Voilation
-
ఫేక్ యాప్స్ ను ఏరిపారేస్తామంటున్న గూగుల్
-
‘బాలయ్య కరోనా మంత్రం’పై జోకులే జోకులు!
-
‘బాలయ్య కరోనా మంత్రం’పై జోకులే జోకులు!
సాక్షి, అనంతపురం: వివాదాస్పదమైన వ్యాఖ్యలు, ప్రవర్తనతో వార్తల్లో నిలిచే టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా ప్రజలకు ఉచిత సలహాలిచ్చి విమర్శలు కొనితెచ్చుకున్నారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైన బాలయ్య 9 నెలలుగా అటువైపు కన్నెత్తైనా చూడలేదు. ఈక్రమంలో ఆయన తీరుపై స్థానికంగా విమర్శలు రావడంతో సోమవారం హిందూపురంలో పర్యటించారు. అయితే, భౌతికదూరం నిబంధనలను పాటించకుండా సమావేశంలో పాల్గొన్నారు. (దళితులు గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు) దాంతోపాటు.. కరోనాకు భయపడొద్దని, వేద మంత్రాలతో కరోనాను ఎదుర్కొందామని చెప్తూ లలిత త్రిపుర సుందరి మంత్రాన్ని చదివి వినిపించారు. కరోనా నివారణ కోసం ఈ మంత్రాన్ని పఠించాలని ప్రజలకు సూచించారు. తాను చెప్పిన మంత్రాన్ని 108 సార్లు చెబితే కరోనా దరిచేరదని బాలకృష్ణ పేర్కొన్నారు. కరోనా బారిన పడకుండా ప్రజలకు జాగ్రత్తలు చెప్పాల్సింది పోయి మంత్రాలు చదవమనడంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ‘బాలయ్య కరోనా మంత్రం’ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. (టీడీపీ నేతలు దండుపాళ్యం బ్యాచ్’) -
ఉత్తరాదినే ఉల్లంఘనం ఎక్కువట!
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)లో నమోదవుతున్న కేసుల్లో ఉత్తరాది రాష్ట్రాలవే ఎక్కువగా ఉన్నాయి. దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే.. ఉత్తర భారతంలోని రాష్ట్రాల్లోనే ఈ తరహా ఘటనలు అధికంగా చోటుచేసుకుంటునాయి. ఎన్హెచ్ఆర్సీ 2016–17కు సంబంధించి నివేదికను బట్టి ఈ విషయాలు స్పష్టమవుతున్నాయి. మానవహక్కుల ఉల్లంఘన జరిగిన సందర్భంలో ఎన్హెచ్ఆర్సీ రంగంలోకి దిగుతుంది. కొన్ని సందర్భాల్లో బాధితులు నేరుగా ఫిర్యాదు చేస్తారు. మరికొన్ని సార్లు దినపత్రికలు, చానళ్లలోచూసి ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఒక్క యూపీలోనే సగం కేసులు దేశంలో మానవహక్కుల ఉల్లంఘనపై ఏటా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఎన్హెచ్ఆర్సీ కేసులు నమోదు చేసి విచారణ చేపడుతుంటుంది. ఇందులో అత్య«ధి కంగా వచ్చే ఫిర్యాదులు ఉత్తరప్రదేశ్ నుంచే కావడం గమనార్హం. ఏటా దేశవ్యాప్తంగా 90 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా.. ఒక్క యూపీ నుంచే 30 నుంచి 40 వేల వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. అందులో ఎన్కౌంటర్లకు సంబంధించినవే వేల సంఖ్యలో ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఎన్హెచ్ఆర్సీ విడుదల చేసిన నివేదిక 2016–17 పేర్కొన్న అంశాల ప్రకారం.. 42,590 కేసుల నమోదుతో యూపీ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఒడిశా 8,750, ఢిల్లీ 6,368, హరియాణా 4,596, బిహార్ 3,765 ఉన్నాయి. 928 కేసులతో తెలంగాణ 17వ స్థానం, 1,250 కేసులతో ఏపీ 10వ స్థానంలో నిలిచింది. కాగా 2017 నుంచి ఇప్పటివరకు 5,178 ఎన్కౌంటర్లు యూపీలోనే అయినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. వీటిలో 103 మంది నేరస్తులు మరణించారు. ఇక తెలంగాణలో గత ఆరేళ్లలో 10 ఎన్కౌంటర్లు జరగ్గా.. అందులో దాదాపు 25 వరకు వ్యక్తులు మరణించారు. ఎన్హెచ్ఆర్సీ ఏం చేస్తుంది? ఒకవేళ ఎన్హెచ్ఆర్సీ విచారణలో ఎన్కౌంటర్ బూటకమని తేలితే సదరు బాధిత కుటుంబాలకు రూ.ఒక లక్ష నుంచి రూ.10 లక్షల వరకు పరిహారం అందించాలని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. మిగతా కేసు ల్లో వ్యక్తులు, ఇతర సంస్థలు, పరిశ్రమల ‡తప్పిదాల వల్ల మనుషుల ప్రాణాలకు నష్టం వాటిల్లితే.. గరిష్టంగా రూ. 30 లక్షల వరకు అందజేయాలని సిఫారసు చేస్తుంది. ఉమ్మడి ఏపీలో బూటకపు ఎన్కౌంటర్లు.. 2002కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కర్నూలులో జరిగిన 19 ఎన్కౌంటర్లలో 16 బూటకపువేన ని ఎన్హెచ్ఆర్సీ తేల్చిచెప్పింది. ఆయా ఘటనల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. -
రోడ్డుపై గేదెలను కట్టేసినందుకు జరిమానా
సాక్షి, చెన్నూర్ : మనషులకే కాదు జంతువులకు కూడా రూల్స్ వర్తిస్తాయని నిరూపించారు ఓ మహిళా అధికారిణి . ఓ వ్యక్తి తన గేదెలను రోడ్డుపై కట్టేసినందుకు జరిమానా చెల్లించిన వింత ఘటన చెన్నూరు మండలంలో చోటు చేసుకుంది. మండలంలలోని కత్తెరసాల గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా శనివారం రోడ్డుపై పశువులను కట్టేసినందుకు మల్లవేన పెద్ద పోషంకు రూ.2000 జరిమానా విధించినట్లు ప్రత్యేకాధికారి గంగాభవానీ తెలిపారు. ఇక నుంచి ఎవరూ రోడ్లపై పశువులు కట్టేయొద్దని సూచించారు. రోడ్లపై పశువులను కట్టేసినా, చెత్త వేసినా జరిమానా వేస్తామన్నారు. అలాగే రోడ్లపై పాదులను తొలగించారు. కార్యక్రమంలో సర్పంచ్ తోట మధుకర్, కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కోడ్ సైకిలెక్కింది
సాక్షి, కడప : టీడీపీ ప్రభుత్వం ఎన్నికల కోడ్‌ను అడుగడుగునా ఉల్లంఘిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9 తరగతి చదువుతున్న బాలికలకు సైకిళ్ల పంపిణీ విషయం ఏడాది పాటు పట్టనట్లు వ్యవహరించిన ప్రభుత్వం.. ఎన్నికలు రావడంతో హడావుడి చేస్తోంది. ఇదంతా ఎన్నికల స్టంటేనని, బాలికల విద్యపైన ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బడికొస్తా పథకంలో భాగంగా జిల్లాలోని 20 వేల మందికి పైగా బాలికలకు ప్రభుత్వం సైకిళ్లు పంపిణీ చేయాల్సి ఉంది. విద్యాసంవత్సరం ప్రారంభంలో (గతేడాది జూన్, జూలైలో) అందజేయాల్సి ఉంది. కానీ అప్పటి నుంచి తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరించి.. తీరా ఎన్నికలు వస్తుండటంతో.. విద్యా సంవత్సరం ముగిసే సమయంలో సైకిళ్ల పంపిణీ చేపట్టేందుకు చర్యలు తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కొన్ని రోజులకే ఎన్నికల నగారా మోగింది. దీంతో ఈ నెల 10 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కానీ విద్యాశాఖాధికారులు మాత్రం జిల్లాలో అక్కడక్కడా సైకిళ్లు పంపిణీ చేస్తూ.. ఎన్నికల కోడ్ తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇవ్వకపోగా.. విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇవ్వాల్సిన సైకిళ్లను ఇవ్వకపోగా.. ఇప్పడేమో తాము ఇస్తుంటే.. వైఎస్ఆర్సీపీ వారు అడ్డుకుంటున్నారనే అపవాదును వారి పైకి నెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. విద్యాశాఖాధికారులు పంపిణీకి సిద్ధం కావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇదంతా విద్యార్థులపైన ప్రేమ కాదని, ప్రభుతంపైన ఉన్న స్వామి భక్తిని చాటుకునేందుకేనని పలువురు విమర్శిస్తున్నారు. అదే విద్యా సంవత్సరం మొదట్లో పంపిణీ చేసి ఉంటే.. బాగుండేది కదా అని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు అటు అధికారులను, ఇటు ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు. పంపిణీ యత్నం కడపలోని జయనగర్‌లో మంగళవారం సైకిళ్లను పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తుండగా.. ‘సాక్షి’ కంటపడటంతో విద్యాశాఖాధికారులు తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరించారు. ఎర్రగుంట్ల జెడ్పీ బాలికల పాఠశాలలో సైకిళ్లు పంపిణీ చేసేందుకు ఆవరణలో సిద్ధంగా ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు వెళ్లి.. ఎంఈఓ బాలశౌరమ్మ, మున్సిపల్ కమిషనర్ విజయభాస్కర్‌రెడ్డికి సమాచారం అందించారు. వెంటనే వారు వచ్చి సైకిళ్లను గదిలోకి మార్పించారు. సైకిళ్ల స్టిక్కరింగ్‌లను వెంటనే తొలగించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందని, ఈ పని చేపట్టకూడదని హెచ్ఎం పావనికి అధికారులు సూచించారు. సైకిళ్ల పంపిణీ చేయలేదని, కేవలం గదిలో ఉన్న వాటిని బయట ఉంచామని ఆమె చెప్పుకొచ్చారు. -
తస్మాత్.. జాగ్రత్త
సాక్షి, చెన్నూర్(ఆదిలాబాద్) : గడప దాటి రోడ్డెక్కితే ఇంటికి క్షేమంగా చేరుకుంటామన్న గ్యారెంటీ లేకుండా పోతుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వెళ్తున్నా సరే మైనర్లు, తాగుబోతులు ప్రాణాలు తోడేస్తున్నారు. ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రమాదాలను చూసినట్లయితే డ్రైవింగ్‌పై అవగాహన లేని మైనర్లు వాహనాలను నడపటం వల్లే ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో అసలు మైనర్లకు వాహనాలు ఇస్తూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రమాదాలకు కారణమవుతున్న తల్లిదండ్రులపై కేసు నమోదు చేయాలని ఇటీవలే కొత్త అమెండ్మెంట్ వచ్చింది. దీనిపై ప్రత్యేక కథనం. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఏదో ఒక చోట తరచూ జరుగుతుండగా అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాలకు గల కారణాలను పరిశీలిస్తే అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపటం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వెహికిల్స్ తోలడం, పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణం తదితరవి కొన్ని కారణాలైతే.. ఏమాత్రం అవగాహన లేని మైనర్లు ద్విచక్ర వాహనాలనే కాక ఫోర్‌వీలర్స్, త్రీవీలర్స్ వాహనాలు కూడా నడపటం ప్రమాదాలు జరుగటానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పిల్లలు నడిపితే ..తల్లిదండ్రులపై కేసు మోటార్ వెహికల్ యాక్ట్‌లో మరో కొత్త అమెండ్మెంట్ను ఇటీవలే తీసుకువచ్చారు. తల్లిదండ్రులు ఇకపై తమ మైనర్ పిల్లలకు వాహనాలను ఇవ్వకూడదు. పిల్లలు అతివేగంతో, అజాగ్రత్తతో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులైనా లేక పోలీసులకు పట్టుబడ్డా కొత్త అమెండ్మెంట్ ప్రకారం ఇకపై సదరు మైనర్ల పైనే కాక తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు కానుంది. సాధారణంగా వాహనం ఎవరిదైనా సరే దానిని నడిపే సమయంలో సదరు వ్యక్తికి సరైన పత్రాలు లేకుంటే జరిమానాలు విధిస్తూ వచ్చారు. కాగా, ఇప్పుడొచ్చిన కొత్త నిబంధన ప్రకారం మైనర్లు వాహనాలు నడిపితే మైనర్‌తోపాటు తల్లిదండ్రులు లేదా వాహనాన్ని ఇచ్చిన వారిపై కూడా కేసు నమోదు చేసే అధికారాలు పోలీసులకు ఉన్నాయి. పేరెంట్స్ బీ కేర్‌ఫుల్ కొత్తగా వచ్చిన మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఇకపై తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 18 ఏళ్లు వచ్చిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారికే పేరెంట్స్ వాహనాలు ఇవ్వాలి. లైసెన్స్ లేకుండా నడిపితే చర్యలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటాం. కొత్తగా వచ్చిన ఎంవీ అమెండ్మెంట్ ప్రకారం మైనర్లకు వాహనం ఇచ్చిన తల్లిదండ్రులపైనా కేసు నమోదు చేస్తాం. డైవింగ్ చేసే వారు ఎవరైనా సరే వాహనానికి సంబంధించిన పేపర్లతోపాటు లైసెన్స్ తప్పనిసరి కలిగి ఉండాలి. మైనర్లు డ్రైవింగ్ చేయటం నేరం. ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నిబంధనలు ప్రతీ ఒక్కరూ పాటించాలి. – శ్రీకాంత్, ఆర్కేపీ ఎస్ఐ -
పలు ప్రాంతాల్లో టీడీపీ యదేచ్చగా కోడ్ ఉల్లంఘన!
కాకినాడ: ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఎలాంటి ప్రచారం చేపట్టవద్దని ఎన్నికల సంఘం నిర్ధేశించిన నియమ, నిబంధనల్ని(కోడ్) తెలుగుదేశం పార్టీ యదేచ్చగా ఉల్లంఘనకు పాల్పడుతోంది. సీమాంధ్రలోని పలు ప్రదేశాల్లో టీడీపీ మద్యం, డబ్బు పంచుతూ.. ప్రచారానికి పాల్పడుతోంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడులో ఎన్నికల నిబంధనల్ని బేఖాతరు చేసి టీడీపీ నేత బాలవీరాంజనేయస్వామి ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే అధికారులు పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో టీడీపీ నేతల ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతున్నారు. దుమ్మలపేట, తారకరామనగర్లలో టీడీపీ పోస్టర్లతో ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి తోట నర్సింహం, ఎమ్మెల్యే అభ్యర్థి కొండబాబుతో కూడిన పోస్టర్లతో ప్రచారం నిర్వహిస్తున్నారు.