ఢిల్లీ పోలీసుల్లో మూడోవంతు మహిళలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసు శాఖలో మూడోవంతు పోస్టులను మహిళలకు కేటాయించనున్న ట్లు హోమ్ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ విషయం తెలిపారు. ఢిల్లీ పోలీసుల్లో మహిళా బలగాన్ని 1/3 వంతుకు పెంచాలని తాము నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర పోలీస్తో పాటు కేంద్ర పోలీస్ బల గంలో మహిళల సంఖ్యను పెంచనున్నట్లు ఆయన తెలిపారు. కేటాయించిన బలగం ప్రకారం ఢిల్లీలో ప్రతి లక్ష మంది జనాభాకు 420.49 పోలీసులు ఉండవలసి ఉండగా 391.33 మంది (2013 జనవరి లెక్కల ప్రకారం) పోలీసులు ఉన్నారని ఆయన చెప్పారు. అఖిల భారత స్థాయిలో ప్రతి లక్ష జనాభాకు 181. 47 మంది పోలీసులను కేటాయించగా వాస్తవంగా వారి సంఖ్య 136.42గా ఉందని ఆయన వివరించారు.
రాష్ట్ర, కేంద్ర పోలీసు బలగాలతో పాటు ఇతర పోలీసు సంస్థలు సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయని ఆయన చెప్పారు. ఐపీఎస్ అధికారుల కొరత ఉందని ఆయన సభకు తెలిపా రు. ఐపీఎస్ అధికారుల కొరతను తీర్చడం కోసం సివిల్ సర్వీస్ పరీక్షలో ఐపీఎస్ బ్యాచ్ పరిమాణాన్ని పెంచినట్లు ఆయన చెప్పారు. ప్రతి సంవత్స రం 80 మంది ఐపీఎస్ అధికారులను లిమిటెడ్ కాం పిటీటివ్ పరీక్ష ద్వారా ఎంపిక చేసి భర్తీచేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందని, అయితే కోర్టు కేసుల కారణంగా ఈ పద్ధతిలో నియామకాలు జరపడం ప్రారంభించలేదని ఆయన చెప్పారు. పదోన్నతుల ద్వారా ఐపీఎస్ అధికారులను నియమించే ప్రక్రియను వేగిరపరచినట్లు ఆయన చెప్పారు.