అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న కమిషనర్
● సమయపాలన పాటించాలని కమిషనర్ ఆదేశం
కై లాస్‌నగర్: మున్సిపల్ అధికారులు సమయపాల న పాటించకుంటే చర్యలు తప్పవని కమిషనర్ ఏ.శైలజ అన్నారు. ‘అస్త్తవ్యస్తంగా బల్దియా పాలన’శీర్షికన సాక్షిలో గురువారం ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. అన్ని విభాగాల అఽధికారులు, కీలకమైన కార్యాలయ ఉద్యోగులతో తన చాంబర్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమయపాలన పాటించకపోవడంపై తీవ్రంగా పరిగణించిన ఆమె పలు విభాగాల అధికారులకు మెమోలు జారీచేశారు. ప్రతి విభాగం అధికారి ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయంలో అందుబాటులో ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీఈ తిరుపతి, ఏఈ అరుణ్ కుమార్, రెవెన్యూ అధికారి జాదవ్ కృష్ణ, టీపీఓ అనురాధ, టీపీఎస్ సాయికుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఎఫెక్ట్
Comments
Please login to add a commentAdd a comment