worst flood
-
‘నెలంతా కురవాల్సిన వర్షం నిన్న ఒక్కరోజే కురవడంతో 30 వేల మంది నిరాశ్రయులయ్యారు'
More than 30,000 people were evacuated from their homes in Malaysia మలేషియా: దేశంలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఆదివారం కురిసిన వర్షపాతానికి సుమారు 30 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. శుక్రవారం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. ప్రధాన రహదారులు తెగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా మలేషియాలో ఆదివారం వరదలు ముంచెత్తడంతో 30,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు. మలేషియా దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలకు చెందిన 30 వేలకు పైగా వరద బాధితులను అధికారికంగా లెక్కించింది. వారిలో 14 వేల మంది పహంగ్‌కు చెందినవారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో అత్యంత రిచెస్ట్ ప్రాంతమైన సెలంగోర్‌లో దాదాపు 10,000 మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోయారని ఆ దేశ ప్రధాని ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్ మీడియాకు తెలిపారు. ఒక నెలమొత్తంలో కురవాల్సిన వర్షం ఆదివారం ఒక్కరోజే కురిసిందని, వరద బాధితులకు సత్వర సహాయం నిమిత్తం 179 కోట్ల నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం నాడు 6 సెంట్రల్, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రమాదకరస్థాయిలో వరదనీళ్లు చేరాయని ఆయన అన్నారు. డజన్ల కొద్ది బస్సు రోడ్లతోపాటు, రైలు సర్వీసులు కూడా నిలిపివేయబడ్డాయని మీడియాకు తెలిపారు. ప్రతి ఏడాది చివరిలో దేశంలోకి ప్రవేశించే తుపానులతో కూడిన రుతుపవనాల కారణంగా తరచూ అధిక వర్షపాతం నమోదవుతుంటుంది. ఈ డిసెంబర్లో ప్రమాదకర స్థాయిలో వరదలు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా 2014లో మలేషియాలో అత్యంత దారుణమైన వరదలు సంభవించాయి. నాటి వరదల కారణంగా దాదాపు 1,18,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. చదవండి: మళ్లీ లాక్డౌన్! నేటి నుంచి జనవరి 14 వరకు కఠిన ఆంక్షలతో.. -
చేతనైనంత సాయం చేద్దాం!
న్యూఢిల్లీ: వరదల కారణంగా సర్వస్వాన్ని కోల్పోయిన కాశ్మీరీల కోసం బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విరాళాల సేకరణ ప్రారంభించాడు. స్వచ్ఛంద సంస్థ కేర్ ఇండియాతో కలిసి కాశ్మీర్ ప్రజలను ఆదుకోవాలంటూ ప్రచారం కూడా చేస్తున్నాడు. ఆర్థిక సాయం చేయాలనుకేవారి కోసం కేర్ ఇండియాకు సంబంధించిన ఓ వెబ్సైట్ లింక్‌ను కూడా ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘హాయ్.. నేను మీ కునాల్ కపూర్‌ను..! కాశ్మీర్ వరదల గురించి మీడియా ద్వారా తెలుసుకున్నాను. అక్కడి భీకర పరిస్థితిని మీడియా కళ్లకుగట్టినట్లు చూపించింది. ఇప్పటిదాకా 215 మంది మరణించారట. వేలాదిమంది సర్వస్వాన్ని కోల్పోయారట. ఈ దృశ్యాలు నన్ను ఎంతగానో కదిలించాయి. అందుకే కాశ్మీరీల కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను. అక్కడి ప్రజలు కూడా మనలాంటివారే. అందుకే అందరినీ అభ్యర్థిస్తున్నాను. నాతో చేతులు కలపండి. కాశ్మీరీల సహాయం కోసం విరాళాలు సేకరిద్దాం. దేశ ప్రజలుగా వారికి మనమందరం ఉన్నామనే భరోసా కల్పిద్దాం. అందుకోసం చేతనైనంత సాయం చేద్దాం. ఈ సందేశంతోనే నేను మీకో వెబ్సైట్ లింక్‌ను పంపుతున్నాను. దీనిద్వారా మీరు విరాళాలను అందజేయవచ్చు. కేర్ ఇండియా సంస్థ ఈ విరాళాలతో కాశ్మీర్ ప్రజల కోసం అవసరమై సామగ్రిని కొనుగోలు చేసి, పంపుతుంది. పాలిథిన్ కవర్లు, మ్యాట్స్, సబ్సు, టూత్ బ్రష్ వంటివేకాకుండా దుప్పట్లు వంటివి పంపుతారు. రూ. 5000 విలువజేసే వంద కిట్లను పంపుతారు. కనీసం వంద కుటుంబాలకైనా మనం సాయం చేసినవారమవుతాం. వరదల్లో చిక్కుకున్న 76,500 మందిని సహాయ శిబిరాలకు చేర్చారు. వారిలో ఎంతమందికి అన్ని సదుపాయాలు అందుతున్నాయో చెప్పలేం. మనలాంటివారు చేసే సాయం కూడా ప్రభుత్వ సాయానికి తోడైతే బాధితుల్లో మనమంతా ఉన్నామనే భరోసా పెరుగుతుంద’ని కునాల్ తన ట్విటర్ సందేశంలో పేర్కొన్నాడు.