సబ్బవరం: మండలంలోని నారపాడు గ్రామంలో వివాహితపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్టు పరవాడ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. సబ్బవరం పోలీస్స్టేషన్లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామానికి చెందిన రాజాన అప్పారావు(36) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన మానసిక వైకల్యంతో ఉన్న మహిళపై అత్యాచారం చేసినట్టు చెప్పారు.
వారం రోజుల కిందట బాధితురాలి భర్త గ్రామంలో లేని సమయంలో మధ్యాహ్నం ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడన్నారు. విషయం బహిర్గతం కాకుండా పెద్దలు న్యాయం చేస్తారనడంతో వెంటనే ఫిర్యాదు ఇవ్వలేదని, అయితే నిందితుడి నుంచి సరైన స్పందన రాకపోవడంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు.
ఈమేరకు ఎస్ఐ ఎల్.సురేష్ కేసు నమోదు చేశారన్నారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిని అరెస్ట్ చేసి సీఐ రంగనాథం జుడీషియల్ రిమాండ్కు తరలించారని చెప్పారు. సమావేశంలో సీఐ రంగనాఽథం, ఎస్ఐ సురేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment