గంజాయి కారు బీభత్సం!
అనుమానిత కారును పొక్లెయిన్ సహాయంతో పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న ఎస్‌ఐ మల్లేశ్వరరావు
దేవరాపల్లి: ఏజెన్సీ ప్రాంతం నుంచి వస్తున్న కారు బుధవారం రాత్రి దేవరాపల్లిలో బీభత్సం సృష్టించింది. శ్రీరాంపురం వై జంక్షన్ సమీపంలో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్టు వద్ద అల్లూ రి జిల్లా వైపు నుంచి దేవరాపల్లి వైపు వస్తున్న అనుమానిత కారును ఆపేందుకు సిబ్బంది ప్ర యత్నించారు. మెరుపు వేగంతో వచ్చిన కారు ఆపకుండా అక్కడి స్టాపర్లను గుద్దుకుంటూ దూ సుకుపోయింది. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న చెక్ పోస్టు సిబ్బంది వెంటనే తేరుకొని కారును వెంబడించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్‌ఐ టి.మల్లేశ్వరరావు, తన సిబ్బందితో కలిసి నాలుగు రోడ్ల జంక్షన్‌లో రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్‌ను పెట్టించారు. కారు టైరు పంక్చర్ కావడంతోపాటు పోలీసులు రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్ పెట్టిన విషయాన్ని గమనించిన సదరు వ్యక్తులు టీటీడీ కల్యాణ మండపం ఎదురుగా ఉన్న డ్రైనేజీలో కారును దించేశారు. కారును అక్కడే విడిచి పెట్టి పరారయ్యారు. పొక్లెయిన్ సహాయంతో కా రును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన కారులో గంజాయి ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే సదరు కారులో గంజా యి ఉందా, ఉంటే ఎంత మేర ఉంది, కారులో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు.. తదితర విషయాలను పో లీస్‌లు ధ్రువీకరించాల్సి ఉంది. ఈ విషయమై ఎస్‌ఐను వివరణగా కోరగా పోలీస్ చెక్ పోస్టు వద్ద స్టాపర్లను గుద్దుకుంటూ కారు దేవరాపల్లి వైపు దూసుకురావడం వాస్తవమేనని, నాలుగు రోడ్ల కూడలిలో ట్రాక్టర్ అడ్డంగా పెట్టడంతో కారును విడిచిపెట్టి అందులో వ్యక్తులు పరారైనట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment