చిన్నారులు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలి
● జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారధి
ఆదిలాబాద్: చిన్నారులను ఆసక్తి ఉన్న క్రీడల్లో తల్లిదండ్రులు ప్రోత్సహించాలని జిల్లా గిరిజన క్రీడల అధికారి కోరెడ్డి పార్థసారధి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఎస్జీఎఫ్ అండర్ 14, 17 బాలబాలికల తైక్వాండో జిల్లాస్థాయి ఎంపిక పోటీలను బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తైక్వాండో క్రీడ ఆత్మరక్షణ కోసం ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ క్రీడలో రాణిస్తున్న క్రీడాకారులకు విద్య, ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నారు. కోచ్ వీరేశ్ మాట్లాడుతూ జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 14న మంచిర్యాలలో జరిగే జోనల్‌స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అక్కడ విజేతలుగా నిలిచిన వారు జోగులాంబ గద్వాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ప్రా తినిధ్యం వహిస్తారన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ వెటర్నరీ అధికారి కస్తాల అన్నారావు, శివన్న, వనిత రాథోడ్, వంశీ, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment