
విశాఖకు ఆగ్నేయ దేశాల బౌద్ధ పర్యాటకులు
విశాఖలో బౌద్ధ క్షేత్రంలో విదేశీ బౌద్ధ పర్యాటకులు
విశాఖ సిటీ: ఆగ్నేయ దేశాల నుంచి బౌద్ధ పర్యాటకుల తొలి బ్యాచ్ విశాఖకు చేరుకుంది. సోమవారం వీరిని కలెక్టర్ హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, వీఎంఆర్‌డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్‌లు స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం ఫోరం అధ్యక్షుడు విజయ్‌మోహన్ ఆధ్వర్యంలో ఈ పర్యాటక బృందం బావికొండ, తొట్లకొండ, పావురాలకొండ, బొజ్జన్నకొండలను సందర్శించింది. ఇక్కడి నుంచి థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్‌లకు విమాన సర్వీసులు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగ్నేయ దేశాల పర్యాటకులే లక్ష్యంగా ఇన్‌బౌండ్ టూరిజంకు శ్రీకారం చుట్టింది.
Comments
Please login to add a commentAdd a comment