హోలీ శుభాకాంక్షలు చెప్పిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : హోలీ పండుగ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలుగు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. సుఖ సంతోషాలతో హోలీ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. రంగుల పండుగ ప్రజల జీవితాలను రంగుల మయం చేయాలని, రానున్న రోజుల్లో ప్రజలకు అంతా మంచే జరగాలన్నారు.ఈ మేరకు వైఎస్ జగన్ గురువారం ఉదయం ట్విట్ చేశారు.
On this Holi, wishing you and your family, happiness and prosperity always. #HappyHoli2019
— YS Jagan Mohan Reddy (@ysjagan) 21 March 2019
కాగా గత ఏడాది ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తిలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ను పలువురు విద్యార్థులు కలిసి...ఆయనకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.