రిమ్స్‌లో అరుదైన శస్త్ర చికిత్స
ఆదిలాబాద్‌టౌన్: కిడ్నీ స్టోన్‌తో బాధపడుతున్న 15 నెలల చిన్నారికి అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో అరుదైన శస్త్ర చికిత్స చేసినట్లు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. సోమవారం రిమ్స్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనగామకు చెందిన రజిత కూతురు శృతి కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడుతుండగా యూరాలజీ ప్రత్యేక వైద్య నిపుణులు కార్తీక్ ఆధ్వర్యంలో అనస్తీషియా వైద్య సిబ్బంది ఎలాంటి కోతలు లేకుండా అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో స్టోన్ తీసివేసినట్లు తెలిపారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశామన్నారు. శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించిన వైద్య సిబ్బందిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment