ఉడ్ వరల్డ్ లో అగ్నిప్రమాదం
వనస్థలిపురం: వనస్థలిపురంలో హైవే పక్కన ఉన్న ఉడ్వరల్డ్ ఫర్నిచర్ దుకాణంలో శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా లోపలి నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. నిర్వాహకుల సమాచారంతో ఫైరింజన్ అక్కడికి చేరుకుంది. దట్టమైన మంటలు, పొగ కారణంగా మంటలు వెంటనే అదుపులోకి రాలేదు. దీంతో ఫైర్ సిబ్బంది వెలుపలి నుంచే మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.