No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Fri, May 10 2024 7:10 PM

No Headline

అరకులోయ రూరల్‌: పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సిబ్బందిని తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అరకు అసెంబ్లీ రిటర్నింగ్‌ అధికారి అభిషేక్‌ తెలిపారు. గురువారం ఆయన స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో ఎన్నికల సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసెండింగ్‌ అధికారులు, ఇతర సిబ్బంది సకాలంలో సంబంధిత పోలింగ్‌ కేంద్రాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సెక్టోరల్‌ అధికారులను ఆయన ఆదేశించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలను 54 సెక్టార్లుగా విభజించామని తెలిపారు. రెండు మండలాలకు ఒకటి చొప్పున పాయింట్‌ ఏర్పాటుచేసి ఈవీఎంలను పంపిణీ చేస్తామన్నారు. సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సెక్టోరల్‌ అధికారులు ప్రత్యకంగా పర్యవేక్షించాలని సూచించారు. ఉదయం ఐదు గంటలకు మాక్‌ పోలింగ్‌ నిర్వహించాలని, ఆ తరువాత 7గంటలకు పోలింగ్‌ ఎన్నికల పక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతీ రెండు గంటలకు ఒకసారి పోలింగ్‌ శాతాన్ని జిల్లా ఎన్నికల అధికారికి తెలియజేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్‌డీసీవీ ఎస్‌. శర్మ, తహసీల్దార్లు సోమేశ్వరావు, సుధాకర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement