పోడు సాగుకు యత్నించిన వారిపై కేసు
వేమనపల్లి: నీల్వాయి కొత్తగూడం శివారులోనిరిజర్వు ఫారెస్ట్‌లో పోడు సాగు కోసం యత్నిస్తున్న ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు నీల్వాయి అటవీ రేంజ్ అధికారి అప్పలకొండ తెలిపారు. కొత్తగూడంకు చెందిన జంబి భీమయ్య, భారత రామయ్య, ఓల దుర్గయ్య, చింతల లక్ష్మయ్య, కత్తెర్ల సమ్మయ్య, మానేపల్లి మల్లేశ్, జంపం మధుకర్ అడవిని ఆనుకుని ఉన్న రిజర్వు ఫారెస్ట్ భూమిలో తంగేడు, తునికి పొదలను నరికేస్తుండగా డెప్యూటీ రేంజ్ అధికారి ప్రమోద్‌కుమార్, ఎఫ్‌బీవో మహిపాల్, బేస్ క్యాంపు సిబ్బంది అడ్డుకున్నారు. ఎఫ్‌ఆర్‌వో అప్పలకొండ ఘటన స్థలానికి వెళ్లి గిరిజనులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అడవిలోకి ప్రవేశించడం, చెట్లను నరకడం, పోడుకు యత్నించడం, వన్యప్రాణులను వేటాడటం చట్టరీత్యా
నేరమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment