వణికిస్తున్న చలిగాలులు
● మినుములూరులో 12..
● అరకులోయలో 13.6..
● చింతపల్లిలో 14 డిగ్రీల
కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
● చలి గుప్పిట్లో గిరిజన గ్రామాలు
సాక్షి,పాడేరు: కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతుండటంతో చలిగాలులు విజృంభిస్తున్నాయి. సాయంత్రం నుంచి వీటి ప్రభావం ఎక్కువగా ఉండటంతో చలిమంటలను ఆశ్రయిస్తున్నాయి. శనివారం పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 12 డిగ్రీలు,అరకులోయ కేంద్ర కాఫీబోర్డు వద్ద 13.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
దట్టంగా పొగమంచు..
చింతపల్లి: చలి తీవ్రత పెరిగింది. ఈ ప్రాంతంలో ఉదయం 9 గంటలు వరకు పొగ మంచు దట్టంగా కురుస్తోంది. ఆదివారం చింతపల్లిలో 14 డిగ్రీలు, జి.మాడుగులలో 10.5 డిగ్రీలు, హుకుంపేటలో 12.5 డిగ్రీలు, పెదబయలులో 13.1 డిగ్రీలు, అనంతగిరిలో 14.2 డిగ్రీలు, కొయ్యూరులో 17.8 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 20.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్, వాతావరణ విభాగం నోడల్ అధికారి ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.
ముంచంగిపుట్టు:రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. పొగ మంచు దట్టంగా కురుస్తుండడంతో రోజువారి పనులకు వెళ్లే కూలీలు, వ్యాపారులు వణుకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment