
ఈవీఎం గోడౌన్ తనిఖీ
తుమ్మపాల: ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సోమవారం తనిఖీ చేశారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా గోదాములో భద్రపరచిన ఈవీఎం మెషీన్లను, సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు, భద్రతా ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. జిల్లా రెవిన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, ఆర్డీవో షేక్ ఆయిషా, ఎలక్షన్ సెక్టన్ సూపరింటెండెంట్ ఎస్.ఎస్.వి.నాయుడు, రాజకీయపార్టీల ప్రతినిధులు టి.షణ్ముఖ్, బి.శ్రీనివాసరావు, కె.హరినాథబాబు, మీసాల సుబ్బన్న, జి.శ్రీరామ్, అగ్నిమాపక అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment