బాధ్యతల స్వీకరణ
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ ప్రత్యేకాధికారిగా జిల్లా స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా బాధ్యతలు చేపట్టారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర ఏర్పాట్లలో బీజీగా ఉన్నందున మున్సిపల్ కార్యాలయంలో కాకుండా ఉట్నూర్‌లోని ప్రాజెక్ట్ అధికారి కార్యాలయంలోనే ఈ బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 26న మున్సిపల్ కౌన్సిల్ పాలకవర్గ గడువు ముగియడంతో ప్రభుత్వం ఆమెను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. జాతర అనంతరం ఆమె మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి పాలన వ్యవహారాలపై అధికారులతో సమీక్షించే అవకాశమున్నట్లు అధికారులు వెల్లడించారు.
31న విద్యాసంస్థలకు సెలవు
కై లాస్‌నగర్: ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నిర్వహించే నాగోబా జాతర సందర్భంగా ఈ నెల 31న జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల విద్యాసంస్థలకు కలెక్టర్ రాజర్షి షా సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. 31న ప్రకటించిన సెలవుకు బదులు మార్చి 8న విద్యాసంస్థలు యథావిధిగా పనిచేస్తాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment