Women reservations
-
సీఎం రేవంత్ కొత్త జీవోను వ్యతిరేకిస్తూ.. సోనియాకు ఎమ్మెల్సీ కవిత లేఖ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ అవలంభిస్తున్న వైఖరిపై విమర్శలు గుప్పించారు. రిజర్వేషన్ల స్ఫూర్తిని పక్కనబెడుతూ సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటూ ఫిబ్రవరి 10న కొత్త జీవో తీసుకురావడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ఆడబిడ్డల హక్కులను కాంగ్రెస్ తుంగులో తొక్కుతుందని, ఈ అంశంపై జాతీయ పార్టీ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘1996లో అనేక పోరాటాల ఫలితంగా మహిళలకు ఉపాధి అవకాశాల్లో 33.3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నంబర్ 41, 56 జారీ అయ్యాయి. దీనికి 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఇందిరా సాహ్ని తీర్పు కూడా ఎంతో తోడ్పాటునిచ్చింది. ఆ తర్వాత రాజ్యంగబద్ధంగా మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లు కల్పించారు. మన దేశంలో సామాజిక రిజర్వేషన్లు ఎలా అయితే ఉన్నాయో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేసే పద్ధతి నడుస్తోంది. ఇన్నేళ్ల నుంచి సాగుతున్న ఈ పద్ధతిని ఇటీవల రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకొని తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తూ జీవో 41, 56ను రద్దు చేస్తూ ఈ నెల 10న కొత్తగా జీవో 3ను తీసుకువచ్చింది. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసినా.. తాము మహిళల హక్కులను హరించబోమని 2023 జనవరిలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. చదవండి: కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్.. ఆ జాబితాపై హైకమాండ్‌తో భేటీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరితో సంప్రదింపులు జరపకుండా మహిళల హక్కులకు భంగం కలిగిస్తూ ఈ నెల 6న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. తద్వారా మహిళల హక్కులను సంపూర్ణంగా, శాశ్వతంగా హరిస్తూ రోస్టర్ పాయింట్లు లేకుండా హారిజాంటల్ పద్ధతిలో రిజర్వేషన్లను కల్పిండానికి జీవో 3ను ప్రభుత్వం జారీ చేసింది. ఇది మహిళల ఉద్యోగావకాశాలకు శరాఘాతంగా నిలవనుంది. ఉదాహరణకు ఈ ఏడాది దాదాపు 2 లక్షల 50 వేల మంది ఇప్పటికే టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో నమోదుచేసుకున్నారు. వారిలో లక్ష మంది ఆడబిడ్డలు ఉన్నారు. ఈ ఏడాది 2 లక్షల కొలువులు ఇస్తామని ప్రభుత్వం చెబుతుంనది. అంటే 33.3 శాతం రిజర్వేషన్ల మేరకు కనీసం 66 వేల మంది మహిళలకు ఉద్యోగాలు కచ్చితంగా రావాలి. అదనంగా మరింత మంది మహిళలకు ఉద్యోగాలు లభించాలి. అదే ఈ రిజర్వేషన్ల స్ఫూర్తి. దీనిని పక్కనబెడుతూ సీఎం రేవంత్ రెడ్డి కొత్త జీవో తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాను. ఈ అంశంపై జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలి. సుప్రీంకోర్టు తీర్పును పాటించబోమంటూ బీహార్, కర్ణాటక రాష్ట్రాలు జీవోలు జారీ చేశాయి. కానీ తెలంగాణలో మాత్రం మీ గ్యారెంటీతో ఇందిరమ్మ రాజ్యంగా చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఇంటి ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతోంది. ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆ జీవోను తక్షణమే వెనక్కి తీసుకునేలా ముఖ్యమంత్రికి ఆదేశాలు జారీ చేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. -
సామాజిక న్యాయం
సాక్షి, అమరావతి : ఆలయాలు, ట్రస్టుల్లో కూడా సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలన్న సీఎం వైఎస్ జగన్ మరో విప్లవాత్మకమైన నిర్ణయానికి శాసనసభ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో అన్ని ఆలయాలు, ట్రస్టుల పాలక మండళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు ఇక నుంచి అగ్ర ప్రాధాన్యం దక్కనుంది. వాటి పాలక మండళ్లలో 50 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ గురువారం ఆమోదించింది. అదే విధంగా మొత్తం పదవుల్లో 50శాతం మహిళలకు కేటాయించేలా ఈ బిల్లుకు ప్రతిపాదించిన సవరణకు కూడా అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. అలాగే, ఆలయాల ఆస్తుల పరిరక్షణ, ప్రతిష్టను కాపాడే దిశగా తగిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం లభించింది. ‘ఆంధ్రప్రదేశ్ ధార్మిక, హిందూ మత సంస్థలు–ఎండోమెంట్స్ చట్టం–1987’కు సవరణ బిల్లును దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఈ బిల్లు ఉద్దేశాలు, లక్ష్యాలను సభకు వివరించారు. సభ్యులు ఈ బిల్లుకు మద్దతిస్తూ ప్రసంగించారు. అనంతరం ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దాంతో ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, ట్రస్టుల పాలక మండళ్లలో ఎక్స్ అఫీషియో సభ్యులు కాకుండా ప్రభుత్వం నియమించే మొత్తం సభ్యులలో 50 శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించనున్నారు. అదే విధంగా అన్ని ఆలయాలు, ట్రస్టుల పాలక మండళ్లలో ఎక్స్ అఫీషియో సభ్యులు కాకుండా ప్రభుత్వం నియమించే మొత్తం సభ్యులలో 50 శాతం పదవులు మహిళలకే రిజర్వ్ చేయనున్నారు. ఈ మేరకు ఈ బిల్లుకు సవరణను కూడా శాసనసభ ఆమోదించింది. అక్రమాలకు పాల్పడితే ఔటే ఇక ఆలయాలు, ట్రస్టుల పాలక మండళ్ల సభ్యులు ఎవరైనా సరే అనుచితంగా ప్రవర్తించినా, అక్రమాలకు పాల్పడినా ప్రభుత్వం వారిని రెండేళ్ల పదవీకాలం కంటే ముందే తొలగించడానికి ఈ బిల్లు ఆమోదం ద్వారా మార్గం సుగమమైంది. ఆలయాలు, ట్రస్టుల ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు పూర్తి అధికారాలను ఇచ్చింది. కాగా, తిరుపతి పట్టణాభివృద్ధి, ప్రాధికార సంస్థ (తుడా) చైర్మన్‌ను టీటీడీలో పదవి రీత్యా సభ్యునిగా నియమించేందుకు చట్టంలో సవరణను సభ ఆమోదించింది. ఆలయాల ప్రతిష్ట కాపాడటమే లక్ష్యం సమాజంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు అగ్ర ప్రాధాన్యం ఇస్తూ వారికి సామాజిక గౌరవం తీసుకురావాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధాంతం. అందుకే ఆలయాలు, ట్రస్టుల పాలక మండళ్లలో కూడా ఆ వర్గాలకు సమాన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. ఆలయాల ఆస్తుల పరిరక్షణకు ఇది ఉపకరిస్తుంది. రెండేళ్ల పదవీకాలం ఉంది కదా అనే ధీమాతో అనుచితంగా ప్రవర్తించే పాలక మండలి సభ్యుల ఆటకట్టిస్తుంది. అలాంటి వారిని పదవుల నుంచి ప్రభుత్వం తొలగించేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. – వెలంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆలయాల ప్రతిష్ట, ఆస్తుల పరిరక్షణకు అవకాశం దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు, ప్రతిష్టను కాపాడేందుకు ప్రభుత్వానికి ఈ బిల్లు ద్వారా పూర్తి అధికారాలు దక్కుతాయి. ఎవరైనా పాలకమండలి సభ్యుడు అవినీతికి పాల్పడినా.. భక్తులు, ఇతరులతో అనుచితంగా ప్రవర్తించినా వారిని తొలగించేందుకు ప్రభుత్వానికి అవకాశం కలుగుతుంది. చంద్రబాబు పాలనలో విజయవాడ దుర్గగుడి పాలక మండలిలో ఓ సభ్యురాలు అమ్మవారి చీరలను అమ్ముకున్నారు. మరో సభ్యుడు క్షురకులను దూషించారు. కానీ, వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇలాంటి వాటిని సహించబోమని వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. – మల్లాది విష్ణు, ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ -
ఒడిశా సీఎం సంచలన నిర్ణయం
భువనేశ్వర్: సార్వత్రిక ఎన్నికల ముందు ఒడిశా ముఖ్యమంత్రి, బీజూజనతాదళ్ (బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల టికెట్ల కేటాయింపులో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం కెండార్పర ఎన్నికల సభలో పాల్గొన్న నవీన్ పట్నాయక్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. దీంతో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. దీంతో 33శాతం ఎంపీ టికెట్లను మహిళకే కేటాయించనున్నారు. ఒడిశాలోని 21 లోక్‌సభ స్థానాల్లో ఏడు లేదా ఎనిమిది స్థానాలు మహిళలకు దక్కనున్నాయి. కాగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ దేశ వ్యాప్తంగా దశాబ్దాలుగా వినిపిస్తోన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన బిల్లు ప్రస్తుతం పార్లమెంట్లో పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా నవీన్ పట్నాయక్ తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. లోక్‌సభతో పాటు ఒడిశా అసెంబ్లీ కూడా ఎన్నికలు జరుగనున్నాయి. -
అసమానత్వంపై పోరే అసలు విముక్తి
ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినో త్సవం జరుపుకుంటున్న సందర్భంలో మనం ఉన్నాం. గతం కంటే మహిళలకు మహిళా దినం జరుపుకోవాలనే స్పృహ పెరిగింది. దీనితోపాటు మార్చి 8 స్ఫూర్తిని పక్కదారి పట్టించే ప్రయత్నాలు కూడా గత 15 సంవత్సరాలుగా సాగుతున్నాయనేది మరో వాస్తవం. ‘హ్యాపీ ఉమెన్స్ డే’ అంటూ వారం రోజుల ముందు నుండే బహుళజాతి కంపెనీలు టీవీ లలో ప్రకటనలు గుప్పిస్తుంటారు. 170 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులను చూస్తే... మానవ హక్కులు మహిళల హక్కులుగా పరిణామం చెందని రోజులవి. 1848లో అమెరికా బట్టల ఫ్యాక్టరీల్లో కార్మిక మహి ళలు 10 గంటల పని దినం, సమాన పనికి సమాన వేతనం, మెరుగైన పని పరిస్థితుల కోసం గడ్డకట్టిన చలిలో ర్యాలీలు, సమ్మెలు, వాకౌట్లు చివరికి ప్రాణ త్యాగాలు కూడా చేసి చరిత్రలో నిలిచిపోయారు. మహిళా ట్రేడ్ యానియన్లను ఏర్పాటు చేసుకు న్నారు. కార్మిక మహిళల పోరాటాలతో మహిళల ఓటు హక్కు ఉద్యమం కూడా జత కలిసింది. నాటి నుంచి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా రకరకాల డిమాండ్లతో మహిళలు తమ హక్కుల సాధన కోసం ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలి లైంగిక వేధిం పులకు వ్యతిరేకంగా సమాన వేతనం కోసం జరిగిన ‘మీటూ’ ఉద్యమం పెద్దదిగా చెప్పుకోవచ్చు. చేదునిజం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా దేశ పార్లమెంట్లలో మహిళల వాటా నేటికీ 22 శాతం మాత్రమే, భూమిపై హక్కులు 20 శాతంకన్నా తక్కువ కాని మహిళా కూలీలు మాత్రం 43 శాతంగా ఉంటూ సమానత్వానికి సుదూర స్థాయిలో ఉన్నారు. ఇక భారత్ మహిళల పరిస్థితి నాలుగేళ్లలో ప్రమాద కర స్థాయికి చేరిందని రాయిటర్ సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. రాజకీయ రంగంలో మహిళల పరి స్థితి 188లో భారత్ 147వ స్థానంలో ఉందంటే మోదీ ప్రభుత్వం మాటలకు, చేతలకు పొంతన లేద నేది ఒక వాస్తవం. హిందూత్వ సంస్కృతి, సంప్రదా యాల గురించి మాట్లాడుతున్న బీజేపీ దృష్టిలో స్త్రీ అంటే నాలుగు గోడల మధ్య ఉంటూ ఇంటికి, పిల్లలకి, భర్తకు సేవ చేస్తూ ఉండాలి. అమ్మాయిలపై అత్యాచారాలు జరగడానికి వారు వేసుకునే జీన్స్ పాంట్లు, టీషర్టులే కారణమని వాదిస్తున్నారు. కశ్మీర్ కథువా బీజేపీ పాలిత ప్రాంతాల్లో జరుగుతున్న మైన ర్లపై అత్యాచారాల్లో రాజకీయ నాయకులే భాగమై నారు. ఎప్పటిలాగే చట్టం వారిని రక్షిస్తున్నది. పైగా చట్టసభల్లో మైనర్లపై అత్యాచారం జరిపితే ఉరిశిక్షలు అమలు చేస్తామని చట్టాలను రూపొందిస్తున్నారు. మనువాద బ్రాహ్మణీయ హిందూత్వ సంస్కృతి అమ లులో ఉన్నంత కాలం మహిళలపై హింస ఆగదు. ఈ ప్రభుత్వాలే మరోవైపు ఆధునిక జీన్స్ మార్కెట్‌కు పేరున్న డెనిమ్ లాంటి బహుళజాతి కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందాల పోటీలను గల్లీనుండి మహానగరాల వరకు ఆహ్వానం పలుకుతున్నారు. అందాల పోటీలను గల్లీనుంచి మహానగరాల వరకు అనుమతులివ్వడంతో సెక్స్ వ్యాపారం, ట్రాఫికింగ్, టూరిజం, సినిమాలలో విదేశీ పెట్టుబడులు, ఇంటర్నెట్, సెల్‌ఫోన్, కాస్మో టిక్స్ మార్కెట్ యథేచ్చగా నడుస్తున్నాయి. చట్టాల ద్వారా శిక్షపడేది చాలా తక్కువ. అది కూడా పేదలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలకు మాత్రమే. కోర్టుల చుట్టూ తిరగలేక బాధితులు కోర్టులపై విశ్వాసాన్ని కోల్పోతున్నారు. 2014 మేనిఫెస్టోలో మహిళలు జాతి నిర్మాతలు అన్న మోదీ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తేవడంవలన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 80 శాతం మహిళలు గ్రామ పరిపాలనకు దూరమయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఊసే లేదు. నేటి పాలకులకు దళిత మహిళలు మనుషులే కాదు. ఇన్ని అరాచకాలు మహిళలపై జరు గుతున్నా, పీడిత మహిళలవైపు నిలిచినా, పాలకు లను ప్రశ్నించినా మహిళా నాయకులను దేశ వ్యాప్తంగా ఉపా చట్టంతో నెలల తరబడి జైళ్లలో నిర్బంధిస్తున్నారు. వీళ్లను అర్బన్ నక్సలైట్లుగా పత్రి కలలో తాటికాయంత అక్షరాలతో ప్రచారం చేస్తారు. ఇక రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాల్లో, కుటుంబ హింసలో ముందే ఉండి శిక్షలు కూడా తక్కువ శాతం పడుతున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కుల దురహంకార హత్యలు విపరీతంగా పెరిగాయి. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ లేని పరిస్థితి ఉన్నది. ఈ క్రమంలోనే మాదిగ కులానికి చెందిన సుశ్రూత కొడుకు దేవర్శల దారుణ హత్య, సజీవ దహనం, ప్రణయ్ హత్య, అమృతపై వేధింపులు మహిళలకు ముప్పును కలిగిస్తున్నాయి. మహిళల చైతన్యం, వ్యక్తిత్వం, ఆమెపట్ల దాడులకు పురికొల్పుతున్నాయి.. అదేసమయంలో పురుషుడి ఆధిపత్యం, స్త్రీ అంటే విలాస వస్తువని, సొంత ఆస్తి అనే భావజాలం మరింత పెరుగుతున్నది. స్త్రీ పురు షుల మధ్య అంతరాలు పాలకుల విధానాలవల్ల మరింత పెరుగుతున్నాయి. స్త్రీలు పురుషుల బాని సలు కాదని పితృస్వామ్య సంకెళ్లను తెంపుకుని అంత ర్జాతీయ మహిళాదినంను ప్రతిపాదించిన క్లారాజె ట్కిన్ సూచించిన స్త్రీ విముక్తి మార్గమే నేడు కూడా శాస్త్రీయమైనది. సవ్యమైనది. (నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం) వ్యాసకర్త: అనిత, రాష్ట్ర అధ్యక్షురాలు, చైతన్య మహిళా సంఘం anithacms@gmail.com -
మహిళలకు 33శాతం రిజర్వేషన్లు: అశోక్ గహ్లోత్
జైపూర్: రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాసన సభలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రిమండలి ఏకగ్రీవంగా తీర్మానించినట్లు ఆ రాష్ట్ర సీఎం అశోక్ గహ్లోత్ శుక్రవారం వెల్లడించారు. మహిళల రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాహుల్ గాంధీ అదేశించారని తెలిపారు. పార్లమెంట్లో కూడా మహిళల రిజర్వేషన్ల కోసం సోనియా గాంధీ తీవ్రంగా కృషి చేస్తున్నారని గహ్లోత్ పేర్కొన్నారు. తమ పోరాటం ఫలితంగా ఆ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిందని, ప్రస్తుతం రాజ్యసభలో పెండింగ్‌లో ఉందన్నారు. కాగా రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన విధంగా మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు గహ్లోత్ వెల్లడించారు. -
మహిళా.. ఏలుకో
పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో రాణిస్తున్న మహిళలు.. రాజకీయంగా సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. ఇంకా చెప్పాలంటే పురుషుల కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి ప్రజా ప్రతినిధులు కాబోతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించడంతో సగం స్థానాల్లో వారే బరిలో దిగాల్సిన పరిస్థితి. దానికితోడు జిల్లా జనాభాలో పురుషులతో పోల్చుకుంటే మహిళల సంఖ్య అధికంగా ఉండటంతో మరిన్ని ఎక్కువ స్థానాలు వారికే సొంతమయ్యాయి. దాంతోపాటు చాలా మంది పతులు తమ భార్యలను బరిలోకి దింపుతుండటంతో ఈసారి ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా నమోదవుతోంది. సాక్షి, సిద్దిపేట: జిల్లా జనాభాలో పురుషుల కన్నా.. 3526 మంది మహిళలే అధికంగా ఉన్నట్లు అధికారులు లెక్కల్లో తేల్చేశారు. జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక పాత మున్సిపాలిటీలకు తోడు.. ఈ ఏడాది చేర్యాల పట్టణానికి కూడా మున్సిపాలిటీ హోదాను కల్పించారు. ఈ ఐదు మున్సిపాలిటీలు పోగా మిగిలిన 22 మండలాల పరిధిలో కొత్తవీ పాతవీ కలిపి మొత్తం 499 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో మొత్తం 7,95,960 మంది జనాభా ఉన్నారు. వీరిలో 3,96,082 మంది పురుషులు ఉండగా... 3,99,608 మంది మహిళలు ఉన్నారు. అంటే పురుషుల కన్నా మహిళలు 3526 మంది ఎక్కువగా ఉండటం గమనార్హం. రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం మొత్తం స్థానాల్లో మహిళలకు యాభై శాతం కేటాయించాల్సి ఉంది. ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు జనరల్ స్థానాల్లో కూడా యాభై శాతం మహిళలకే కేటాయిస్తారు. దీంతో మొత్తం 499 పంచాయతీల్లో సంగం అంటే 249 స్థానాలు మహిళలకు కేటాయించారు. జిల్లాలోని రిజర్వేషన్ల కేటాయింపులో జనాభా శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడంతో పురుషులకన్నా నాలుగు స్థానాలు ఎక్కువగా మహిళలకు కేటాయించారు. దీంతో జిల్లాలో 252 స్థానాలు మహిళలకే కేటాయించారు. ఈ కేటాయింపులు కూడా రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో లాటరీ పద్ధతిన జరిగింది. మహిళలకు 252 గ్రామ పంచాయతీలు స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమల్లో ఉండటంతో.. జిల్లాలోని మొత్తం 499 గ్రామ పంచాయతీల్లో సగానికి మించి 252 స్థానాలు మహిళలకు కేటాయిస్తూ రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా చూస్తే మొత్తం గ్రామ పంచాయతీల్లో 18 స్థానాలు ఎస్టీలకు, 93 స్థానాలు ఎస్సీలకు, 143 స్థానాలు బీసీలకు కేటాయించారు. మిగిలిన 245 స్థానాలు జనరల్ రిజర్వేషన్‌గా కేటాయించారు. వీటిల్లో కూడా సగం స్థానాలు మహిళలకు కేటాయించాల్సి ఉంది. కావున ఎస్టీల్లో 10, ఎస్సీల్లో 47, బీసీల్లో 72, జనరల్ స్థానాల్లో 123 మొత్తం 252 మహిళలకు కేటాయించారు. అదేవిధంగా మహిళల కన్నా 4 స్థానాలు తక్కువగా 247 జనరల్ విభాగానికి కేటాయించారు. అయితే కొన్ని గ్రామాల్లో జనరల్ స్థానాలుగా కేటాయించినప్పటికీ అక్కడ ఉన్న నాయకులు పెద్ద పదవుల్లో ఉండటం, ఉద్యోగులుగా పనిచేయడం, ఉత్సాహవంతులైన మహిళలు ఉండే అవకాశం ఉంది. దీంతో పతులకు బదులుగా సతులను పోటీల్లో దింపే అవకాశం ఉంది. ఇలా మహిళలకు కేటాయించిన 252 పంచాయతీలే కాకుండా జనరల్ విభాగంలో కూడా మహిళలు పోటీలో ఉండే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
‘ఆ రిజర్వేషన్లు కేవలం వారి కోసమే’
సాక్షి, న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందినా అవి కేవలం రాజకీయ నాయకుల బిడ్డలకు, భార్యలకు మాత్రమే దక్కే అవకాశం ఉందని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో మహిళా కమిషన్ శుక్రవారం నిర్వహించిన ‘భారతదేశంలో మహిళల రాజకీయ పాత్ర, ప్రాతినిధ్యం’ అనే అంశంపై ఆమె మాట్లాడుతూ... ‘ దేశంలో మహిళలు స్వశక్తితో ఎదగాలి. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభిస్తే.. అది కేవలం రాజకీయ నాయకుల కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూరుస్తుంది. మీ లాంటి, మా లాంటి సామాన్య మహిళకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రాదు. 50 శాతం మహిళా జనాభా ఉన్నప్పుడు అంతే శాతం రాజకీయాల్లో కూడా ఉండాలి. అది మహిళల హక్కు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ స్థాయిలో ఎన్నికైన మహిళలకు రాజకీయ హక్కును వారి భర్తలే హరిస్తున్నారు. పేరుకే మహిళా ప్రజా ప్రతినిధి. అధికారాలన్నీ పురుషులే చలాయిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయో కూడా వారికి తెలియదు. వారు కేవలం సంతకాలకే పరిమితం అవుతున్నారు’ అంటూ వ్యాఖ్యానించారు. చదువుకున్న యువతులు రాజకీయంగా ఎదగడనికి ప్రయత్నించాలని సూచించారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లు చర్చకు రానున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పార్లమెంట్లో, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజరేషన్ల బిల్లు రాజ్యసభలో ఆమోదం పొంది ప్రస్తుతం లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. -
‘ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ దేవాలయం లాంటిదని అలాంటి చోట ప్రజల సమస్యల పరిష్కారాల కోసం చర్చలు జరగాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించారు. ఇటీవల పార్లమెంట్ ఉభయసభల్లో చోటు చేసుకుంటున్న ఘటనలపై మహాజన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ‘విజన్ ఇండియా ఫౌండేషన్’ నిర్వహించిన వర్క్ షాప్‌లో పాల్గొన్న స్పీకర్ పార్లమెంట్ కార్యకలాపాలపై మాట్లాడారు. సమస్యల గురించి చర్చించాల్సిన చోట సభ్యుల మధ్య వాగ్వాదాలు జరుతున్నాయని మహాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. సభా కార్యకలాపాలను ప్రజలు గమనిస్తున్న విషయం ఎంపీలు గుర్తెరిగి ప్రవర్తించాలని, ఎన్నికల సమయంలో సభను అర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందని పేర్కొన్నారు. ఎంపీలందరూ సభ రూల్స్ పాటించాలని, వెల్ లోపలికి వచ్చి అవాంతరం కలిగించి సభా మర్యాదలకు భంగం కలిగించడం మంచిది కాదన్నారు. సభ్యుల చర్యల వల్ల గత బడ్జెట్ సమావేశంలో 127 గంటల సమయం వృథా అయిందని, 29 సార్లు సమావేశమైతే కేవలం 0.58 శాతం ప్రశ్నలపై మాత్రమే చర్చ జరిగిందని వెల్లడించారు. పార్లమెంట్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మహాజన్ పలుమార్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష, అధికార పక్షాలు మహిళా రిజర్వేషన్లకు సహకరించాలని ఆమె ఎంపీలను కోరారు. మీడియా ప్రసారాలపై స్పీకర్ ఆగ్రహించారు. సభలో మంచి చర్చ జరిగినప్పుడు ప్రచారం చేయ్యరని, సభ్యుల మధ్య వాగ్వాదం జరిగితే పదేపదే ప్రసారం చేస్తారని అన్నారు. -
పదవి మహిళది.. పెత్తనం భర్తది
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చినా భర్తలే పెత్తనం చెలాయిస్తున్నపుడు సాధికారత వచ్చినట్లు ఎలా అవుతుందని ఢిల్లీ హైకోర్టు రిటైర్డు ప్రధాన న్యాయమూర్తి, ఓబీసీ ఉప కేటగిరీ కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ జి.రోహిణి ప్రశ్నించారు. మహిళా సాధికారత కోసం అనేక చట్టాలున్నా ఆచరణలో అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయన్నారు. ఉన్నత స్థాయికి ఎదిగిన మహిళల పురోగతికి సంప్రదాయాలు, మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు అవరోధమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోకా రాఘవరావు లా ఫౌండేషన్ సహకారంతో బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏసీ) రెండు రోజులపాటు నిర్వహించిన సదస్సు ముగింపు సందర్భంగా శనివారం ‘మహిళా సాధికారతకు న్యాయపాలన బలోపేతం’ అంశంపై జస్టిస్ రోహిణి ప్రసంగించారు. ‘రాజ్యాంగంలోని 14, 15వ అధికరణల ప్రకారం మహిళలకు పురుషుల తో సమాన అవకాశాలున్నాయి. ఒకప్పుడు సంక్షమం వరకే పరిమితమైన అంశం ఇప్పుడు సాధికారత వరకూ వచ్చింది. మహిళలకు విద్య, ఆర్థిక స్వాతంత్య్రం చాలా కీలకం. ఏ స్థాయికి చేరినా వ్యక్తిగత ఖర్చుల కోసం ఇతరులపై ఆధారపడటం, ఇతరుల అనుమతులు తీసుకోవాల్సిన అగత్యం మహిళలకు ఏర్పడుతోంది. ఉన్నత స్థాయికి ఎదిగిన మహిళలు శారీరక, మానసిక వేధింపులకు గురవుతున్నారు. ఈవ్‌టీజింగ్, గ్యాంగ్ రేప్, దారుణ వేధింపులు జరుగుతున్నాయి. సాంఘిక దురాచారాలు రూపుమాపడానికి తెచ్చిన చట్టాలు నేటీకీ అమలు చేయాల్సిన స్థితులున్నాయి. బాల్యవివాహాలు, వరకట్న వేధింపులు వంటి ఘటనలే అందుకు సాక్ష్యం’ అని అన్నారు. ‘రిజర్వేషన్ల బిల్లు ఏళ్లుగా పెండింగ్‌లోనే..’ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తెచ్చిన ప్రభుత్వాలు.. చట్టసభల్లోనూ అమలు చేసే బిల్లును ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉంచారని మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పరాంకుశం వేణుగోపాల్ అన్నారు. దేశంలోని వివిధ హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న 450 న్యాయమూర్తుల పోస్టుల్ని తక్షణమే భర్తీ చేయాలని సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో నలుగురు న్యాయమూర్తులు విభేదించి అదే అధికారిక భవనంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం సరికాదని సుప్రీంకోర్టు న్యాయవాది దీపక్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. అక్రమ చొరబాటుదారులకు దేశ పౌరసత్వం జారీ కాకుండా చర్యలు తీసుకోవాలని గౌహతి హైకోర్టు న్యాయవాది అపరిచిత శర్మ కోరారు. -
గళం
నేను 10వ తరగతి పాసైన తర్వాత పెళ్లి చేసేశారు. మా నాన్న, మామయ్యలు ఊరి పెద్దలుగా ఉండి అందరి తల్లో నాలుకలా వ్యవహరించేవారు. సాధారణంగా మన్యంలో మహిళలకు ప్రాధాన్యత తక్కువ. అభివృద్ధికి దూరంగా ఉండే మా పంచాయితీకి నిధులు అరకొరగా వస్తున్నాయి. బడ్జెట్లో లక్షల కోట్లు ప్రకటిస్తున్నా పంచాయితీకి కేవలం వేలల్లో మాత్రమే ఉంటున్నాయి. దీంతో.. మా బొర్రా పంచాయితీ అభివృద్ధికి దూరమైపోయింది. గత ఎన్నికల సమయంలో రిజర్వేషన్ ప్రకారం పోటీ చేసే అవకాశం వచ్చింది. మా కుటుంబాలకు రాజకీయాలతో సంబంధం లేదు. రాజకీయాల్లో ఓనమాలు కూడా రావు. పదవిని ఎలా వినియోగించుకోవాలి, ఏఏ అభివృద్ధి పనులు చేసే అవకాశముందని మా గ్రామ పెద్దలు, మాజీ సర్పంచుల దగ్గర నేర్చుకున్నారు. నా భర్త చంద్రన్న పోలీస్ కానిస్టేబుల్ కావడంతో నా పదవి విషయంలో తలదూర్చరు. కాబట్టి నేనే అన్ని విషయాల్లోనూ అవగాహన కలిగించుకున్నాను. ఎదురైన అనుభవాల నుంచి ఒక్కో విషయాన్ని నేర్చుకుంటున్నాను. మా ఊరిలో రాజకీయాలంటే ఆసక్తి ఉన్న వారికి నేర్పిస్తున్నాను. మా పంచాయితీలో 14 గ్రామాలున్నాయి. ఒక్కో గ్రామంలో ఒక్కో స్వభావం ఉన్న మనుషులు ఉంటారు. మహిళను కదా.. అలాంటి వారి నుంచి వ్యతిరేకత ఎదురవుతుందనే ఆందోళన ఉండేది. అందుకే వారందరితోనూ కలుపుగోలుగా ఉండాలని నిర్ణయించుకున్నాను. వారిని కూడా సలహాలు అడిగేదాన్ని. పదవిదేముంది సార్ ఐదేళ్ల తర్వాత పోతుంది. మా ప్రాంత ప్రజల దృష్టిలో మహిళా సర్పంచైనా మంచిగా చేసిందనే పేరుండిపోవాలన్నదే నా ఆశయం. మన్యం ప్రాంతంలోనూ రాజకీయాల్లో మహిళలు రాణించగలరు అని నిరూపించాలని మా కుటుంబ సభ్యులు చెప్పిన మాటలతోనే స్వశక్తిగా ఎదుగుతున్నాను. – దోనేరు సుందరమ్మ, బొర్రా పంచాయతీ సర్పంచి, అరకు నియోజకవర్గం, విశాఖపట్నం మొదటి ఏడాది భర్త నడిపించారు నేను ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. మా కుటుంబంలో ఎవ్వరికీ రాజకీయ పదవుల నేపథ్యం లేదు. గ్రామంలో పలుకుబడి ఉండటంతో వచ్చిన రిజర్వేషన్ల ప్రకారం సీటు దక్కింది. సర్పంచిగా పోటీ చెయ్యమని చెప్పారు. మొదట్లో భయం వేసింది. గ్రామ పెద్దలు ధైర్యం చెప్పడంతో ముందడుగు వేశాను. సర్పంచిగా గెలిచానే కానీ.. భయం ఉండేది. అధికారులతో ఎలా మాట్లాడాలి. ఏఏ పనులు చేసే అవకాశముంటుంది. ఎలాంటి పవర్ ఉంటుది.. ఇవేమీ తెలీదు. నా భర్త కొద్దో గొప్పో రాజకీయ అనుభవం ఉంది. ఆయన ధైర్యం చెప్పారు. ముందుండి నడిపిస్తానని చెప్పారు. మొదటి సంవత్సరమంతా నేను వెనుక.. నా భర్త ముందుండేవారు. ఏ సందర్భాల్లో ఎలా మాట్లాడాలి. ఏ తరహా పనులకు ఏ శాఖ అధికారిని సంప్రదించాలి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎలా వ్యవహరించాలనేది నా భర్త నడవడికను చూసి నేర్చుకున్నారు. క్రమంగా ఆయన సహాయం తీసుకోవడం తగ్గించాను. స్వతహాగా ప్రథమ పౌరురాలిగా నడవడం నేర్చుకున్నాను. ఇప్పుడు పూర్తి స్థాయి సర్పంచిగా వ్యవహరిస్తున్నాను. ఏదీ ముందు నుంచి రాదు కదా. నేర్చుకోవాలనే తపన పెరిగింది.. కాబట్టి ఈ నాలుగేళ్ల కాలంలో ఎవ్వరి నుంచి ఎలాంటి విమర్శలూ ఎదుర్కోలేదు. మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే నాలాగే ఏమీ రాదని భయపడుతుంటారు. కానీ.. ఆ భయం నుంచే చాలా నేర్చుకోవచ్చని తెలుసుకున్నాను. – తుపాకుల ఆదిలక్ష్మి, మజ్జివలస గ్రామ సర్పంచి, భీమిలి మండలం, విశాఖపట్నం. -
మహిళా పోలీస్ స్టేషన్లా..అవసరం లేదు!
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని పోలీసు శాఖ స్పష్టం చేసింది. పోలీస్ నియామకాల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేస్తున్న నేపథ్యంలో వాటి ఉపయోగం పెద్దగా అవసరం లేదని భావిస్తున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. వేధింపులు, వరకట్న కేసులు, విడాకులు.. ఇలా మహిళలకు సంబంధించిన కేసుల విచారణ కోసం పాత జిల్లాల్లో ప్రత్యేకంగా మహిళా పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసు శాఖ తాజా నిర్ణయంతో ఉన్న ఈ పోలీస్ స్టేషన్లు కూడా కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో పాత జిల్లాల హెడ్‌క్వార్టర్స్‌లో ఒక్కో మహిళా పోలీస్ స్టేషన్ చొప్పున ఏర్పాటు చేశారు. అయితే కొత్త జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్కటి కూడా ఏర్పాటు కాలేదు. దీనిపై పోలీస్ శాఖను వివరణ కోరగా.. ఇక మహిళా పోలీస్స్టేషన్లు అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో మహిళా పోలీస్ స్టేషన్ల వ్యవస్థపై పోలీస్ శాఖ నిర్ణయం వివాదాస్పదమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. రిజర్వేషన్‌తో సంబంధం ఏంటి? గృహిణులు, యువతులు, మహిళలు.. వేధింపులు, సమస్యలతో పోలీస్ స్టేషన్లకు వెళ్తుంటారు. అయితే మహిళా కానిస్టేబుళ్లు, అధికారులు ఉంటేనే వారితో సమస్య చెప్పుకునేందుకు, కేసుల వ్యవహారంపై చర్చించుకునేందుకు బాధిత మహిళలకు సులభంగా ఉంటుంది. ఇలా కాకుండా సాధారణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మహిళలు తమ సమస్య చెప్పుకోవడం ఎలా సాధ్యమవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్‌కు, నూతన జిల్లాల్లో మహిళా పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు లింకు పెట్టడంపై పోలీస్ శాఖలో తీవ్రమైన అభ్యంతరం వ్యక్తమవుతోంది. పోలీస్ ఫోర్స్‌లో 3.13 శాతమే ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ శాఖలో కేవలం 1,484 మంది మహిళా సిబ్బంది మాత్రమే ఉన్నారు. అంటే మొత్తం పోలీస్ ఫోర్స్‌లో 3.13 శాతం మాత్రమే. ఇందులో కూడా కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుళ్లే ఎక్కువగా ఉన్నారు. అధికారుల విషయానికొస్తే 17 మంది మహిళా ఇన్స్పెక్టర్లు, 34 మంది ఎస్ఐలు, 58 మంది ఏఎస్ఐలు ఉన్నారు. పాత జిల్లాల పరిధిలోని 14 మహిళా పోలీస్ స్టేషన్లను ఒకసారి పరిశీలిస్తే.. హైదరాబాద్ కమిషనరేట్‌లో మినహా మిగతా ప్రాంతాల్లో మహిళా అధికారులకు మహిళా పోలీస్ స్టేషన్లలో ఎస్‌హెచ్‌ఓలుగా పోస్టింగ్స్ ఇవ్వలేదు. కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్‌లోని హన్మకొండలో పురుషులనే ఎస్‌హెచ్‌ఓలుగా నియమించారు. సైబరాబాద్, సంగారెడ్డి మహిళా పోలీస్స్టేషన్లకు ఇన్స్పెక్టర్ అంటూ లేరు. మహిళల కేసుల పరిష్కారం..? మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయని పక్షంలో శాంతి భద్రతల పోలీస్ స్టేషన్ అధికారి నేతృత్వంలోనే మహిళా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తారు. అయితే బందోబస్తులు, నేరాల నియంత్రణ, ఇతరత్రా వ్యవహారాలతోనే సంబంధిత స్టేషన్ హౌస్ అధికారి బిజీగా ఉంటారు. మరి మహిళల సంబంధిత కేసులను ఎప్పుడు పర్యవేక్షిస్తారు, పరిశీలిస్తారనే దానిపై ఉన్నతాధికారులు నోరు మెదపడం లేదు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ నేతృత్వంలో షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. వీటి పర్యవేక్షణ బాధ్యత మహిళా పోలీస్ స్టేషన్లకు అప్పగిస్తే ప్రత్యేకమైన విభాగం ఎప్పుడూ మహిళల రక్షణ, బాధ్యతపైనే పని చేస్తుందన్న వాదనను పట్టించుకోకపోవడం గమనార్హం. హెల్ప్ డెస్క్‌తో సరి..? మహిళా పోలీస్ స్టేషన్లో ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారితోపాటు మరో ఇద్దరు ఎస్ఐలు, నలుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, పది మంది వరకు కానిస్టేబుళ్లు ఉంటారు. రిజర్వేషన్ పెంపుతో నూతన పోలీస్ స్టేషన్లు ఏర్పాటైతే వారిని ఎస్‌హెచ్‌ఓలుగా నియమిం చవచ్చు. అలా కాదని కొత్త జిల్లాల్లో మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయకుండా, శాంతి భద్రతల కోసం పోలీస్ స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆ ప్రకారం హెల్ప్ డెస్కుల్లో కేవలం కానిస్టేబుల్/హెడ్‌కానిస్టేబుల్ ర్యాంకు సిబ్బందిని కూర్చోబెట్టాలని యోచిస్తున్నారు. మహిళా ఎస్ఐలు, ఏఎస్ఐలు ఉండరు. 33% రిజర్వేషన్ అమలు నేపథ్యంలో అవసరం లేదని వెల్లడి -
శత దిన సంరంభం!
సంపాదకీయం: అయిదేళ్ల కాలానికి ఎన్నికై గద్దెనెక్కిన ప్రభుత్వం గురించి వంద రోజులకే మదింపు వేయడం న్యాయమూ కాదు... అదంత సులభమూ కాదు. కేవలం మూడునెలల పదిరోజుల వ్యవధిలోనే ఏ ప్రభుత్వమైనా ఏదైనా సాధించగలదనుకోవడం అత్యాశే. అయితే, ఈ వంద రోజుల్లోనూ ఆ ప్రభుత్వం నడక, నడత ఎలా ఉన్నాయి... అది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నది, దాని నిర్వహణ ఎలా సాగుతున్నదనే అంశాలనుబట్టి ఆ ప్రభుత్వ పోకడల గురించి ఒక అభిప్రాయానికి రావొచ్చు. అది ఆశాజనకంగా కనబడుతున్నదా... పాత వాసనలతో, పాత బాణీలో కొట్టుకుపోతున్నదా అనే అంశాలు స్థూలంగా తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకొచ్చిందోగానీ ‘వంద’కు మన సంప్రదాయంలో ఎనలేని ప్రాముఖ్యం ఉన్నది. దీవించేటపుడు ‘శతమానం భవతి...’ అనడం మన దగ్గర సర్వసాధారణం. గతంలో సినిమాలకు శత దినోత్సవాలుండేవి. 2009 నాటి ఎన్నికల్లో అప్పటి యూపీఏ సర్కారు ఈ ‘వంద’కు తెగ ప్రచారం చేసిపెట్టింది. వందరోజుల్లో ఇవి చేస్తాం...అవి చేస్తామంటూ జనాన్ని ఊరించింది. అందులో మహిళా రిజర్వేషన్లు మొదలుకొని స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనం తీసుకురావడం వరకూ ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత మరికొన్ని వందల రోజులు గడిచినా అందులో ఏ ఒక్కటీ సాధించలేక ఆ సర్కారు చతికిలబడింది. ముందు జాగ్రత్తనో ఏమోగానీ బీజేపీ ఎక్కడా వందరోజుల లక్ష్యం గురించి హోరెత్తించలేదు. ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేసే రోజున సార్క్ దేశాల అధినేతలంతా హాజరుకావడం...సరిగ్గా వందరోజుల పాలనను పూర్తిచేసుకున్న సందర్భంలో ఆయన జపాన్ పర్యటనలో ఉండటం యాదృచ్ఛికం కాదు. ఆయన కావాలని నిర్ణయించుకున్న సందర్భాలవి. జపాన్ పర్యటనకు ముందు ఆయన ప్రత్యేకించి ఎంచుకుని ఇరుగు పొరుగు దేశాలైన భూటాన్, నేపాల్ వెళ్లడం...మధ్యలో బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ దేశాధినేతల సదస్సుకు హాజరై ఎన్నాళ్లనుంచో ప్రతిపాదన రూపంలోనే ఉండిపోయిన బ్రిక్స్ బ్యాంకును సాకారం చేయడంలో కీలకపాత్ర పోషించడం గమనిస్తే ప్రపంచ దేశాల్లో... ముఖ్యంగా ఇరుగుపొరుగులో మన పలుకుబడీ, ప్రతిష్టా పెరగడానికి మోడీ ప్రత్యేక శ్రద్ధవహించడాన్ని గుర్తించగలుగుతాము. ప్రమాణ స్వీకారం సమయంలో పాకిస్థాన్‌కు స్నేహహస్తం చాచినా, మన అభీష్టానికి భిన్నంగా కాశ్మీర్ వేర్పాటువాదులతో ఆ దేశ హైకమిషనర్ సమావేశం కావడాన్ని నిరసిస్తూ ఇరుదేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలకు ఆయన నిర్మొహమాటంగా తలుపులు మూశారు. ఈ వంద రోజుల్లోనూ ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని అత్యంత కీలకమైనవి. రక్షణ, రైల్వే రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డీఐ)లను అనుమతించడం, న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి ఇప్పుడున్న కొలీజియం వ్యవస్థకు మంగళం పాడటం, బీమా రంగంలో 49 శాతం ఎఫ్‌డీఐలకు వీలుకల్పిస్తూ బిల్లు రూపొందించడం, నల్లధనంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు, జన్‌ధన్ యోజన పథకాన్ని ప్రారంభించిన రోజే బ్యాంకుల్లో కోటిన్నర ఖాతాలు ప్రారంభమయ్యేలా చూడటం, కాంగ్రెస్ గవర్నర్లను వదుల్చుకోవడం అందులో ప్రధానమైనవి. ‘ప్రధాని అంటే తొలి ప్రజా సేవకుడ’న్న జవహర్లాల్ నెహ్రూ మాటను స్వీకరించినా, ఆయన మానసపుత్రిక ప్రణాళికా సంఘానికి వీడ్కోలు పలకాలని నిర్ణయించడం కూడా అత్యంత ముఖ్యమైనది. ఈ వందరోజుల్లో నిజమో, కాదో తెలియని కొన్ని వదంతులు కూడా మోడీపై బాగా ప్రచారంలోకొచ్చాయి. ఒక కేంద్ర కేబినెట్ మంత్రి ప్రముఖ పారిశ్రామికవేత్త ఇంటికి భోజనానికి వెళ్లగా ‘ఇలాంటివి సరి కాద’ంటూ ఆయన సెల్‌కు సందేశం వెళ్లడం, అత్యవసర పనుందంటూ ఆయన కాస్తా వెనుదిరగడం అందులో ఒకటి. మరో కేంద్రమంత్రి గౌహతి విమానాశ్రయంలో దిగిన కొద్దిసేపటికే ‘ప్రధాని కార్యాలయానికి వర్తమానం లేకుండా ఇకపై ఇలా చేయొద్ద’ంటూ తాఖీదు...కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ కార్యాలయంలో బగ్గింగ్ పరికరాలు బయటపడటం, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆయన కుమారుణ్ణి పిలిచి ఒక అంశంలో మందలించడం వంటివి మరికొన్ని వదంతులు. వీటికి రుజువులూ, సాక్ష్యాలూ లేవు. కానీ, మంత్రులస్థాయి వ్యక్తులపై కూడా నిఘా ఉన్నదన్న అభిప్రాయాన్ని ఈ వదంతులన్నీ కలగజేశాయి. వీటి సంగతలా ఉంచి పీఎంఓలో మోడీ వచ్చే సమయానికే సిబ్బందంతా పనిపట్ల భయభక్తులతో హాజరవుతుండటం మాత్రం వాస్తవం. జీడీపీ వృద్ధి రేటు మెరుగుపడి 5.7 శాతానికి చేరుకోవడం రెండున్నరేళ్ల తర్వాత ఈ త్రైమాసికంలో మాత్రమే సాధ్యపడింది. పారిశ్రామిక ఉత్పాదకత విషయంలోనూ ఈ ధోరణే కనబడింది. అయితే ద్రవ్యోల్బణం ఇంకా లొంగి రాలేదు. నిత్యావసరాలు, కూరగాయల ధరలకు కళ్లెం పడలేదు. ప్రధాని అయినా, కేంద్రమంత్రులైనా పత్రికా ప్రకటనలు జారీచేయడం... పత్రికలనూ, చానళ్లనూ కాదని ట్విటర్, ఫేస్బుక్, ఎస్సెమ్మెస్వంటి ఇతరేతర మాధ్యమాలను ఎంచుకోవడం కొత్త పోకడ. ఈ వంద రోజుల్లోనూ ప్రత్యర్థి కాంగ్రెస్ మాటేమోగానీ... పరస్పరం బద్ధ శత్రువులైన జేడీ(యూ), ఆర్జేడీవంటి పార్టీలు మోడీ భయానికి దగ్గరయ్యాయి. సీపీఎంతో కలవడానికి సిద్ధమేనని బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత మమతా బెనర్జీ ప్రకటించారు. ఏదేమైనా జనం మార్పును కోరుకుని బీజేపీని గెలిపించారు. ఈ వందరోజుల్లోనూ ఆ మార్పులు కొట్టొచ్చినట్టు కనబడుతూనే ఉన్నాయి. ఈ సర్కారు పనితీరుపై భిన్నాభిప్రాయాలు ఎన్నయినా ఉండొచ్చుగానీ... దీనికి చలనశీలత దండిగా ఉన్నదని అందరూ అంగీకరిస్తారు. అది రాగల రోజుల్లో సుఫలాలను అందించే దిశగా సాగాలని ఆశిస్తారు.