No Headline
సీలేరు: పర్యాటక అభివృద్ధిలో భాగంగా సీలేరులో శ్రీశైలం తరహాలో సీ–ప్లేన్(నీటిపై తేలియాడే విమానం) ప్రయాణాన్ని అందుబాటులో తీసుకువచ్చేందుకు సర్వే మొదలయ్యింది. ఇందుకు జిల్లాలోని సీలేరు (గుంటవాడ రిజర్వాయర్) అనుకూలమా? కాదా? అన్న అంశంపై కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం గూడెంకొత్తవీధి తహసీల్దార్ టి.రామకృష్ణ, ఇరిగేషన్ బృందం మారెమ్మతల్లి ఆలయ స్నానాల ఘాట్ వద్ద పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ 2017లోనే ఈ రిజర్వాయర్‌లో సీ–ప్లేన్ టేకాఫ్, ల్యాండింగ్ అనుకూలతను అధికారులు గుర్తించారన్నారు. టేకాఫ్, ల్యాండింగ్‌కు 300 మీటర్ల మట్టిరోడ్డు, ఫ్లోటింగ్ జెట్టీ సరిపోతుందన్నారు. సీ–ప్లేన్ ప్రయాణానికి సీలేరు అనుకూలమని కలెక్టరుకు నివేదిక ఇస్తున్నట్లు తెలిపారు. జోలాపూట్‌లో కూడా ఈ తరహా ప్రయాణానికి సిబ్బందితో సర్వే నిర్వహిస్తున్నామన్నారు. సీలేరులో సీ–ప్లేన్ సర్వీసులు ప్రారంభమైతే సీలేరు నుంచి వైజాగ్ మధ్య ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment