స్పౌజ్ బదిలీలు నిబంధనల ప్రకారమే చేపట్టాం. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉన్నవి, స్పౌజ్‌కు సమీపంలో ఉన్న పాఠశాలలను కేటాయించాం. విద్యార్థుల సంఖ్యకు ఎక్కువగా ఉన్న ఉపాధ్యాయులను అవసరం ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేస్తాం.
– ప్రణీత, డీఈవో
అవసరం ఉన్న పాఠశాలలకు కేటాయించాలి
ఇటీవల జరిగిన స్పౌజ్ బదిలీల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉన్న పాఠశాలలకు టీచర్ల కేటాయింపు జరగలేదు. దీంతో విద్యార్థులకు నష్టం వాటిల్లుతుంది. ఇది కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ప్రయోజనం చేకూరింది. దీంతో విద్యా వ్యవస్థ నాశనం అవుతుంది. ఇటీవల జరిగిన బదిలీ, పదోన్నతులు, డీఎస్సీలో పోస్టులకు అనుగుణంగా ఖాళీలు చూపించారు. ఈ స్పౌజ్ బదిలీల్లో 37 మంది కోసం 140 ఖాళీలను చూపించడంతో వారికి నచ్చిన చోట ఉపాధ్యాయులు పోస్టింగ్ తీసుకున్నారు. – శ్రీకాంత్, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
కుమ్మకై ్క పోస్టింగ్ ఇచ్చారు
ఇటీవల జరిగిన స్పౌజ్ బదిలీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. అధికారులు, ఉద్యోగులతో కుమ్మకై ్క వారికి నచ్చిన స్థానాలను ఎంపిక చేసుకున్నారు. వీరి కక్కుర్తి వల్ల విద్యార్థులకు నష్టం వాటిల్లుతుంది. అక్రమ బదిలీలను రద్దు చేసి ఎక్కడైతే ఉపాధ్యాయ పోస్టులు అవసరం ఉన్నాయో ఆ స్పౌజ్ ఉన్న మండలంలో కేటాయించాలి. అక్కడ పోస్టు లేకపోతే పక్క మండలంలో పోస్టింగ్ కల్పించాలి.
– గడుగు నరేందర్, ఎస్జీటీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment