లయన్స్‌క్లబ్ మొదటి వైస్ గవర్నర్‌గా ఏవీఆర్ ప్రసాద్
నంద్యాల: లయన్స్ క్లబ్ 316హెచ్ 2017-18 మొదటి వైస్ గవర్నర్‌గా ఏవీఆర్ ప్రసాద్ ఎంపికయ్యారు. గత ఏడాది ఆయన క్లబ్ రెండవ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. శుక్రవారం గుంటూరులో జరిగిన మల్టిబుల్ కాన్ఫరెన్స్‌కు ఏవీఆర్ ప్రసాద్‌తో పాటు క్లబ్ జిల్లా చైర్మన్లు శ్రీకాంత్, రవిప్రకాష్, జోనల్ చైర్మన్ కశెట్టి చంద్రశేఖర్, అధ్యక్షుడు భవనాశి నాగమహేష్, కార్యదర్శి ఉపేంద్రనాథరెడ్డి, కోశాధికారి ఇమ్మడి శ్రీనివాసులు, సభ్యుడు బైసాని రామశేషు హాజరయ్యారు. గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల ప్రతినిధులు చేతులెత్తే విధానంలో 99శాతం మెజార్టీతో ఆయనకు పట్టం కట్టారు. 2016-17కు రెండవ గవర్నర్‌గా ఉన్న ఆయన 2017-18కి మొదటి గవర్నర్‌గా సేవలందిస్తారు. 2018-19కి గవర్నర్‌గా పదవిని పొందుతారు. లయన్స్ సేవా ప్రగతి కార్యదర్శి శివశంకర్, రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, కళారాధన అధ్యక్షుడు డాక్టర్ మధుసూదనరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ, క్లబ్ మాజీ అధ్యక్షుడు గెలివి సహదేవుడు ఆయనను అభినందించారు.