కలెక్టర్ దినేష్‌కుమార్ హెచ్చరిక
పాడేరు : ఫీజులు చెల్లించలేదని ప్రయివేటు విద్యా సంస్థలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే సంబంధిత యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజులను రియంబర్స్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. త్వరలోనే ఫీజులు విడుదల అవుతాయన్నారు. ఫీజులు చెల్లించలేదన్న కారణంతో యాజమాన్యాలు విద్యార్థులను కళాశాలలకు అనుమతించకపోవడం, హాల్ టికెట్లు జారీ చేయకపోవడం, పరీక్షల రానీయకపో వడం వంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నా రు. ప్రతి విద్యార్థి పరీక్ష రాసేలా విద్యాసంస్థలు అవకాశం కల్పించాలన్నారు. ఈ విషయాన్ని ప్రైవేట్, ఎయిడెడ్, కార్పొరేట్ యాజమాన్యాలు గమనించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment