జాతీయ కరాటే క్రీడాకారుల ఎంపిక
నెల్లూరు (బృందావనం), న్యూస్‌లైన్: అంతర్జాతీయ కుంగ్-పూ, కరాటే పోటీ ల్లో పాల్గొనే జాతీయస్థాయి క్రీడాకారుల ఎంపిక నెల్లూరులో జరిగింది. షొవొలిల్ టెంపుల్ కుంగ్-పూ స్కూల్ ఇండియా రాష్ర్టశాఖ ఆధ్వర్యంలో స్థానిక మనుమసిద్ధినగర్లోని తీర్థహైస్కూల్లో ఆదివా రం నేషనల్ ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్-14 పోటీలు నిర్వహించారు. పోటీలను వికాస్ స్కూల్ కరస్పాండెంట్ కర్తం ప్రతాప్‌రెడ్డి ప్రారంభించారు. ని ర్వాహకుడు మాస్టర్ ప్రభాకర్ మాట్లాడు తూ అసోం, అరుణాచలప్రదేశ్, రాజ స్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ తదితర 17 రాష్ట్రాల నుంచి 315 మంది క్రీడాకారులు ఎంపికలకు హాజరయ్యారన్నారు.
18 నుంచి 70 కిలోల విభాగం లో ఎంపికలు నిర్వహించామన్నారు. వి జేతలుగా నిలిచిన వారు నవంబర్ 23, 24 తేదీల్లో జరిగే టోర్నీలో పాల్గొంటారన్నారు. విజేతలకు పెనుబల్లి చంద్రశేఖరరెడ్డి, ఎం.సాయికుమారి, శ్రీనివాసులు, ద్వారకానాథ్ బహుమతులు అందచేశారు. న్యాయనిర్ణేతలుగా కరాటే మా స్టర్లు దత్త, ఉదయ్, పృధ్వీ, బాలాజీ, ఎ లెంగో వ్యవహరించారు. టోర్నీలో 18-21 కిలోల విభాగంలో టి.తేజ, కళ్యాణ్, సొహెల్, 22-25 కిలోల విభాగంలో ఎండి.సినాన్, సూర్య, తాహిల్, 26-30కిలోల విభాగంలో రాకేష్, ప్రేమ్‌కుమార్, ఆలీ మొదటి మూడుస్థానాల్లో నిలిచారని ప్రభాకర్ తెలిపారు.