ఫాను గాలితో బాలయ్యకు ఉక్కపోత
బాలయ్య బాబు బావ నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు హిందుపురం అసెంబ్లీ బరిలో దిగనైతే దిగాడు కానీ ఆ తరువాత నుంచి అన్నీ తిప్పలే. ఎక్కడికక్కడ బాలయ్యకు జనం ఝలక్ ఇస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా చెలివెందుల గ్రామంలో బాలయ్య పర్యటించారు. రంగనాధ స్వామి రధోత్సవంలో పాల్గొని విక్టరీ సింబల్ గా రెండు వేళ్లు అక్కడ ఉన్న జనానికి చూపించారు. అంతే ప్రతిస్పందనగా చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఒక్కసారిగా వైఎస్సార్ సీపీ గుర్తైన ఫ్యాన్ సింబల్ కు నిదర్శనంగా గాలిలో చేతులు గిరగిరతిప్పుతూ వైఎస్సార్ సీపీపై మదిలోని ప్రేమను బయటికి వెల్లడించారు. ప్రజా స్పందన చూసిన బాలయ్యకు మైండ్ బ్లాంక్ అయింది. ఏం చేయాలో తెలియక ఆయన చేతులూపడం ఆపేశారు.