మైనర్ బాలికపై అత్యాచారం
రాపూరు: నెల్లూరు జిల్లాలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. రాపూరు మండలం పంగిలి గ్రామంలో ఓ 11 ఏళ్ల బాలికపై వల్లెపు గోపి(20) అనే యువకుడు అత్యాచారం చేసి పరారైనట్లు తెలుస్తుంది. దీనిపై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.