గాంధీ విగ్రహానికి పూలవూల వేసి నివాళులర్పించారు. అ నంతరం ర్యాలీని ప్రారంభించారు. జెడ్పీటీసీ మీనుగ లలితవ్ము, ఎంపీపీ సుంకరత్నవ్ము, సర్పంచ్ నర్రాసుజాత, ఎంపీటీసీ చందా చంద్రవ్ము,తహసీల్దార్ బ్ర హ్మయ్యు, ఇన్చార్జ్ ఎంపీడీఓ హరున్ష్రీద్, నాయుకులు పాల్గొన్నారు.