సంయుక్తంగా అగ్రస్థానంలో ప్రణీత్, వర్షిత్
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్-9 చెస్ చాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారులు నిలకడగా రాణి స్తున్నారు. పంజాబ్లోని జలంధర్లో జరుగుతోన్న ఈ టోర్నీలో బాలుర కేటగిరీలో ఉప్పల ప్రణీత్, వర్షిత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. బుధవారం జరిగిన నాలుగో రౌండ్ గేముల్లో బాలుర విభాగంలో ప్రణీత్ (4, తెలంగాణ)... అరోరా హోని (3, రాజస్థాన్)పై, సాయి వర్షిత్ (4, తెలంగాణ)... సుహార్దో బాసక్ (3, రాజస్థాన్)పై గెలుపొంది ఉమ్మడిగా ఆగ్రస్థానంలో ఉన్నారు.
ఇతర మ్యాచ్ల్లో శ్రేయన్ (3, కేరళ)... అర్నవ్ నంబియార్ (2, తెలంగాణ)పై గెలుపొందగా, రిత్విక్ (2, తెలంగాణ)... అర్హమ్ (1, గుజరాత్)ను ఓడించాడు. మరోవైపు శ్రీకర్ (3, తెలంగాణ), ఆష్మాన్ గుప్తా (3, ఢిల్లీ)... ఆదిత్య (2.5, పశ్చిమ బెంగాల్), ప్రణయ్ (2.5, తెలంగాణ)ల మధ్య జరిగిన మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. బాలికల విభాగంలో కీర్తి (3, తెలంగాణ)... ప్రియ (4, తమిళనాడు) చేతిలో ఓడింది. ఇత ర మ్యాచ్ల్లో మైత్రి (2, తెలంగాణ)... దీపితా సింగ్ (1, ఢిల్లీ)పై గెలపొందగా, సేవిత విజు (2.5, తెలంగాణ)... అన్మిలిత (2.5, అస్సాం), మనుశ్రీ (2, తెలంగాణ)... గార్వి (2, గుజరాత్)ల మధ్య జరిగిన మ్యాచ్లు డ్రాగా ముగిశాయి.