మొక్కుబడిగా ‘ప్రజావాణి’
● ఆలస్యంగా ప్రారంభం
● పలుశాఖల అధికారులు గైర్హాజరు
● అర్జీలు స్వీకరించిన ట్రెయినీ కలెక్టర్
కై లాస్‌నగర్: కలెక్టర్ సెలవులో ఉండటం, అదనపు కలెక్టర్ గైర్హాజరుతో సోమవారం నిర్వహించిన ప్ర జావాణి కార్యక్రమం మొక్కుబడిగా సాగింది.గంట న్నర ఆలస్యంగా 11.30గంటలకు ప్రారంభమైంది. పలువురు జిల్లాస్థాయి అధికారులు గైర్హాజరు కాగా మరికొంతమంది ఇలా వచ్చి అలా వెళ్లారు. అర్జీదా రులు కూడా ఎక్కువగా రావడంతో సమావేశ మందిరం బోసిపోయింది. ట్రెయినీ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వీయా అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 63 అర్జీలు అందినట్లు అధికారులు వెల్లడించారు. ఆర్డీవో వినోద్‌కుమార్, జెడ్పీసీఈవో జితేందర్‌రెడ్డి, డీఆర్డీవో సాయన్న తదితరులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన..
ఉపాధి కల్పించండి
నేను దివ్యాంగురాలైన అనాథను. నాకు వచ్చే రూ.4వేల పింఛనే జీవనాధారం. సొంత ఇల్లు లేదు. అద్దె ఇంటిలో ఉంటున్నా. వచ్చే పెన్షన్‌లో రూ.2500 అద్దెకే పోతుంది. నాపై దయచూపి ఏదైన కాంట్రాక్ట్ ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పొందేలా రుణం మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నా.
– గడ్డం భీంబాయి, ఉట్నూర్
Comments
Please login to add a commentAdd a comment