Vijay Mohan
-
పాతాళగంగ పుష్కరఘాట్ లో విరిగిపడ్డ కొండచరియలు
శ్రీశైలమహాక్షేత్రంలో ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాల ప్రారంభమవుతున్న నేపథ్యంలో పుష్కరఘాట్ల వద్ద రోడ్డు విస్తరణకోసం కొండచరియలను తొలచడంతో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆ మార్గంలో కొండరాళ్లు హఠాత్తుగా జారిపడ్డాయి. పుష్కర పనులు నిర్వహించే సిబ్బంది ఆ సమయంలో పనుల్లోకి దిగకపోవడం, అదే సమయంలో భక్తుల రాకపోకలు కూడా లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. కొండచర్యలు విరిగిపడే సంఘటనలు జరుగుతాయనే ఉద్దేశ్యంతో జిల్లా కలెక్టర్ విజయమోహన్ ముందస్తుగానే తొలచిన కొండ ప్రాంతంలో ఐరన్ మెష్ ఏర్పాటు చేసి కాంకీట్ పూత పూయాల్సిందిగా గతంలో ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ పని ఇప్పటి వరకు అమలు కాలేదు. శనివారం రాత్రి కురిసిన ఒక్క భారీ వర్షానికే పై నుంచి కొండచరియలు విరిగిపడడంతో రోప్‌వే నుంచి ప్రస్తుతం వినియోగంలో ఉన్న పుష్కరఘాట్‌కు వేళ్లేరోడ్డుమార్గంలో కొండరాళ్లతో నిండిపోవడంతో ఆ ఘాట్ మూసుకుపోయింది. కొండచరియలు విరిగిపడ్డ సంఘటనను తెలుసుకున్న దేవాదాయ శాఖ కమీషనర్ అనురాధ, ఈఓ నారాయణ భరత్ గుప్త,జెఈఓ హరినాథ్‌రెడ్డిలు ఆ ప్రదేశాన్ని పరిశీలించి వెంటనే కొండరాళ్లలను తొలగించాల్సిందిగా ఆదేశించడంతో ప్రొక్లైన్ ద్వారా వాటిని కాంట్రాక్టర్లు తొలగించిమార్గం సుగుమం చేశారు. -
కలెక్టరా..టీడీపీ కార్యకర్తా?
కోడుమూరు: ‘జిల్లా కలెక్టర్ విజయ్‌మోహన్ పచ్చసొక్కా వేసుకొని టీడీపీ కార్యకర్తలా పనిచేస్తూ పరువు తీస్తున్నాడు. తాగునీటి సమస్యతో అల్లాడుతున్న పల్లెజనం కోసం ఎల్లెల్సీ నీటిని కుంటలు, చెరువులకు వదలాలని ఉత్తరం రాసి నెల రోజులైనా మాట మాత్రం జవాబురాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడంలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలకు రాకూడదని బోర్డు పెట్టండి సరిపోతుంది’ అంటూ కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కలెక్టర్ తీరుపై విరుచుకుపడ్డారు. పనితీరు మార్చుకోకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. గురువారం ఆయన కోడుమూరులో విలేకరులతో మాట్లాడారు. ‘వర్షాలు లేక రైతాంగం ఆవస్థలు పడుతుంటే ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు నిమ్మకునీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను టీడీపీ ప్రభుత్వం, అధికారులు కాపాడలేరు. ఈ ఐదేళ్లు ప్రజలను ఆ భగవంతుడే రక్షించాలి’ అని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో సింగిల్‌విండో అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు కె.హేమాద్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో సినీ దర్శకుడు మృతి
వాషింగ్టన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతీయ అమెరికన్ దర్శకుడు విజయ్ మోహన్ (26) మంగళవారం మరణించారు. మే 10వ తేదీ అర్థరాత్రి ఫిలిడెల్ఫియా పట్టణంలో బైక్‌పై వెళ్తున్న విజయ్‌ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దాంతో స్థానికులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఆయన మరణించారు. విజయ్ మోహన్ చికాగో శివారు ప్రాంతంలో జన్మించారు. ఆయన పాఠశాల విద్య అంతా భారత్‌లో జరిగింది. అనంతరం ఆయన టెంపల్ యూనివర్శిటీ నుంచి ఫిల్మ్, మీడియా అర్ట్స్ డిగ్రీ తీసుకున్నారు. విజయ్ అంకితభావంతో పని చేస్తాడని ఫిలిడెల్ఫియా ఫిల్మ్ అండ్ టెలివిజన్ కమ్యూనిటీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. విజయ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అతడి మృతి పట్ల సంతాపం ప్రకటించింది. -
నలుగురికి ఉద్వాసన
కర్నూలు(అగ్రికల్చర్): నెల రోజులు సమయం ఇస్తున్నా... ఆ లోపు జలసంరక్షణ పనుల నిర్వహణలో స్పష్టమైన పురోగతి చూపడంతో పాటు అందుకు తగిన విధంగా నిధులు వినియోగించాలి. లేకపోతే మీకు మంగళం పలకడానికి సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ ఐడబ్ల్యూఎంపీ వాటర్‌షెడ్ ప్రోగ్రామ్ ఆఫీసర్లను హెచ్చరించారు. ఇటీవల సాక్షిలో ఐడబ్ల్యూఎంపీ నిధుల వ్యయంపై ‘3 నెలలు, రూ.39 కోటు’్ల శీర్షికన ప్రచురించిన కథనానికి స్పందించిన కలెక్టర్ మంగళవారం అత్యవసరంగా ఐడబ్ల్యూఎంపీ వాటర్‌షెడ్ పీఓలు, ఇంజనీర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వేలాది రూపాయలు జీతం తీసుకుంటూ ఎటువంటి ప్రగతి చూపని ఆళ్లగడ్డ, ఆదోని ప్రోగ్రామ్ ఆఫీసర్లు కిరణ్‌కుమార్, మాలిక్‌బాషా, ఇంజనీర్లు విజయమోహన్, జయరామ్‌లను ఉద్యోగాల నుంచి తొలగించారు. బుధవారం ఉదయానికల్లా అన్ని రికార్డులు, అకౌంట్స్ తదితరవి అప్పగించాలని, లేకపోతే క్రిమినల్ కేసులు ఉంటాయని హెచ్చరించారు. ప్రాజెక్టు వారీగా వాటర్షెడ్ల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. నందికొట్కూరు ప్రాజెక్టులో 21 శాతం, ఓర్వకల్లులో 15 శాతం, నంద్యాలలో 22 శాతం, ఎమ్మిగనూరులో 10 శాతం... ఇలా అతి తక్కువగా ప్రోగ్రెస్ ఉండటం వల్ల కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నెల రోజుల సమయం ఇస్తున్నా.. ఈ లోపు 100 శాతం లక్ష్యాలు సాధించాలి. లేకపోతే ఉద్వాసన తప్పదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. వారికి శిక్షణ ఇచ్చి రంగంలోకి దించుతామని ప్రకటించారు. సమావేశంలోనే ఇద్దరు ప్రాజెక్టు ఆఫీసర్లు, ఇద్దరు ఇంజనీర్లకు ఉద్వాసన పలకడం కలకలం రేపింది. నాలుగు బ్యాచ్‌ల ఐడబ్ల్యూఎంపీ వాటర్షెడ్ల నిర్వహణకు రూ.205 కోట్లు విడుదల అయ్యాయని, వీటిని సద్వినియోగం చేసుకుంటే జిల్లా సస్యశ్యామలం అవుతుందని, కానీ ఇప్పటివరకు కేవలం రూ.41 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. నెల రోజుల్లో ప్రగతి చూపితేనే ఉద్యోగాల్లో ఉంటారని, లేకపోతే మీ స్థానాల్లో ఇంకొకరు ఉంటారన్నారు. మొదటి, రెండవ బ్యాచ్ వాటర్షెడ్ల గడువు ఈ ఏడాది మార్చితో పూర్తి అవుతుందని, నిధులు మాత్రం కోట్లాదిగా ఉన్నాయని, మీ నిర్లక్ష్యం వల్ల ఈ నిధులు ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉందని,దీనిని సహించేది లేదని తెలిపారు. సమావేశంలో డ్వామా పీడీ పుల్లారెడ్డి, జేడీఏ ఠాగూర్‌నాయక్, పశుసంవర్థక శాఖ జేడీ వేణుగోపాల్‌రెడ్డి, ఐడబ్ల్యూఎంపీ వాటర్షెడ్ల అదనపు పీడీ రసూల్ తదితరులు పాల్గొన్నారు. -
రాంబాబు రుబాబేంది!
సీనియర్ అసిస్టెంట్ రాంబాబు సస్పెన్షన్ కర్నూలు(అగ్రికల్చర్): పత్తికొండ ఏడీఏ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రాంబాబును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ విజయమోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా వేధింపులకు గురిచేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ అసిస్టెంట్ మురళీధర్ మృతిపై ఆదోని ఆర్డీఓను విచారణ అధికారిగా నియమించారు. పత్తికొండ ఏడీఏ కార్యాలయంలో ఏడాది నుంచి ఏమి జరుగుతుందనే అంశంపై కూడా విచారణ జరపాలని ఏజేసీ అశోక్‌కుమార్, జేడీఏ ఠాగూర్‌నాయక్‌ను ఆదేశించారు. విచారణ రిపోర్టులు వచ్చిన తర్వాత పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటారు. మురళీధర్ అంత్యక్రియల నిర్వహణకు రూ.10వేలు అందజేశారు. జాతీయ ఆహారభద్రత మిషన్ ఇంట్రెస్ట్ అమౌంట్ నుంచి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేయాలని కూడా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. శనివారంలోగా వ్యవసాయాధికారులకు పెండింగ్ జీతాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జేడీఏ ఠాగూర్‌నాయక్ హామీ ఇచ్చారు. కర్నూలు(అగ్రికల్చర్): ఆ కార్యాలయంలో ఆయనదే పెత్తనం. సార్ తలుచుకుంటే ఏ పనైనా జరిగిపోవాల్సిందే. పైస్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగులందరు సీనియర్ అసిస్టెంట్‌కు లోకువే. తన మాట వినలేదని ఏకంగా 20 మంది ఉద్యోగులకు ఆరు నెలలుగా వేతనాలు అందకుండా అడ్డుకున్న ఘనుడు ఆ పెద్ద మనిషి. పత్తికొండ ఏడీఏ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ రాంబాబు ఆగడాలకు అంతే లేకుండా పోయింది. అక్కడ తాను చెప్పిందే వేదం అన్నట్లు మోనార్క్‌లా వ్యవహరిస్తున్నాడు.ఆయన వేధింపులు తాళలేక సోమవారం కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ మురళీధర్ కర్నూలు కలెక్టలేట్ కార్యాలయ ఆవరణలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆరు నెలలుగా సిబ్బందికి అందని వేతనాలు.. పత్తికొండ డివిజన్ వ్యవసాయ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రాంబాబు తీరుతో డివిజన్లో పనిచేస్తున్న 20 ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులకు జీతాలు రావడం పది రోజులు ఆలస్యమైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అలాంటిది నెలలు తరబడి వేతనాలు అందకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరమే. జీతాలు లేకపోగా పెపైచ్చు వేధింపులు కూడా అధికం కావడంతో భరించలేకనే జూనియర్ అసిస్టెంట్ మురళీధర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన కారణంగా నలుగురు వ్యవసాయాధికారులు, 12 మంది ఏఈ ఓలు, ఇద్దరు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఒక అటెండర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2013 నవంబర్‌లో రుక్సానా అనే మహిళ ఏఈఓగా ఉద్యోగంలో చేరింది. ఆమెకు ఇంతవరకు జీతాలు లేవు. జిలానీ బాషా అనే ఏఈఓ గతేడాది జూన్‌లో బదిలీపై పత్తికొండకు వెళ్లాడు. ఈయనకు పది నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. అటెండర్‌కు ఏడు నెలలుగా జీతా లు లేవు. ఉద్యోగుల సర్వీస్ రిజిష్టర్లు ఇతర కీలకమైన రికార్డులు తన కంట్రోల్లో పెట్టుకునేవారు. ఏడీఏ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పజెప్పని రాంబాబు.. నాలుగు నెలల క్రితం పత్తికొండ ఏడీఏగా పని చేసిన నారాయణ నాయక్‌ను సరెండర్ చేసిన తర్వాత దేవనకొండ ఏఓ శేషాద్రికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే సీనియర్ అసిస్టెంటు రాంబాబు శేషాద్రికి ఇంతవరకు చార్జ్ ఇవ్వలేదు. ఆయనతీరుతో మనస్తాపానికి గురైన శేషాద్రి పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మూడు నాలుగు నెలల క్రితం సీనియర్ అసిస్టెంట్ రాంబాబును సస్పెండ్ చేయాలని జేడీఏ వ్యవసాయ శాఖ కమిషనర్‌కు సిఫారసు చేసినా ఫలితం లేదు. జూనియర్ అసిస్టెంట్ మరణం కలచివేసింది: శేషాద్రి, ఇన్చార్జ్ ఏడీఏ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ మురళీధర్ అకాల మరణం కలచి వేసింది. నాలుగు నెలల క్రితం నాకు ఇన్చార్జ్ ఏడీఏగా బాధ్యతలు ఇచ్చారు. అయితే సీనియర్ అసిస్టెంట్ రాంబాబు చార్జ్ ఇవ్వలేదు. నువ్వు వ్యవసాయ అధికారివి మాత్రమే... నీకు ఎలా ఏడీఏ బాధ్యతలు ఇస్తారంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. చార్జీ ఇవ్వనందుకే పత్తికొండకు వెళ్లి విధులు నిర్వహించడం లేదు. నాకు కూడా ఆరు నెలలుగా జీతాలు లేవు. -
పని చేస్తా.. చేయిస్తా
సాక్షి, కర్నూలు: ‘‘అధికారులందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రథమ లక్ష్యం. పారదర్శకంగా పని చేస్తా.. అధికారులచేత అదేవిధంగా పని చేయిస్తా. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతమాత్రం సహించను.’’ అని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ తన ముక్కుసూటి తనం స్పష్టం చేశారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో సీమ ముఖద్వారమైన కర్నూలును పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’ ఇంటర్వ్యూలో జిల్లా సమగ్రాభివృద్ధిలో భాగంగా చేపట్టనున్న పలు కార్యక్రమాలు వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘జిల్లాలో పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం పంచ్చజెండా ఊపింది. ఓర్వకల్లు మండలంలోని ఓర్వకల్లు, గడివేముల, మిడుతూరు మండలాల పరిధిలో ఇప్పటికే 29,394 ఎకరాల భూమిని గుర్తించాం. ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఏపీఐఐసీ ఎండీతో చర్చించాం. ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామ సమీపంలో న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు వెయ్యి ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశాం. కార్యరూపం దాలిస్తే సుమారు 3వేల మందికి ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వం సోలార్, పవన్ విద్యుదుత్పత్తికి పెద్దపీట వేస్తోంది. జిల్లాలో ఇందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. పాణ్యం మండలం పిన్నాపురం వద్ద రూ.7వేల కోట్లతో 5వేల ఎకరాల్లో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశాం. దీని ద్వారా 2వేల కుటుంబాలకు ఉపాధి లభించనుంది. ఆస్పరిలోనూ వెయ్యి మెగావాట్ల పవన(విండ్) విద్యుత్ ప్లాంట్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నాం. హలహార్వి మండలం గూళ్యంలోని వేదవతి నదిపై జలాశయం నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపుతాం. నిర్మాణం పూర్తయితే నియోజకవర్గంలో తాగు, సాగునీటి సమస్య తీరుతుంది.’’ మెరుగైన వైద్య సేవలు వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాం. అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై శ్రద్ధ చూపుతున్నాం. డెంగీ రోగులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాం. స్వచ్ఛంద సంస్థలు.. విద్యార్థి, యువ జన సంఘాల సహకారంతో డెంగీపై గ్రామ స్థాయి నుంచి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. వ్యాధి నిర్ధారణకు జిల్లాలో సేవా కేంద్రాలు ఏర్పాటు చేశాం. కర్నూలు సర్వజన అసుపత్రితో పాటు, విశ్వభారతి, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, నంద్యాల శాంతిరామ్ ఆసుపత్రిలో ఎలీషా పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇనుము, ఇసుక మాఫీయా ఉక్కుపాదం ఇసుక అక్రమరవాణాపై ఉక్కుపాదం మోపుతా. ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఇసుక విధానాన్ని త్వరలోనే అమలు చేస్తాం. జిల్లాలో నాగులదిన్నె, మంత్రాలయం, జి.సింగవరం, నిడ్జూరు, బసాపురం, మామిదాలపాడు, పంచలింగాలలో ఇసుక క్వారీలు ఉండగా.. నాగులదిన్నె, మంత్రాలయం మినహా మిగతా వాటిని పర్యావరణ అనుమతుల్లేవు. అన్ని అంశాలపై సమగ్ర నివేదిక వచ్చిన తర్వాతే మహిళా సంఘాలకు ఇసుక రీచ్‌లు అప్పగిస్తాం. ఇనుప ఖనిజం అక్రమ రవాణాపైనా దృష్టి సారించాం. అక్రమార్కులను వదిలే ప్రసక్తే లేదు. మాపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు. నిక్కచ్చిగానే ఉంటా ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుందనే విషయం అధికారులు గుర్తుంచుకోవాలి. అభివృద్ధి పనులకు ప్రభుత్వం మంజూరు చేసే నిధులను వ్యయం చేసే విషయంలో జాప్యం కూడదు. అలా చేస్తే పనులు నిలిచిపోవడంతో పాటు అంచనా వ్యయం పెరిగి కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలి. ప్రభుత్వ విభాగాల సమీక్షల్లో తాను అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో వాస్తవం లేదు. ఇప్పటికే అధికారుల్లో చాలా వరకు మార్పు వచ్చింది. అంతా బాగా పని చేస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు పేపర్‌పైనే ఉంటాయి. -
జోరుగా పైరవీలు..!
సాక్షి, కర్నూలు: బదిలీల కోసం కొందరు అధికారులు జోరుగా పైరవీలు చేస్తున్నారు. సెలవు పెట్టి.. హైదరాబాద్‌లో మకాం వేస్తున్నారు. రాజకీయ సిఫారసులతో కొందరు సఫలీకృతులు కాగా.. మరి కొందరు తమ ప్రయత్నాలకు మరింత పదును పెడుతున్నారు. దీంతో కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఫలితంగా జిల్లాలో పాలన అస్తవ్యస్తంగా మారింది. కలెక్టర్ అవాక్కు.. జిల్లాలో పనిచేస్తున్న ఓ అధికారి ఈ నెల ఒకటవ తేదీ నుంచి 20 రోజులపాటు సెలవు పెట్టారు. తన కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నానంటూ వారిని కలిసేందుకు వెళ్తున్నానంటూ చెప్పడంతో కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆయనకు సెలవు మంజూరు చేశారు. అయితే ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆయన సెలవులో వెళ్లలేకపోయారు. కానీ ఆ అధికారి బదిలీ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసిన కలెక్టర్ అవాక్కయినట్లు తెలిసింది. రిటైరయ్యేదాకా.. కలెక్టర్ వేగాన్ని అందుపుచ్చుకోలేక ఇబ్బంది పడుతున్న జిల్లాకు చెందిన ఓ రెవెన్యూ అధికారి ఇటీవలే సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే. ఈయన కూడా బదిలీ కోసమే సెలవు పెట్టినట్లు రెవెన్యూ శాఖలో ప్రచారం జరిగింది. రిటైర్మెంట్కు ఇంకో రెండేళ్లు ఉండడంతో ఎలాగైనా ఇక్కడే పదవీకాలం ముగిసేవరకు పనిచేయాలనుకుంటున్న ఆ అధికారి జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత వద్ద తన కోరికను బయటపెట్టారు. దీంతో ఆ ముఖ్యనేత హామీ ఇవ్వడంతో మళ్లీ తిరిగి విధుల్లోకి చేరినట్లు తెలుస్తోంది. పనితీరుపై అసంతృప్తి.. డీఆర్డీఏలో ఓ అధికారి విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు. పథకాలపైన సరైన పట్టు సాధించలేకపోయారనే విమర్శలున్నాయి. ఆ అధికారికి.. దిగువ స్థాయి సిబ్బందికి మధ్యన తరచూ విభేదాలు చోటు చేసుకునేవి. ఇటీవలే ఆ విభాగంలో పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణం వెలుగుచూసింది. దీంతో అధికారి పనితీరుపైన జిల్లా కలెక్టర్ అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన మాతృ సంస్థకు వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. బదిలీ కోసం పైరవీలు మొదలుపెట్టారు. వారు ఎన్నాళ్లుంటారో..? డ్వామా, ఐసీడీఎస్, బీసీ సంక్షేమ శాఖల్లో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారుల పనితీరు కూడా కలెక్టర్‌కు నచ్చలేదు. ఇటీవల పలుసార్లు వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయా శాఖల పనితీరు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు, అవినీతి తదితర అంశాలపై కలెక్టర్ మండిపడ్డారు. సమాచార పౌరసంబంధాల శాఖాధికారి పనితీరుపైనా కలెక్టర్ అసంతృప్తిగా ఉన్నారు. ఈయన ఇక్కడ డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. దీంతో ఆయా అధికారులు అక్కడ ఎన్నాళ్లు పనిచేస్తారో? అన్నది మిలియన్‌డాలర్ల ప్రశ్నగా మారింది. డిష్యూం.. డిష్యూం.. ఆరోగ్యశాఖలో అస్తవ్యస్తమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇక్కడి ఉన్నతాధికారి.. అధికారులు, ఉద్యోగులు రెండు వర్గాలుగా విడిపోయారు. ప్రజాసేవలను పక్కనపెట్టి గ్రూపు తగాదాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఒకరిపై మరొకరు ఫిర్యాదుల వరకు వెళ్లారు. ఆ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి పనితీరుపైనా కలెక్టర్ పలుమార్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నాళ్లున్నా.. తనకు బదిలీ తప్పదనుకున్న ఆయన సెలవుపై వెళ్లి బదిలీ ప్రయత్నాలు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆయన నచ్చలేదు.. జిల్లా వైద్య కేంద్రంలో పనిచేస్తున్న ఓ అధికారి పనితీరుపై కలెక్టర్ అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల ఆయనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పనితీరు మారకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆయన్ని బదిలీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. తనకు బదిలీ తప్పదనుకున్న ఆయన మంచి చోటు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. పైరవీలను వేగవంతం చేశారు. -
గురువులకు.. వందనం
సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా గౌరవమైనది. వృత్తి పట్ల నిబద్ధత, మంచి వ్యక్తిత్వం, సహన శీలత, స్వీయ శిక్షణ, నైతిక విలువల పట్ల క్రమ శిక్షణ, విద్యార్థుల తెలివి తేటల్ని గుర్తించి పదును పెట్టగలిగే సామర్థ్యం ఉన్న వారే ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందారు. అటువంటి వారు విద్యార్థుల మదిలో చిరకాలం గుర్తుండిపోతాడు. అయితే ప్రస్తుత రోజుల్లో అలాంటి వారు నూటి కో కోటికో కనిపిస్తారు. అవార్డుల కోసమో, ఎవరి మెప్పు కోసమో కాకుండా విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్న కాంక్షతో పని చేసే వారు చాలా అరుదు. బొబ్బిలి, పార్వతీపురం, ఎస్. కోట పట్టణాల్లో పని చేస్తున్న కొందరు ఉపాధ్యాయులు ఇదే బాటలో నడుస్తున్నారు. నాలుగు గోడల మధ్య విద్యా బోధనే కాదు...నలుగురూ మెచ్చుకొనే మంచి పనులు చేస్తూ.. సమాజాభివృద్ధిలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంతో పాటు సమాజాన్ని సరైన మార్గంలో నడపడంతో మార్గదర్శులుగా నిలుస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారిపై ‘సాక్షి’ కథనం. బొబ్బిలి: నాలుగు గోడల మధ్య విద్యా బోధనే కాదు... నలుగురూ మెచ్చుకొనే మంచి పనులు చేయడంలోనూ మేం సిద్ధహస్తులమేనని నిరూపిస్తున్నారు బొబ్బిలి పట్టణానికి చెందిన కొందరు ఉపాధ్యాయులు. పట్టణానికి చెందిన టీచర్లంతా యంగ్ మేన్ హ్యాపీ క్లబ్ ఏర్పాటు చేసి అందరూ నవ్వు తూ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ దిశగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాత బొబ్బిలికి చెందిన టీచరు మింది విజయ్‌మోహన్ సీతానగరం మండలం నిడగళ్లులో పని చేస్తున్నా రు. ఆయన ఆధ్వర్యంలో సుమారు 15 మంది టీచర్లు ఒకటై నేడు నవ్వుల లోకాన్ని సృష్టిస్తున్నారు. వారే స్వయంగా నాటికలు తయారు చేసుకొని ప్రదర్శనలు ఇస్తున్నారు. బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, తెర్లాం, సీతానగరం, బలిజిపేట మండలాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఇప్పటికి దాదాపు 25 వరకూ హాస్య ప్రదర్శనలు ఇచ్చి వారిలో ఉన్న ప్రతిభను బయట ప్రపంచానికి చాటారు. దీనిలో మీసాల గౌరునాయుడు, రెడ్డి బెనర్జీ, బొత్స రత్నకిశోర్, మోజేస్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే జిల్లా స్థాయి ఇంగ్లిష్ లాంగ్వేజ్ అసోసియేషన్ (డెల్టా)ను కూడా స్థాపించి ఆంగ్లంను నేర్పే విధానంతో పాటు సులభతర బోధనపై దృష్టి సారించారు. మొక్కల ప్రేమికుడు... బాడంగి మండలం వాడాడలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు ఎస్వీ రమణమూర్తి పర్యావరణ ప్రేమికుడుగా పేరు గడించారు. పర్యావరణాన్ని ప్రేమించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ఆయన ప్రజల్లో అవగాహన కల్పించడం, వేలాది మొక్కలను సొంత నిధులతో తెప్పించి పంపిణీ చేసి నాటించడానికి నడుం కట్టుకున్నారు. వీటి కోసం గ్రీన్ బెల్టు సొసైటీని ఏర్పాటు చేసి అందులో మరికొందరు టీచర్లను భాగస్వాము లను చేశారు. దీని వల్ల ఒకవైపు మొక్కలు పెంపకంపై అవగాహన పెంచడంతో పాటు పాఠశాలలు, ఖాళీ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రహ దారులకు ఇరువైపులా మొక్కలు నాటిస్తూ వాటి సంరక్షణ బాధ్యత తీసుకున్నారు. ఇప్పటికి వేలాది మొక్కలు నాటి వృక్ష ప్రేమికుడిగా మారారు. రమణమూర్తి చేస్తున్న కృషికి బొబ్బిలి రాజులు కూడా తనదైన సహకారాన్ని అందిస్తూ మొక్కలు రవాణాకు సొంత వాహనాలను సమకూరుస్తున్నారు. కళారాధనలో శ్రీదేవి... సీతానగరం మండలం జానుమల్లవలసలో టీచరుగా పని చేస్తున్న చుక్క శ్రీదేవి కళాసేవలో తనదైన ముద్ర వేశారు. కళలను, సంసృ్కతీ, సాంప్ర దాయాలను పెంపొందించడానికి సాయి చంద్రిక ఏకంగా కళా సేవా సంఘాన్ని ఏర్పాటు చేసి నృత్య, పౌరాణిక, సాంఘిక నాటకాల ప్రదర్శనలు ఏ ర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర స్థాయి నృత్య, నాటక పోటీలు నిర్వహించి మూడు జిల్లాలో ఉన్న నృత్య కళాకారులు, సాంఘిక కళలను పెంపొందిస్తున్నారు. ఇటీవల పర్యావరణాన్ని పరిరక్షించడానికి మట్టి వినాయకులను పంపిణీకి ఈ సంస్థ శ్రీకారం చుట్టింది. ఆయనే నాలో స్ఫూర్తి కలిగించారు నేను నాగార్జునసాగర్‌లోని ఏపీఆర్జేసీలో చదువుతున్నప్పుడు పౌరశాస్త్ర విభాగాధిపతి విజయరాఘవాచారి ఉండేవారు. ఆయన పాఠాలు విద్యార్థు లను ఎంతో ప్రభావితం చేసేవి. ముఖ్యంగా నాకు ఆయన ప్రసంగమన్నా..బోధనన్నా ఎంతో ఇష్టం. ఆయన సబ్జెక్టు చెప్పే తీరు అద్భుతం. జీవితా నికి వెలుగునిచ్చే ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరూ రుణపడాల్సిందే! బి. రామారావు, జాయింట్ కలెక్టర్ ‘ఉపాధ్యాయ’ కుటుంబం విజయనగరం అర్బన్: ఆ ఇల్లు ఉపాధ్యాయులకు పుట్టినిళ్లు. ఐదుగురు అన్నదమ్ములు, వాళ్లలోని ఇద్దరు భార్యలు ఉపాధ్యాయ వృత్తిలోనే స్థిరపడి ఆదర్శంగా నిలిచారు. జిల్లా సరిహద్దుల్లోని విశాఖ జిల్లా పద్మనాభం మండలం రెడ్డిపల్లి అగ్రహారం గ్రామానికి చెందిన రెడ్డిపల్లి సన్యాసిరావు, ఆది లక్ష్మి దంపతులకు ఐదుగురు కుమారులు. నిరాక్షరాస్యులైన వారు ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న గౌరవంతో పిల్లందర్నీ ఉపాధ్యాయ కోర్సులు చదివిం చారు. ప్రస్తుతం వారంతా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విజయనగరం, విశాఖ జిల్లాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్నారు. వీరిలో ఇద్దరి భార్యలు కూడా ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీనివాసరావు బొబ్బాదిపేట ప్రాథమికోన్నత పాఠశాలలోను, (డీఎస్సీ-1998), త్రినాథరావు డెంకాడ మండలం గొడిపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలోను (డీఎస్సీ-1998), ప్రసాదరావు విశాఖ జిల్లా రావికమ తం మండలం కన్నంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో (డీఎస్సీ-2008), అప్పలరాజు విశాఖ జిల్లా భీమిలి ప్రాథమికోన్నత ఫిషర్ మేన్ స్కూల్లో (డీఎస్సీ-2008), రమేష్ భోగాపురం మండలం దిబ్బలపాలెం ప్రాథమిక పాఠశాలలోనూ (డీఎస్సీ-2008) పని చేస్తున్నారు. అలాగే త్రినాథరావు భా ర్య బి. సుజాత గంట్యాడ మండలం రామవరం ఉన్నత పాఠశాలలో, అప్పలరాజు భార్య సంతోషికుమారి పద్మనాభం మండలం పొట్నూరు ప్రాథ మికోన్నత పాఠశాలలోనూ పని చేస్తున్నారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ప్రాధాన్యతను గుర్తెరిన వీరంతా ఉపాధ్యాయ నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ.. విద్యా సేవ చేస్తున్నారు. -
ఆర్‌ఢీఎస్
గద్వాల: రాజోలిబండ నీటి మళ్లింపు పథకం (ఆర్డీస్) వద్ద మరోసారి రగడ రాజుకుంది. మంగళవారం పనులను పరిశీలించేందుకు వెళ్లిన పాలమూరు జిల్లా రైతులను కర్నూలు రైతులు అడ్డుకున్నారు. కర్నూలు కలెక్టర్ విజయమోహన్ ఎదుటే దౌర్జన్యానికి దిగారు. తమ జిల్లాలోకి అడుగుపెట్టొద్దు..! అంటూ గెంటివేశారు. అక్కడే ఉన్న పోలీసులకు ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఈనెల 6న ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్‌లో కర్నూలు జిల్లావైపు స్పిల్‌వే గోడపై కాంక్రీట్ స్లాబు పనులను కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, రైతులు అడ్డుకున్న విషయం తెలిసిందే.. దీనిపై మన రాష్ట్ర ప్రభుత్వం ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలకు పనులు కొనసాగేలా సహకరించాలని లేఖ రాసింది. స్పందించిన కర్ణాటక ప్రభుత్వం పోలీసుల రక్షణలో పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. విషయం తెలిసిన కర్నూలు జిల్లా కలెక్టర్ విజయమోహన్, ఇతర అధికారులు తాము సందర్శిస్తామని రాయిచూర్ కలెక్టర్‌కు సమాచారం అందించారు. ఏం జరిగిందంటే.. ఈక్రమంలో మంగళవారం రెండు జిల్లాల కలెక్టర్లు ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ వద్దకు వస్తున్నారని తెలిసి ఆర్డీఎస్ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ తనగల సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో పాలమూ రు రైతులు అక్కడికి చేరుకున్నారు. ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్‌లో చేపడుతున్న పనుల వాస్తవాలను కర్నూలు కలెక్టర్‌కు వివరించేందుకు య త్నించారు. దీంతో ఆగ్రహించిన మంత్రాల యం రైతులు తెలంగాణ వాళ్లు చెప్పేదేంటి అంటూ తిట్ల వర్షం కురిపించారు. ఒకానొకదశలో మంత్రాలయ నియోజకవర్గ రైతులు సీతారామిరెడ్డిని తోసివేసే ప్రయత్నం చేశారు. ఇంతలో మంత్రాలయ సీఐ షాకీర్ హుసేన్ అప్రమత్తమై పోలీసుల రక్షణలో ఆర్డీఎస్ రైతులను కర్ణాటక పరిధిలోకి పంపాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. కర్నూలు జిల్లా పోలీసులు సీతారామిరెడ్డి బృందాన్ని వెళ్లిపోమ్మని చెబుతున్న సమయంలోనే కర్నూలు రైతులు ఆయనను మరోసారి తోసివేస్తూ మరోసారి వస్తే చంపేస్తామంటూ హెచ్చరించారు. రెండు ప్రాంతాల రైతుల మధ్య సమస్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో కర్నూలు కలెక్టర్ రాయిచూర్ కలెక్టర్ సమాచారమందించారు. ఈ పరిస్థితుల్లో ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్‌లో పనులు చేయలేమంటూ కర్ణాటక అధికారులు తేల్చిచెప్పారు. దీంతో ఆర్డీఎస్ పనులు మళ్లీ మొదటికొచ్చాయి. ఈ విషయమై ఆర్డీఎస్ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి మాట్లాడుతూ.. ఆర్డీఎస్లో మంగళవారం జరిగిన పరిస్థితులను తెలంగాణ నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావుకు, పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులకు బుధవారం వివరిస్తామని చెప్పారు. ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు ఆర్డీఎస్ సమస్యకు పరిష్కారం లభించేలా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
స్వాతంత్య్ర వేడుకలను విజయవంతం చేద్దాం
కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలను కర్నూలులో నిర్వహించాలని తలపెట్టిందని, అధికారులంతా సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ సిహెచ్.విజయ్‌మోహన్ పిలుపునిచ్చారు. జిల్లా అధికారులతో కలిసి మంగళవారం ఏపీఎస్పీ పటాలంలోని మైదానాన్ని ఆయన పరిశీలించారు. ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. సభా వేదిక, జాతీయ జెండావిష్కరణకు సంబంధించిన దిమ్మె ఏర్పాట్లు ఎలా ఉండాలనేదానిపై అధికారులతో చర్చించారు. శకటాల ప్రవేశం, పెరేడ్ నిర్వహణ, హెలిపాడ్ నిర్మాణం తదితర వాటికి సంబంధించి రూపొందించిన రూట్ మ్యాప్‌ను కూడా పరిశీలించారు. వీఐపీల గ్యాలరీ, వీక్షకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే షామియానాలు ఎక్కడెక్కడ ఉండాలనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. పటాలానికి రెండు వైపులా ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేయాలని సూచించారు. బారికేడ్స్ నిర్మాణం, మెటల్ డిక్టేటర్లను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై అధికారులతో చర్చించారు. కలెక్టర్ వెంట పటాలం కమాండెంట్ విజయ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ కన్నబాబు, ఏజేసీ అశోక్‌కుమార్, మునిసిపల్ కమిషనర్ వివిఎస్.మూర్తి, కర్నూలు ఆర్డీఓ రఘుబాబు, మునిసిపల్ ఇంజినీర్ రాజశేఖర్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఉన్నారు. 18 లేదా 19 చీఫ్ సెక్రటరీ వచ్చే అవకాశం... స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నందున ఈనెల 18 లేదా 19 తేదీల్లో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఐవి.కృష్ణారావు కర్నూలుకు రానున్నారు. ఈ మేరకు ఏపీఎస్పీ పటాలం అధికారులకు సోమవారం రాత్రి సమాచారం అందింది. స్వాతంత్య్ర వేడుకలకు బెటాలియన్‌లోని ట్రైనింగ్ సెంటర్ మైదానాన్ని ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం కావడంతో వాటిని పరిశీలించేందుకు ఐవి.కృష్ణారావు కర్నూలుకు వచ్చి స్థలాన్ని పరిశీలించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.