14 నుంచి ‘ఆరోగ్య పాఠశాల’
ఆదిలాబాద్‌టౌన్: ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రాజ ర్షిషా అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆడిటోరియంలో ఆరోగ్య పాఠశాల– ఆరోగ్య కళాశాల కార్యక్రమానికి సంబంధించిన సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని ఈనెల 14న ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వారంలో ఆరు రో జుల పాటు రోజుకో కార్యమం నిర్వహించాలని ఆదేశించారు. ప్రార్థన సమయంలో విద్యార్థులకు ఆరోగ్య విషయాలు తెలియజేయాలని సూచించారు. సోమవారం వ్యక్తిగత పరిశుభ్రత దినో త్సవం, మంగళవారం న్యూట్రీషన్ డే, బుధవా రం ఒత్తిడి నిర్వహణ దినోత్సవం, గురువారం డ్రగ్ రహిత దినోత్సవం, శుక్రవారం కాలానుగునత వ్యాధులు– నివారణ దినోత్సవం, శనివారం వ్యక్తిగత వికాస దినోత్సవాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం నాలుగు వారాలకు సంబంధించిన మాడ్యుల్ తయారు చేసి అన్ని పాఠశాలలకు అందించినట్లు తెలిపారు. ఇప్పటికే ఉ పాధ్యాయులు, నోడల్ టీచర్లకు శిక్షణకూడా ఇచ్చి నట్లు పేర్కొన్నారు. కళాశాలల్లో కూడా ప్రతిరోజు వీటి గురించి తెలియజేయాలని, పాఠశాలల మా దిరిగానే ప్రార్థన నిర్వహించాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో డీఈవో పరిధి లోని పాఠశాలలు, కేజీబీవీలు, కళాశాలల్లో అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బాలల దినోత్సవం రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, డీఈవో ప్రణీత, జిల్లా సంక్షేమ అధికారి సబిత, మలేరి యా నివారణ అధికారి శ్రీధర్, డీఐవో వైసీ శ్రీని వాస్, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
కలెక్టర్ రాజర్షిషా
Comments
Please login to add a commentAdd a comment