ముగిసిన ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ఇంటింటి సర్వే
● డాటా ఎంట్రీపై జిల్లా కలెక్టర్ సమీక్ష
కై లాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్ట్ సర్వే జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్రూరల్ మండలంలోని లోహారా, గుడిహత్నూర్ మండలంలోని గోండు హార్కాపూర్, ఇచ్చోడ మండలంలోని ఆడేగాం –బి, ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని రాంనగర్ కాలనీలో అధికారులు సర్వే చేపట్టారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు ఆయా గ్రామాలు, కాలనీలోని ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం సంబంధిత అధికారులతో తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సర్వే తీరుతో పాటు సేకరించిన వివరాలపై ఆరా తీశారు. వివరాలను ఆన్లైన్లో పొరపాట్లకు తావివ్వకుండా నమోదు చేయాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ శ్యామలా దేవి, జెడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, ఈడీఎం బండి రవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment