రేషన్.. ఆలస్యమేనా!
● ఇంకా జిల్లాకు చేరని పీడీఎస్ బియ్యం ● ఖాళీగా ఎంఎల్ఎస్ పాయింట్లు ● ‘చౌక’ దుకాణాలకు చేరేందుకు మరింత సమయం ● డిసెంబర్ కోటా పంపిణీ ఆలస్యమయ్యే అవకాశం
కై లాస్‌నగర్: ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆహారభద్రత కార్డుదారులకు ప్రతి నెలా ఉచితంగా సరఫరా చేసే బియ్యం ఇంకా జిల్లాకు చేరలేదు. దీంతో జిల్లాలోని ఐదు మండల్ లెవల్ స్టాక్ (ఎంఎ ల్‌ఎస్) పాయింట్లు ఖాళీగా దర్శనమిస్తున్నా యి. రెండు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు డీలర్లు చెబుతున్నారు. జిల్లాకు అవసరమైన కో టా బియ్యం నిజామాబాద్, జిగిత్యాల, వరంగల్ జిల్లాల నుంచి వస్తుంటాయి. రాష్ట్ర పౌరసరఫరా ల శాఖ కేటాయించిన జిల్లా నుంచి బియ్యంను అధికారులు తెప్పిస్తుంటారు. డిసెంబర్‌కు అవసరమైన కోటాను జిగిత్యాల జిల్లాకు కేటాయించగా అక్కడి నుంచి బియ్యం దిగుమతి కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు బియ్యం ఎంఎల్ఎస్ పాయింట్లకు ఇంకా చేరలేదు. దీంతో రేషన్ డీలర్లు ఖాళీగా ఉన్న గోదాంలను చూసి వెనుదిరుగుతున్నారు.ఈ క్రమంలో వచ్చే నెల కోటా పంపిణీ ఆలస్యమయ్యేఅవకాశం కనిపిస్తోంది.
ఖాళీగా ఎంఎల్ఎస్ పాయింట్లు
జిల్లాలో ఆదిలాబాద్‌తో పాటు బోథ్, ఇచ్చోడ, ఉట్నూర్, జైనథ్ మండల కేంద్రాల్లో ఐదు ఎంఎల్ఎస్ పాయింట్లు ఉన్నాయి. జిల్లాకు అవసరమైన పీడీఎస్ బియ్యం జిగిత్యాల నుంచి లారీల్లో ఇక్కడికి చేరుకోవాలి. ఇక్కడి నుంచి వాటి పరిధిలోని దుకాణాలకు లారీలు, ట్రాక్టర్ల ద్వారా కేటాయింపులకనుగుణంగా సరఫరా చేస్తుంటా రు. మండల కేంద్రాలు, గ్రామాల్లోని చౌక దుకా ణాలకు ప్రతీ నెల 20 నుంచి 23వరకు, జిల్లా కేంద్రంలోని షాపులకు 25వ తేదీ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జీలు బియ్యం పంపించేవారు. అయితే ఇప్పటి వరకు ఇంకా ఎంఎల్ఎస్ పా యింట్లకే చేరలేదు. ఆయా పాయింట్లలో ప్రస్తు తం ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలకు అందించే సన్నబియ్యం నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ నెలాఖరు వరకు కార్డుదారులకు అవసరమైన బియ్యం చేరుతాయని అధికారులు చెబుతున్నప్పటికీ అది అనుమానంగానే కనిపిస్తోంది. అన్ని జిల్లాలకు యూనిఫాం పద్ధతిలో పంపిణీ చేస్తుండటం, సీఎంఆర్ పూర్తిసాయిలో మిల్లర్లు ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లుగా సంబంధితాధికారులు చెబుతున్నారు.
జిల్లాలో..
చౌక ధరల దుకాణాలు: 356
రేషన్ కార్డులు : 1,91,620
యూనిట్లు : 6,36,631
అవసరమైన బియ్యం కోటా : 4,057
మెట్రిక్ టన్నులు
వరి ధాన్యం కొనుగోళ్లతోనే..
జిల్లాకు అవసరమైన బియ్యంను జగిత్యాల జిల్లాకు కేటాయించారు. ప్రస్తుతం వరిధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నందున బియ్యం సరఫరా చేసే లారీలన్నీ వాటికే కేటాయిస్తున్నారు. కొంత ఆలస్యమైనప్పటికి ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయిలో బియ్యంను తెప్పించేలా శ్రద్ధ వహిస్తాం. కార్డుదారులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైతే పంపిణీ గడువు కూడా పొడిగిస్తాం. – సుధారాణి,
పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment