బావిలో దూకి యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

బావిలో దూకి యువకుడి ఆత్మహత్య

Published Tue, Mar 18 2025 8:34 AM | Last Updated on Tue, Mar 18 2025 8:34 AM

బావిలో దూకి యువకుడి ఆత్మహత్య

బావిలో దూకి యువకుడి ఆత్మహత్య

మాకవరపాలెం: వ్యవసాయ బావిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలాఉన్నాయి. మండలంలోని చామంతిపురం గ్రామానికి చెందిన దుంగల దుర్గాప్రసాద్‌ (17) గ్రామంలో వైరింగ్‌ పనులు చేస్తుంటాడు. అయితే బుచ్చియ్యపేట మండలం పంగిడి గ్రామానికి చెందిన వివాహితతో దుర్గాప్రసాద్‌కు పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ మాట్లాడుకుంటున్న విషయం వివాహిత భర్తకు తెలియడంతో దుర్గాప్రసాద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఫోన్‌ చేసి రమ్మనడంతో భయపడిన దుర్గాప్రసాద్‌ ఆదివారం రాత్రి గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయమై మృతుడు తల్లి రాజేశ్వరి ఇచ్చిని ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ దామోదర్‌నాయుడు తెలిపారు. మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement