రసాయన పరిశ్రమల్లో రక్షణ వ్యవస్థలపై నిరంతర పర్యవేక్షణ
సాక్షి, అనకాపల్లి : పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా కర్మాగారాల లోపల, వెలుపల కూడా రక్షణ వ్యవస్థలను సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా సంక్షోభ నిర్వహణ కమిటీ చైర్మన్ విజయ కృష్ణన్ తెలిపారు. మంగళవారం కలెక్టరు కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఫ్యాక్టరీలలో ఏర్పాటు చేసిన రక్షణ వ్యవస్థల గూర్చి సమీక్ష చేశారు. ఫ్యాక్టరీ లోపల, వెలుపల కూడా రసాయనాలు లీకేజీలను గుర్తించే సెన్సార్లను అమర్చాలని తెలిపారు. ఫ్యాక్టరీలలో అమర్చిన రక్షణ పరికరాలకు, జాతీయ సేఫ్టీ కౌన్సిల్ ఆమోదం ఉండాలని తెలిపారు. ఫ్యాక్టరీ వెలుపల ప్రమాదాలకు సంబంధించిన రక్షణ వ్యవస్థల నివేదికలను 20 రోజుల్లో అందజేయాలని తెలిపారు. కంపెనీలలో శిక్షణ పొందిన కార్మికులను నియమించుకోవాలని ఆదేశించారు. జిల్లాలో గల 12 రసాయన కర్మాగారాల్లో మాక్ డ్రిల్‌ను కూడా నిర్వహించాలని సూచించారు.
రసాయనాలను రవాణా చేసే వాహనాలకు కూడా రసాయనాల లీకేజీలను గుర్తించే సెన్సార్లు అమర్చాలని తెలిపారు. సమావేశంలో రెవిన్యూ డివిజినల్ అధికారి షేక్ ఆయిషా, ఫ్యాక్టరీల జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టరు జె. శివశంకర్ రెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ జి.వి.ఎస్.ఎస్. నారాయణ, జిల్లా పరిశ్రమల అధికారి నాగరాజారావు, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
● జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్
Comments
Please login to add a commentAdd a comment