జంగుబాయి (ఫైల్)
ఆదిలాబాద్: జ్వరంతో ఆదిలాబాద్ రూరల్ మండలం టెకిడిగూడ గ్రామానికి చెందిన బీర్షావ్–సూర్యకళ దంపతుల కుమార్తె రాయిసిడాం జంగుబాయి (14) మృతి చెందింది. వివరాలు.. జంగుబాయి మండలంలోని మామిడిగూడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. మూడు రోజుల కిందట ఆమెకు జ్వరం రాగా కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి జంగుబాయి శుక్రవారం మృతి చెందింది. కాగా, పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తమ కూతురు మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
యాజమాన్యంపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై పాఠశాల హెచ్‌ఎం అశోక్‌ను వివరణ కోరగా.. జ్వరంతో బాధపడుతున్న జంగుబాయికి స్థానికంగా చికిత్స చేయిస్తున్నామని, ఆమె తల్లిదండ్రులే వినిపించుకోకుండా ఇంటికి తీసుకువెళ్లారని తెలిపారు. కాగా, వార్డెన్, హెచ్‌ఎం నిర్లక్ష్యంతోనే బాలిక మృతి చెందిందని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) జిల్లా అధ్యక్షుడు గోడం గణేశ్ ఆరోపించారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment