
సంకల్పం
సహస్ర
వెయ్యి విగ్రహాల ప్రతిష్టే లక్ష్యం
సనాతన ధర్మ సంరక్షణకు సద్గురు సేవాశ్రమం కృషి
కొండంత దేవుడికి అంత గుడిని కట్టలేకపోవచ్చు.. కానీ అనన్య భక్తితో విగ్రహాన్ని ప్రతిష్టించి,
నిండు మనసుతో అర్చిస్తే అంతటి ఆనందం సొంతమవుతుంది. ఆ విధంగా వెయ్యి విగ్రహాల
ప్రతిష్టే లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తోంది సద్గురు సేవాశ్రమం. ఆలయాలు అంతగా లేని
ప్రాంతాలను ఎంచుకుని ఈ విగ్రహాలను ప్రతిష్టిస్తోంది. ఇప్పటికే 899 విగ్రహాలను
ప్రతిష్టించగా అందులో సుమారు 20 మినహా అన్నీ ఆంజనేయస్వామివే కావడం విశేషం. ఇప్పుడు 900వ విగ్రహంగా శివలింగాన్ని ఉగాది పర్వదిన వేళ
అల్లూరి జిల్లా జి.మాడుగులలో ప్రతిష్టించనున్నారు.
ఇప్పటికి 899 విగ్రహాల ప్రతిష్టాపన పూర్తి
నేడు జి.మాడుగులలో 900వ విగ్రహం ప్రతిష్ట
విజయసాయి యోగా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా యోగాలో ఉచిత శిక్షణ, వైద్య శిబిరాల నిర్వహణ, తాగునీటి కొరత ఉన్నచోట బోర్ల తవ్వకాలు, టాంకర్ల ద్వారా తాగునీరు, పైపులైన్ల నిర్మాణం, గిరిజనులకు దుస్తులు, వంటపాత్రలు, చిత్రపటాల పంపిణీ చేపడుతూనే ఉన్నారు. ఈ సేవా కార్యక్రమాలు అన్నింటికీ ఇప్పటి వరకు దాతల సహకారంతో రూ.5 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అంచనా.
తగరపువలస: మానవసేవ, మాధవసేవ, గోసేవ పరమావధిగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగుతోంది జీవీఎంసీ 4వ వార్డు రామయోగి అగ్రహారానికి చెందిన సద్గురు సేవాశ్రమం. 2010 మే నెలలో ఈ సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన కోన అప్పలరాజు అలియాస్ యోగా రాజు 60 మంది వృద్ధులకు ఉచితంగా ఆశ్రయం కల్పించడమే కాకుండా 60 దేశవాళీ ఆవులతో గోశాల నిర్మించారు. మొదట్లో భీమిలి తీరప్రాంతాలైన అన్నవరం, కాపులుప్పాడ, నిడిగట్టు, చేపలుప్పాడ గ్రామాలలో పదుల సంఖ్యలో ఆలయాలు నిర్మించి, అందులో విగ్రహాలు ప్రతిష్టించారు. 2020 నుంచి మాధవసేవను విస్తృతం చేయాలన్న సంకల్పం కారణంగా మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలలో ఆంజనేయుని విగ్రహాలు ప్రతిష్టించడానికి నడుం బిగించారు. ఇప్పటి వరకు అరకు, పాడేరు, పెదబయలు, జీకే వీధి, హుకుంపేట, కొయ్యూరు, రాజఒమ్మంగి, జి.మాడుగుల, చింతూరు, ముంచంగిపుట్టు, అనంతగిరి, చింతపల్లి, డుంబ్రిగుడ మండలాలు శ్రీకాకుళంతో పాటు ఒడిశాలోని కోరాపుట్, జైపూర్, నవరంగ్‌పూర్ జిల్లాలలో విగ్రహాలు, ఆలయాలు కలిపి 899 నిర్మించారు. వీటిలో 20 వరకు మాత్రమే వేంకటేశ్వరస్వామి, శివాలయం, అమ్మవార్ల ఆలయాలు కాగా మిగిలినవన్నీ హనుమంతుని విగ్రహాలే కావడం విశేషం.
మూడేళ్ల క్రితం జి.మాడుగులలో రూ.50 లక్షలతో పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆలయాన్ని నిర్మించా రు. హుకుంపేట మండలం మద్దివీధి శివాలయాన్ని పునరుద్ధరించారు. ములుసోబలో వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. విగ్రహాలు ప్రతిష్టించిన అన్ని ప్రాంతాల్లో మొదటి ఏడాది వరకు పూజా సామగ్రిని వారే అందిస్తారు. ఇప్పటి వరకు అలా రూ.54 లక్షల విలువైన సామగ్రిని అందించారు.
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో ప్రతిష్టించిన ఆంజనేయుని విగ్రహం
విస్తృతంగాసేవా కార్యక్రమాలు

సంకల్పం

సంకల్పం

సంకల్పం

సంకల్పం